హోం మంత్రిత్వ శాఖ

మే 31, 2020 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

- వివిధ మండలాలు మ‌రియు అందులోని అనుమతించవలసిన కార్య‌క‌లాపాల‌ను నిర్ణ‌యించే అధికారం రాష్ట్రాల‌కే; దేశవ్యాప్తంగా కొన్ని కార్యకలాపాల‌పై నిషేధం కొన‌సాగుతుంది
- కోవిడ్ ‌-19 నిర్వహణ నిమిత్తం జారీ చేసిన జాతీయ ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయి
- రాత్రి వేళ‌ల్లో కర్ఫ్యూ అమలు ఇక‌పై కూడా కొన‌సాగుతుంది

Posted On: 17 MAY 2020 8:13PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు గా‌ను మార్చి 24వ తేదీ నుంచి అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ చర్యలు మ‌హ‌మ్మారి వ్యా‌ప్తి నివార‌ణ‌కు గణనీయంగా దోహ‌దం చేస్తున్నాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ను మే 31, 2020 వరకు పొడిగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ), భారత ప్రభుత్వం (జీఓఐ) ఆదివారం విపత్తు నిర్వహణ (డీఎం) చట్టం 2005 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త మార్గదర్శకాల యొక్క ముఖ్య లక్షణాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
జోన్ల‌ను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలే నిర్ణ‌యిస్తాయి..
- కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన పారామితులను పరిగణనలోకి తీసుకొని వివిధ జోన్ల‌ను రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలే (యుటీలు) నిర్ణ‌యిస్తాయి.
-ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన పారామితుల మేర‌కు రెడ్‌, గ్రీన్ మ‌రియు ఆరెంజ్ జోన్ల‌ను నిర్ణ‌యిస్తాయి.
- ఈ జోన్‌ల ప‌రిధి ఒక జిల్లా కానీ లేద మండ‌లాలు కానీ లేదా మునిసిపల్ కార్పొరేషన్ / మునిసిపాలిటీ లేదా రాష్ట్రాలు మరియు యుటీలచే నిర్ణయించబడిన ఇత‌ర ఉప-విభాగాలు వంటి చిన్న పరిపాలనా విభాగాలు కూడా కావచ్చు.
- ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకొని తరువాత స్థానిక అధికారులు
రెడ్‌, గ్రీన్ మ‌రియు ఆరెంజ్ జోన్ల‌లోని కంటైన్‌మెంట్‌ మరియు బఫర్ జోన్లుగా ప్ర‌క‌టిస్తారు.
- కంటైన్‌మెంట్ జోన్ల‌లో అత్య‌వసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయి.
- ఈ జోన్ల‌లో కఠినమైన చుట్టుకొలత నియంత్రణ నిర్వహించబడుతుంది మరియు వైద్య అత్యవసర పరిస్థితులు మరియు అత్య‌‌వసరమైన వస్తువులు మరియు సేవల సరఫరాను నిర్వహించడం మినహా ఎలాంటి వ్యక్తుల కదలికలు అనుమతించబడవు.
- కంటైన్‌మెంట్ జోన్ ప‌క్క‌నే ఉండే బఫర్ జోన్ల‌లోని ప్రాంతాల‌లో కొత్త కేసులు ఎక్కువగా వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. కావున‌ బఫర్ జోన్లలో మరింత జాగ్రత్త వహించాలి.

దేశవ్యాప్తంగా నిషేధించబడ్డ కార్యకలాపాలుః
దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో కార్యకలాపాలు నిషేధించబడతాయి. వాటిలో ఈ కిందివి కూడా ఉండనున్నాయి..
- దేశీయ వైద్య సేవలు, దేశీయ వాయు అంబులెన్స్ మరియు ఎంహెచ్ఏ అనుమతించిన భద్రతా ప్రయోజన వాయు ప్ర‌యాణాలు లేదా దేశ ప్రయోజనాల కోసం చేసే విమాన ప్ర‌యాణాలు త‌ప్ప అన్ని దేశీయ మరియు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు; మెట్రో రైలు సేవలు; పాఠశాలలు, కళాశాలలు, విద్యా మరియు శిక్షణ / కోచింగ్ సంస్థల నిర్వహణ; హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇతర ఆతిథ్య సేవల‌పై నిషేధం కొన‌సాగుతుంది.
-బస్ డిపోలు, రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాలలో క్యాంటీన్ల నిర్వహణ మినహా అత్య‌ధికంగా జ‌నాలు గుమ్మిగూడేందుకు అవ‌కాశం ఉన్న సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, వ్యాయామ శాలలు వినోద ఉద్యానవనాల‌పై కూడా నిషేధం కొన‌సాగనుంది.
- సామాజిక, రాజకీయ, సాంస్కృతిక త‌ర‌హా సమావేశాల‌తో పాటు ఇతర భారీ సమ్మేళనాలు; ‌మతపరమైన ప్రదేశాలకు / ప్రార్థనా స్థలాల‌కు అనుమ‌తి లేదు. ఆన్‌లైన్ / దూరవిద్యకు అనుమతి ఇవ్వ‌డంతో పాటు ప్రోత్సహించబడాలి; మరియు, ఆహార పదార్థాల‌ను ఇంటికి పంపిణీ చేసేందుకు వీలుగా రెస్టారెంట్ల‌లోని వివిధ వంటశాలలను నిర్వహించడానికి త‌గు విధంగా అనుమతించబడతాయి.
క్రీడా కార్యకలాపాలకు అనుమ‌తి..
- క్రీడా కార్యకలాపాలకు మాత్రమే క్రీడా సముదాయాలు మరియు స్టేడియాలను తెరవడానికి అనుమతి ఉంటుంది. అయితే, ఈ త‌ర‌హా కాంప్లెక్స్‌లలో ప్రేక్షకులను అనుమతించరు.

