ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఏడు రంగాలలో ప్రభుత్వ సంస్కరణలు ,వాటిని బలోపేతం చేసే చర్యలను ఆర్థిక మంత్రి ప్రకటించారు ముఖ్యాంశాలు:
--ఉపాధిని పెంపొందించేందుకు ఎం.జి.ఎన్ఆ.ర్.ఇ.జి.ఎస్. పథకానికి కేంద్ర ప్రభుత్వం 40,000 కోట్ల రూపాయల కేటాయింపు పెంపు.
--భారతదేశాన్ని ఇతర మహమ్మారులనుంచి రక్షించేందుకు ప్రజారోగ్యం , ఇతర ఆరోగ్యరంగ సంస్కరణలకు పెట్టుబడుల పెంపు
-- కోవిడ్ అనంతరం టెక్నాలజీ చోదిత సమానత్వంతో కూడిన విద్య
--ఐబిసి సంబంధిత చర్యల ద్వారా సులభతర వాణిజ్యం మరింత పెంపు
-- కంపెనీ చట్టంకింద డిఫాల్ట్‌ల డీ క్రిమినలైజేషన్
--కార్పొరేట్లకు సులభతర వాణిజ్యం
--నూతన,స్వావలంబిత భారతదేశానికి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ
-- రాష్ట్రాల రుణ పరిమితులను 2020-21 సంవత్సరానికి 3 శాతం నుంచి 5 శాతానికి పెంపు, రాష్ట్రాల స్థాయిలో సంస్కరణలకు ప్రోత్సాహం
Posted On:
17 MAY 2020 3:11PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సమగ్ర ప్యాకేజీని 2020 మే 12న ప్రకటించారు. ఇది భారతదేశ జిడిపిలో పదిశాతం. ప్రధానమంత్రి ఈ సందర్బంగా ఆత్మనిర్భర భారత్ అభియాన్ లేదా స్వావలంబిత భారత్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన ఆత్మనిర్భర భారత్‌కు సంబంధించిన ఐదు స్తంభాల గురించి ప్రస్తావించారు. అవి ఆర్థిక, మౌలిక సదుపాయాలు, వ్యవస్జ, చైతన్యవంతమైన జనాభా, డిమాండ్
ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా వివిధ రంగాలను ముందుకు తీసుకువెళ్ళేందుకు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు 5వ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈనెల 12 వ తేదీన దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించిన దార్శనికత గురించి ఆమె ప్రస్తావించారు.
ప్రధానమంత్రి ప్రసంగాన్ని గుర్తుచేస్తూ శ్రీమతి సీతారామన్, ఒక దేశంగా మనం ఎంతో కీలక దశలో నిలబడి ఉన్నామన్నారు. కోవిడ్ -19 మనకు ఒక సందేశాన్ని, ఒక అవకాశాన్నీ మోసుకొచ్చిందని చెప్పారు. మనం ఇప్పుడు ఆత్మ నిర్భర భారత్‌ను నిర్మించాల్సి ఉందన్నారు.
ఆత్మ నిర్భర భారత్ సంకల్పాన్ని రుజువుచేయడానికి భూమి, కార్మికులు, లిక్విడిటి, చట్టాలకు సంబంధించిన వాటన్నింటినీ ఆత్మనిర్భర భారత్ ప్యాకేజ్‌లో ప్రస్తావించడం జరిగిందన్నారు. సంక్షోభం , సవాలు ఇవి రెండూ స్వావలంబిత భారత్ నిర్మాణానికి ఒక అవకాశమని శ్రీమతి సీతారామన్ అన్నారు.
