ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ల వెన్నంటి యావత్తు దేశం ఒక్కటి గా నిలచిందన్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 21 MAY 2020 3:03PM by PIB Hyderabad

అమ్ఫాన్ తుఫాను వాటిల్లజేసిన విధ్వంసం తాలూకు దృశ్యాల ను చూసిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో మరియు ఒడిశా లో పరిస్థితి సాధ్యమైనంత త్వరలో సాధారణ స్థితి కి చేరుకోవాలనే ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి తన మనోభావాలను అనేక ట్వీట్ లలో పొందుపరిచారు.  ఆ ట్వీట్ లలో ‘‘అమ్ఫాన్ తుఫాను కలగజేసిన ప్రతికూల ప్రభావాన్ని ఎంతో ధైర్యం తో ఎదుర్కొన్న ఒడిశా ప్రజల బాధ లో నేను పాలుపంచుకొంటున్నాను.  బాధితుల కు సాధ్యమైన అన్ని రకాలుగాను సాయపడేందుకు అధికారివర్గాలు క్షేత్ర స్థాయి లో శ్రమిస్తున్నారు. స్థితిగతులు వీలయినంత త్వరలో సాధారణ స్థాయి కి చేరుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

తుఫాను ప్రభావిత ప్రాంతాల లో ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి.  అగ్రగామి అధికారులు పరిస్థితి ని నిశితం గా పర్యవేక్షిస్తున్నారు.  వారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తో సన్నిహిత సమన్వయం నెలకొల్పుకొని కలసి పనిచేస్తున్నారు.

బాధితుల కు సాయపడడం లో శాయశక్తులా కృషి చేయడం జరుగుతుంది.

పశ్చిమ బెంగాల్ లో అమ్ఫాన్ తుఫాను కారణం గా వాటిల్లిన విధ్వంసం తాలూకు దృశ్యాల ను గమనించాను.  సవాలు ను రువ్వినటువంటి ఈ కాలం లో, యావత్తు దేశం సంఘీభావం తో ఒక్కటై పశ్చిమ బెంగాల్ వెన్నంటి నిలచింది.  రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కై నేను ప్రార్థిస్తున్నాను.  సాధారణ స్థితి ని ఆవిష్కరించే దిశ గా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 


(Release ID: 1625799) Visitor Counter : 224