పరిమితులతో అనుమ‌తించ‌బ‌డే కార్యాక‌లాపాలు..
- దేశంలో వ్యక్తుల కదలికను మ‌రింత సులభతరం చేయడానికి, వివిధ రవాణా మార్గాలు ఇప్పటికే తెరవబడ్డాయి. రైళ్ల ద్వారా వ్యక్తుల కదలికకు గాను కేంద్ర హోం శాఖ వెల్ల‌డించిన 11.05.2020 నాటి ఉత్తర్వుల‌లో ఇప్ప‌టికే వీటిని అనుమతించారు. అంతేకాకుండా, భారత దేశం నుండి విదేశీ పౌరులను తరలించడం, విదేశాల చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి భార‌త్‌కు తీసుకు రావడం, భారతీయ నౌకాదళాల సైన్-ఆన్ మరియు సైన్-ఆఫ్ మరియు బస్సు మరియు రైళ్ల‌ ద్వారా ఒంటరిగా చిక్కుకుపోయి ఉన్న వ్యక్తులను ఆయా రాష్ట్రముల‌లోనూ, ఇత‌ర‌ రాష్ర్టాల మ‌ధ్య‌ ర‌వాణాకు కూడా అనుమ‌తులు కొన‌సాగుతాయి.
- సంబంధిత రాష్ట్రాలు / కేంద్ర‌పాలిత ప్రాంతాల పరస్పర స‌మ్మ‌తితో వాహనాలు మరియు బస్సుల అంతర్-రాష్ట్ర ర‌వాణా కూడా అనుమతించబడింది. వాహనాలు మరియు బస్సుల యొక్క అంతర్-రాష్ట్ర కదలికను రాష్ట్రాలు మరియు యుటీలు నిర్ణయించవచ్చు.

కోవిడ్‌-19 నిర్వహణ నిమిత్తం జాతీయ ఆదేశాలుః
కోవిడ్‌-19 నిర్వహణలో భాగంగా బహిరంగ ప్రదేశాలు మరియు కార్యాలయాలకు జాతీయ ఆదేశాలు నిర్దేశించిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఇలా ఉన్నాయి..
- ఈ మార్గదర్శకాల ప్రకారం ముఖానికి మాస్క్‌లు ధరించడం తప్పనిసరి; ఉమ్మివేయడం త‌గిన విధంగా జరిమానాతో శిక్షించబడుతుంది. దీనికి సంబంధించి చట్టాలు, నియమాలు లేదా నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర / యుటీ స్థానిక ప్ర‌భుత్వాలు ‌సూచించిన విధంగా ఈ త‌ర‌హా జ‌రిమానాలు ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో మరియు రవాణాలో ఉన్న అన్ని వ్యక్తులు త‌ప్ప‌ని స‌రిగా సామాజిక దూరాన్ని పాటించాలి. వివాహ సంబంధిత సమావేశానికి 50 కంటే ఎక్కువ అతిథులు ఉండకూడదు. అంత్యక్రియలు / చివరి క‌ర్మ‌ల‌కు గాను గరిష్టంగా 20 మందిని మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం, పాన్, గుట్కా మరియు పొగాకు మొదలైన వాటిని సేవిచ‌డం అనుమతించబడదు.
ప‌ని ప్ర‌దేశాలకు సంబంధించిన నిబంధ‌న‌లు..‌
-పని ప్రదేశాలలో అదనపు అవసరాల నిమిత్తం జాతీయ ఆదేశాలు నిర్దేశించ‌బ‌డ్డాయి. ఇంటి నుండి (డ‌బ్ల్యూఎఫ్‌హెచ్‌) పని సాధన సాధ్యమైనంత గ‌రిష్టంగా పాటించాలి; మరియు అన్ని కార్యాలయాలు మరియు ఇతర సంస్థలకు సంబంధించి పని గంటలను అస్థిరంగా ఉంచాలి.
అన్ని ఎంట్రీ మరియు ఎగ్జిట్ పాయింట్లు మరియు సాధారణ ప్రాంతాలలో థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ మరియు శానిటైజర్ల సదుపాయం క‌ల్పించాలి; మరియు అన్ని పని ప్రదేశాలు మరియు ఇతర సున్నితమైన ప్రదేశాలు క్రమం తప్పకుండా శుభ్రపరుస్తూ ఉండాలి. పని ప్రదేశాలలో, కార్మికుల మధ్య తగినంత దూరం, షిఫ్ట్‌ల మధ్య తగినంత అంతరాలు, సిబ్బంది భోజన విరామాన్ని అస్థిరపరచడం మరియు మొదలైన వాటి ద్వారా సామాజిక దూరం కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది.
దుకాణాలు మరియు మార్కెట్లకు సంబంధించిన నిబంధనలు..
- సామాజిక దూరాన్ని నిర్ధారించడానికి స్థానిక అధికారులు షాపులు మరియు మార్కెట్ల‌ను అస్థిరమైన సమయాలతో తెరిచి ఉంచేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అన్ని దుకాణాలలో కస్టమర్లు ఆరు అడుగుల దూరం (రెండు గ‌జాల దూరం) ఉండేలా చూడాలి. ఒకేసారి 5 మందికి పైగా వ్యక్తులను అనుమతించకూడదు.
క‌రోనా నేప‌థ్యంలో రాత్రి వేళ‌ల్లో కర్ఫ్యూ..
- రాత్రి 7 నుండి ఉదయం 7 గంటల మధ్య అన్ని అనవసరమైన కార్యకలాపాల కోసం వ్యక్తుల కదలికలపై నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

