మంత్రిమండలి

ప్రస్తుతమున్న "పాక్షిక రుణ హామీ పథకం (పిసిజిఎస్)" సవరణలకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
'ఏఏ' అంతకంటే తక్కువ రేటింగ్‌తో బాండ్స్ కానీ కమర్షియల్ పేపర్స్ (సిపి)కానీ పిఎస్బి లు కొనుగోలు చేయడానికి పోర్ట్‌ఫోలియో హామీ

Posted On: 20 MAY 2020 2:30PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్, ఏఏ, అంతకంటే తక్కువ రేటింగ్‌తో (ఒక సంవత్సరం వరకు అసలు / ప్రారంభ పరిపక్వతతో అన్‌రేటెడ్ పత్రంతో సహా) బాండ్స్ కానీ కమర్షియల్ పేపర్స్ (సిపి) కానీ  కొనుగోలు కోసం మొదటి నష్టంలో 20% వరకు సావరిన్ పోర్ట్‌ఫోలియో గ్యారెంటీని ఆమోదించింది. పాక్షిక క్రెడిట్ హామీ పథకం (పిసిజిఎస్) పొడిగింపు ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌బి) ఎన్‌బిఎఫ్‌సి / ఎంఎఫ్‌సి / మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్‌ఐ) జరీ చేశాయి. 

సమీకరించిన ఆస్తుల కొనుగోలుపై  ప్రస్తుతమున్న "పాక్షిక రుణ హామీ పథకం (పిసిజిఎస్)" సవరణలకు కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపింది, వర్తింపు పరిధి పెంచింది. 

ప్రస్తుతమున్న పిసిజిఎస్ 11.12.2019 న జారీ చేయబడింది. ఆర్థికంగా పరిపుష్టి కలిగిన ఎన్‌బిఎఫ్‌సిలు / ఎంఎఫ్‌సిల నుండి ఇది బిబిబి + లేదా అంతకంటే ఎక్కువ విలువైన రూ. 1,00,000 కోట్లు పైబడి సమీకరించిన ఆస్తులను కొనుగోలు చేయడానికి పిఎస్బి లకు 10% మొదటి నష్టం వరకు సావరిన్ గ్యారంటీ ఇస్తుంది. వ్యాపార కార్యకలాపాల లాక్‌డౌన్‌తో పాటు కోవిడ్-19 వ్యాప్తి చెందడంతో ఇప్పుడు ఎన్బిఎఫ్సి లు, హెచ్ఎఫ్సి లకు మద్దతు ఇవ్వడానికి అదనపు చర్యలను అవలంబించాల్సిన అవసరం ఉంది - రుణ బాధ్యతల వైపు చుస్తే ఎన్బిఎఫ్సిలు / హెచ్ఎఫ్సిలు, ఎంఎఫ్ఐ లు జారీ చేసిన బాండ్లు / సిపిల కొనుగోలుకు సార్వభౌమ హామీని ఇవ్వడం, చిన్న రుణగ్రహీతలకు క్రెడిట్‌ను విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రస్తుత కవరేజీని విస్తరించడానికి ప్రస్తుత పిసిజిఎస్‌ను సవరించడం జరిగింది. 

 

కేంద్రం అందించే ఈ వన్-టైమ్ పాక్షిక క్రెడిట్ హామీ కోసం 2021 మార్చి 31 వరకు తలుపులు తెరిచి ఉంటాయి.

చిన్న, మధ్యతరహా విభాగంలో వినియోగ డిమాండ్‌ను అలాగే మూలధన నిర్మాణాన్ని కొనసాగించడంలో ఎన్‌బిఎఫ్‌సిలు, హెచ్‌ఎఫ్‌సిలు, ఎంఎఫ్‌ఐలు కీలక పాత్ర పోషిస్తున్నందున, అవి అంతరాయం లేకుండా నిధులను పొందడం కొనసాగించడం చాలా అవసరం, మరియు విస్తరించిన పిసిజిఎస్ క్రమపద్ధతిలోనే దీన్ని ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.(Release ID: 1625551) Visitor Counter : 124