ఇవాళ చేసిన ప్రకటనలు వరుసగా చేపడుతున్న సంస్కరణలకు కొనసాగింపు అని చెప్పారు. లాక్ డౌన్ అనంతరం మేం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన( పిఎంజికెపి)ని తీసుకువచ్చాం. 1.70 లక్షల కోట్లరూపాయల పిఎంజికెపిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత ఆహారధాన్యాల పంపిణీ చేశామన్నారు. అలాగే పేదలు, మహిళలు, వయోధికులు, రైతులకు నగదు పంపిణీ చేపట్టినట్టు చెప్పారు. ఈ పథకం సత్వర అమలును నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. పిఎంజికెపి పథకం కింద 41 కోట్ల మంది పేదలు 52,608 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందుకున్నారన్నారు. ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీకి పిఎంజికెపి టెక్నాలజీని వాడిందని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా చేపట్టిన చర్యల వల్ల తాము ఏం చేయగలగుతున్నామో ఆమె చెప్పారు..
దీనికితోడు, రాష్ట్రాలు 84 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను అందుకున్నాయి. అలాగే 3.5 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను వివిధ రాష్ట్రాలకు పంపండం జరిగిందన్నారు. లాజిస్టిక్స్ విషయంలో సవాళ్ళు ఉన్నప్పటికీ ,ఇందుకోసం ఎఫ్.సి.ఐ, నాఫెడ్ రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆహారధాన్యాలు, పప్పులు అందజేసినందకు వారి కృషిని అభినందించారు.
ప్రభుత్వ సంస్కరణలు, వివిధరంగాలను బలోపేతం చేసే చర్యలలో ఐదవది, చివరి విడత చర్యలను ప్రకటిస్తూ కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఉపాధి కల్పన, వ్యాపారాలకు మద్దతు, సులభతర వాణిజ్యం, రాష్ట్రప్రభుత్వాలు , విద్య, ఆరోగ్య తదితర రంగాలకు సంబంధించి ఏడు చర్యలను ప్రకటించారు.
1. ఉపాధిపెంపునకు ఊతం ఇచ్చేందుకు ఎంజిఎన్ఆర్ఇ జిఎస్ కేటాయింపులు 40,000 కోట్ల రూపాయలు పెంపు:
ఎంజిఎన్ ఆర్ ఇజిఎస్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అదనంగా 40,000 కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. ఇది మొత్తంగా సుమారు 300 కోట్ల మంది వ్యక్తుల పనిదినాలు కల్పించడానికి ఉపకరిస్తుంది. అంటే మరింత పని కల్పించడానికి, అలాగే వర్షాకాలంలో తిరిగి వచ్చే వలసకూలీలకు పనులు కల్పించడానికి కూడా ఉపకరిస్తుంది. నీటి సంరక్షణ ఆస్తులతో సహా పెద్ద సంఖ్యలో మన్నికైన జీవనోపాధి ఆస్తులను సృష్టించడంవల్ల అధిక ఉత్పత్తి వచ్చి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది.
2. ఆరోగ్య రంగ సంస్కరణలు, చొరవ:
ఆరోగ్య రంగంలో ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతారు. ఇందుకు క్షేత్రస్థాయిలో ఆరోగ్య సంస్థలపై పెట్టుబడి పెడతారు. గ్రామీణ ,పట్టణ ప్రాంతాలలో ఆరోగ్య , వెల్‌నెస్ కేంద్రాల పెంపునకు చర్యలు తీసుకుంటారు. అన్ని జిల్లాలలో అంటు వ్యాధుల ఆస్పత్రి బ్లాక్ లు ఏర్పాటు చేస్తారు. వ్యాధినిర్ధారణ పరీక్షల ల్యాబ్ నెట్ వర్క్‌ను బలోపేతం చేస్తారు. అన్ని జిల్లాలు, బ్లాక్ స్థాయి ల్యాబ్ లలో , పబ్లిక్ హెల్త్ యూనిట్లను సమీకృతం చేయడం ద్వారా మహమ్మారి జబ్బులను నియంత్రించడానికి ఎప్పటికప్పుడు నిఘా కు చర్యలు తీసుకుంటారు.