ప్ర‌మాదం పొంచి ఉన్న వ్య‌క్తుల‌కు ర‌క్ష‌ణ‌..
క‌రోనా కార‌ణంగా ప్ర‌మాదం పొంచి ఉన్న వ్య‌క్తులు అన‌గా 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ఇత‌ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు, గర్భిణీ స్త్రీలు మరియు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు  అత్య‌వ‌స‌రాలు ఆరోగ్య విష‌యాల‌కు త‌ప్ప ‌బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.
- నిషేధించబడిన లేదా పరిమితం చేయబడిన పరిమిత సంఖ్యలో మినహా అన్ని కార్యకలాపాలు అనుమతించబడతాయి. ఈ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేకంగా నిషేధించబడినవి మినహా మిగతా అన్ని కార్యకలాపాలు అనుమతించబడతాయి. ఏదేమైనా కంటైన‌ర్‌ జోన్లలో ముందు చెప్పినట్లు అవసరమైన కార్యకలాపాలు మాత్రమే అనుమతించబడతాయి.
- పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా వివిధ జోన్ల‌లో అనుమ‌తించద‌గిన ప‌లు కార్యకలాపాలను రాష్ట్రాలు / ‌యూటీలు నిర్ణ‌యిస్తాయి. అవసరమని భావిస్తే త‌గిన పరిమితులను విధించవచ్చు.

ఆరోగ్య‌సేతు వాడ‌కం..
కోవిడ్ -19 బారిన పడిన వ్యక్తులను త్వరగా గుర్తించడానికి లేదా వైర‌స్ సోకే ప్ర‌మాదం ఉన్న వారిని త్వరగా గుర్తించడానికి భారత ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు మొబైల్ అనువర్తనం ఒక శక్తివంతమైన సాధనం. ఇది వ్యక్తుల‌కు సమాజానికి ఒక కవచంగా పని చేస్తుంది. ఆయా  కార్యాలయాల్లో భద్రతను నిర్ధారించ‌డంలో భాగంగా ఉత్తమ ప్రయత్న ప్రాతిపదికన యజమానులు మొబైల్ ఫోన్‌లను కలిగి ఉన్న ఉద్యోగులందరూ ఈ మొబైల్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొనేలా చూడాలి. మొబైల్ ఫోన్లలో ఆరోగ్య సేతు అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయాలని.. మరియు వారి ఆరోగ్య స్థితిని యాప్‌లో క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని వ్యక్తులకు సూచించాలంటూ ఇప్ప‌టికే జిల్లా అధికారులను కోర‌డ‌మైంది. ఇది ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు సకాలంలో వైద్య సహాయం అందించడానికి త‌గిన విధంగా వీలు కల్పిస్తుంది. రాష్ట్ర / యుటీ ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను క‌చ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంద‌ని మరియు అవి విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం జారీ చేయబడిన అన్ని మార్గదర్శకాలను ఏ విధంగానూ త‌క్కువ చేయ‌కుండా జాగ్ర‌త్త వ‌హించాలి.
లాక్‌డౌన్ పొడిగింపు ఆదేశాలు స‌వ‌రించిన జాతీయ మార్గ‌ద‌ర్శ‌లను తెలుసుకొనేందుకు గాను ఇక్క‌డ క్లిక్ చేయండి..

 


(Release ID: 1624800) Visitor Counter : 423