మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
10 వ తరగతి మరియు 12వ తరగతి మిగిలిన పరీక్షల తేదీలను ప్రకటించిన - కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి.
Posted On:
18 MAY 2020 5:04PM by PIB Hyderabad
సి.బి.ఎస్.ఈ. 10వ తరగతి మరియు 12వ తరగతి మిగిలిన పరీక్షల తేదీలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిషాంక్' ఈ రోజు న్యూ ఢిల్లీ లో ప్రకటించారు. 10వ తరగతి పరీక్షలు ఈశాన్య ఢిల్లీ లోని విద్యార్థులకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలియజేసారు. కాగా, 12వ తరగతి పరీక్షలు ఈశాన్య ఢిల్లీ విద్యార్థులతో సహా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ పరీక్షలన్నీ ఉదయం 10 గంటల 30 నిముషాల నుండి ఒకటిగంట 30 నిముషాల వరకు జరుగుతాయి.
https://twitter.com/DrRPNishank/status/1262287732883156994?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1262287732883156994&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1624881
https://twitter.com/DrRPNishank/status/1262289406871781376?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1262289406871781376&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1624881
శ్రీ పోఖ్రియాల్ ఇంతకు ముందు మే 5వ తేదీన వెబినార్ ద్వారా విద్యార్థులతో సంభాషిస్తూ, సి.బి.ఎస్.ఈ. 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలు జులై 1వ తేదీ నుండి 15వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా పోఖ్రియాల్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఉండే విధంగా, హెచ్.ఆర్.డి. మంత్రిత్వ శాఖ, పరీక్షల తేదీలను ప్రకటించే ముందు ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని చెప్పారు. ఇప్పుడు విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడంపై దృష్టి కేంద్రీకరించవచ్చునని కూడా ఆయన చెప్పారు. పరీక్షలు నిర్వహించే సమయంలో, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యపరిరక్షణ ను దృష్టిలో పెట్టుకుని దూరం నిబంధనను ఖచ్చితంగా పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలని కూడా సి.బిఎస్.ఈ. ని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
10వ తరగతి పరీక్షల తేదీల కోసం ఇక్కడ నొక్కండి.
12వ తరగతి పరీక్షల తేదీల కోసం ఇక్కడ నొక్కండి.
*****
(Release ID: 1624899)
Visitor Counter : 214
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam