ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్స్‌

ప్ర‌పంచంలో ల‌క్ష‌కు 62.3 కోవిడ్ కేసుల‌తో పోలిస్తే ఇండియా లో ల‌క్ష‌కు 7.9 కేసులు మాత్ర‌మే ఉన్నాయి.
కేసుల‌నుంచి కోలుకున్న వారి రేటు 39.6 శాతానికి పెరిగింది.

Posted On: 20 MAY 2020 6:23PM by PIB Hyderabad

వివిధ స్థాయిల‌లో ముంద‌స్తు సానుకూల చ‌ర్య‌ల‌ద్వారా భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో క‌ల‌సి కోవిడ్‌ఖ -19 వ్యాధి నిరోధం, వ్యాప్తిని అరిక‌ట్ట‌డం, నిర్వ‌హ‌ణ‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ది. వీటిని  ఉన్న‌త‌స్థాయిలో క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ర్య‌వేక్షిస్తున్నారు.
      కోవిడ్ -19 వ్యాప్తి వేగం ఇత‌ర దేశాల‌తో పోల్చిన‌పుడు త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. దీని ప్ర‌భావాన్ని కోవిడ్ -19 కేసుల గ‌ణాంకాల‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అత‌ర్జాతీయ స్థాయిలో డాటాను ప‌రిశీలించిన‌పుడు అక్క‌డ ప్ర‌తి ల‌క్ష‌కు 62.3 కేసులు ఉండ‌గా ఇండియాలో ఇప్ప‌టికీ ల‌క్ష‌కు కేవంల 7.9 కేసులు మాత్ర‌మే ఉన్నాయి. అలాగే మ‌ర‌ణాల రేటు ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు అంత‌ర్జాతీయ స‌గ‌టు రేటు 4.2 కాగా భార‌త‌దేశంలో ఇది 0.2 మాత్ర‌మే. ప్ర‌పంచ స్థాయిలో మ‌ర‌ణాల సంఖ్య‌ను ,భార‌త్ లో మ‌ర‌ణాల సంఖ్య‌ను గ‌మ‌నించిన‌పుడు స‌త్వ‌రం కేసుల గుర్తింపు, ఆయా కేసుల‌కు స‌క్ర‌మంగా అందున్న చికిత్స‌ను సూచిస్తాయి.
 చికిత్స‌పై దృష్టిపెట్ట‌డం, రిక‌వ‌రీపై దృష్టి పెట్ట‌డం వ‌ల్ల రిక‌వ‌రీ రేటు పెర‌గ‌డానికి దారితీసింది. ఇప్ప‌టివ‌ర‌కు 39.6 శాతానికి పైగా నిర్ధారిత కేసులవారు వ్యాదిన‌య‌మై ఇంటికి వెళ్ళారు. దీనితో  దేశంలో కోలుకున్న‌వారి సంఖ్య ఈ రోజుకు 42,298 కి చేరింది. దీనిని బ‌ట్టి, ఈ వ్యాధి న‌య‌మౌతుంద‌ని గుర్తుంచుకోవాలి. అలాగే ఇండియా అనుస‌రిస్తున్న క్లినిక‌ల్ మేనేజ్‌మెంట్ విధి విధానాలు  ప‌క‌డ్బందీగా ఉన్నాయ‌ని అర్థ‌మౌతోంది. వ్యాధినుంచి కోలుకున్న  వారి గ‌ణాంకాల‌ను గ‌మ‌నిస్తే 2.9 శాతం మంది యాక్టివ్ కేసుల‌కు సంబంధించిన‌వారు. వీరికి ఆక్సిజ‌న్ మ‌ద్ద‌తు అవస‌రం.చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసుల‌లో 3 శాతానికి ఐసియు సౌక‌ర్యం అవ‌స‌రం. చురుకుగా ఉన్న కేసుల‌లొ 0.45 శాతానికి వెంటిలేట‌ర్ స‌దుపాయం అవ‌స‌రం. ఇండియా దీనితోపాటుగా కోవిడ్ ప్ర‌త్యేక ఆరోగ్య మౌలిక స‌దుపాయాల స్థాయిని పెంచ‌డంలో ప్ర‌ధానంగా దృష్టిపెడుతున్న‌ది.
     కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/, @MoHFW_INDIA
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు ట్వీట్స్ @CovidIndiaSeva .
కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .


(Release ID: 1625574) Visitor Counter : 250