దీనికి తోడు ఐసిఎం ఆర్ సారథ్యంలో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లాట్‌ఫాం ఫర్ ఒన్ హెల్త్ కింద పరిశోధనలను ప్రోత్సహిస్తారు. అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్ ను అమలు చేస్తారు
3. కోవిడ్ అనంతర కాలంలో సమానత్వంతో కూడిన సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత విద్య :
పిఎం ఈ విద్య పేరుతో, డిజిటల్ ,ఆన్‌లైన్ విద్యకు మల్టీ-మోడ్ యాక్సెస్ కోసం ఒక కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించడం జరుగుతుంది. మనోదర్పణ్, మానసిక ఆరోగ్యం ,మానసిక క్షేమం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు ,వారి కుటుంబాలకు మానసిక-సామాజిక మద్దతునిచ్చే ఒక ప్రయత్నం వెంటనే ప్రారంభించబడుతుంది. పాఠశాలలు, శిశు విద్య , ఉపాధ్యాయుల కోసం కొత్త జాతీయ పాఠ్య ప్రణాళిక, బోధనా ఫ్రేమ్ వర్క్ ప్రారం భించబడుతుంది. 2025 నాటికి ప్రతి బిడ్డ 5 వ తరగతి నాటికి అభ్యసన సామర్థ్యాలు పొందే విధంగా ఫలితాలను సాధించేలా చూడటానికి నేషనల్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్ 2020 డిసెంబర్ నాటికి ప్రారంభించబడుతుంది
4. ఐబిసి సంబంధిత చర్యల ద్వారా సులభతర వ్యాపారం మరింత పెంపు :
దివాలా చర్యలను ప్రారంభించడానికి కనీస పరిమితి రూ. 1 కోటికి పెంపు (రూ. లక్ష నుండి పెంచారు, ఇది ఎక్కువగా ఎంఎస్‌ఎంఇలను ఇన్సులేట్ చేస్తుంది). సంబంధిత దివాలాకోడ్ సెక్షన్ 240 ఎ కింద ఎంఎస్‌ఎంఇల కోసం ప్రత్యేక దివాలా తీర్మానం ఫ్రేమ్‌వర్క్ ను త్వరలో ప్రకటిస్తారు.
కోవిడ్ మహమ్మారి పరిస్థితిని బట్టి, ఒక సంవత్సరం వరకు దివాలా చర్యలు తాజాగా చేపట్టడాన్ని నిలిపివేస్తారు. కోవిడ్ -19 సంబంధిత రుణాన్ని, దివాలా చర్యలు ప్రారంభించకుండా కోడ్ కింద “డిఫాల్ట్” నిర్వచనం నుండి మినహాయించటానికి కేంద్ర ప్రభుత్వానికి వీలు కల్పిస్తారు.
5. కంపెనీల చట్టం ఉల్లంఘనలను నేరపూరిత చర్యలుగా చూడడం నుండి మినహాయింపు:
కంపెనీల చట్టానికి సంబంధించి చిన్న చిన్న సాంకేతిక, ప్రక్రియా పరమైన ఉల్లంఘనలు అంటే,సిఎస్ఆర్ రిపోర్టింగ్ ల్ లోపాలు, బోర్డ్ రిపోర్ట్‌లో తగిన వివరాలు లేకపోవడం, ఫైలింగ్ ఉల్లంఘనలు, ఎజిఎం నిర్వహణలో జాప్యం వంటి ఉల్లంఘనలను నేరపూరిత చర్యలుగా చూడకుండా చర్యలు . ఈ సవరణలు క్రిమినల్ కోర్టులు, ఎన్‌సిఎల్‌టిలపై కేసుల భారాన్ని తగ్గిస్తాయి. 7 రకాల కాంపౌండబుల్ నేరాలను మొత్తంగా ఉపసంహరించుకున్నారు. మరో ఐదింటిని ప్రత్యామ్నాయ ఫ్రేమ్ వర్క్ కింద చేపడతారు.
6. కార్పొరేట్లకు సులభతర వ్యాపారం:
కీలక సంస్కరణలు కింది విధంగా ఉన్నాయి అవి:
--అనుమతించదగిన విదేశీ అధికార పరిధిలో, భారతీయ ప్రభుత్వ సంస్థల సెక్యూరిటీల డైరెక్ట్ లిస్టింగ్.
--స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఎన్‌సిడిలను లిస్ట్ చేసే ప్రైవేట్ కంపెనీలను లిస్టెడ్ కంపెనీలుగా పరిగణించరు
--కంపెనీల చట్టం, 1956 లోని పార్ట్ IXA (ప్రొడ్యూసర్ కంపెనీలు) లోని నిబంధనలను 2013 కంపెనీల చట్టంలో చేర్పు.
-- ఎన్‌సిఎల్ఎటికి ప్రత్యేక, అదనపు బెంచ్‌లు ఏర్పాటు చేసుకునే అధికారం.
-- చిన్న కంపెనీలు, ఏక వ్యక్తి కంపెనీలు, ప్రొడ్యూసర్ కంపెనీలు, స్టార్టప్‌ల అన్ని రకాల డిఫాల్ట్‌లకు తక్కువ మొత్తంలో పెనాల్టీలు.
7. నూతన, స్వావలంబిత భారతదేశానికి పబ్లిక్ సెక్టర్ ఎంటర్ ప్రైజెస్ పాలసీ:
ప్రభుత్వం ఇందుకు సంబంధించి నూతన విధానాన్ని ప్రకటించనుంది. దాని ప్రకారం,
--ప్రజా ప్రయోజనం రీత్యా పిఎస్‌ఇల ఉనికి అవసరమయ్యే వ్యూహాత్మక రంగాల జాబితా ను ప్రకటిస్తారు.
--వ్యూహాత్మక రంగాలలో, ప్రభుత్వ రంగంలో కనీసం ఒక సంస్థ అయినా ఉంటుంది, అయితే ప్రైవేటు రంగాన్ని కూడా అనుమతిస్తారు.
-- ఇతర రంగాలలో, పిఎస్‌ఇ లను ప్రైవేటీకరిస్తారు. ( ఇందుకు సమయం , సాధ్యతపై ఆధారపడి ఉంటుంది.)
-- అనవసర పరిపాలనా ఖర్చులను తగ్గించడానికి, వ్యూహాత్మక రంగాలలోని సంస్థలు సాధారణంగా ఒకటి నుండి నాలుగు వరకు ఉంటాయి; ఇతర సంస్థలను ప్రైవేటీకరణ లేదా విలీనం చేస్తారు. హోల్డింగ్ కంపెనీల పరిధిలోకి తెస్తారు
8. రాష్ట్రప్రభుత్వాలకు మద్దతు:
2020-21 సంవత్సరానికి రాష్ట్రాల రుణ పరిమితులను 3 శాతం నుండి 5 శాతానికి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనపు వనరులు సమకూరుతాయి. తీసుకునే రుణాలలో కొంత భాగం నిర్దిష్ట సంస్కరణలతో (ఆర్థిక కమిషన్ సిఫారసులతో సహా) అనుసంధానిస్తారు.
సంస్కరణల అనుసంధానం నాలుగు విభాగాలలో ఉంటుందిఅవి, ‘వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్’ ను సార్వత్రికం చేయడం, సులభతర వ్యాపారం, విద్యుత్ పంపిణీ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాలు.
డిపార్టమెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ కింది పద్ధతిలో ఒక ప్రత్యేక పథకాన్ని నోటిఫై చేస్తుంది.
-- షరతులు లేకుండా 0.50 శాతం పెంపు
-- 0.25% లోని 4 ట్రెంచ్‌లలో 1%, ప్రతి ట్రెంచ్ ను స్పష్టంగా పేర్కొన్న, కొలవగల , సాధ్యతగల సంస్కరణ చర్యలతో అనుసంధానిస్తారు
--- నాలుగు సంస్కరణ అంశాలలో కనీసం మూడింటిలో లక్ష్యాలను సాధిస్తే అదనంగా 0.50శాతం
ఆత్మ నిర్భర్ భారత్ సాధించడానికి ఇప్పటివరకు అందించిన ఉద్దీపన చర్యలను వేటికవి వివరంగా ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు.
****
(Release ID: 1624732)
Visitor Counter : 2915
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam