హోం మంత్రిత్వ శాఖ

కోట్లాది మంది పేదలు, వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు, మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల పెంపుదలకు ఆర్ధికమంత్రి ప్రకటన దోహదపడుతుంది : హోంమంత్రి.

ఆరోగ్యం, విద్య, వ్యాపార రంగాలకు ఈ ఆర్ధిక ప్యాకేజీ చేయూతగా నిలుస్తుంది : శ్రీ అమిత్ షా


కోవిడ్-19 ను నిర్వహించడంలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వం అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించింది : హోంమంత్రి

Posted On: 17 MAY 2020 4:20PM by PIB Hyderabad

ఈ రోజు ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజీ ల పై కేంద్ర దేశీయ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకీ, ఆర్ధికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కీ, కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ, “ఈ రోజు మోడీ ప్రభుత్వం చేసిన ప్రకటనలు ఆత్మ నిర్భర్ భారత్ ఆలోచనను ముందుకు తీసుకువెళ్తాయి. ఈ చర్యలు ఆరోగ్యం, విద్య మరియు వ్యాపార రంగాలకు చేయూతగా ఉంటాయి. ఈ ప్యాకేజీ  కోటి మంది పేదలకు ఉపాధి కల్పిస్తుంది." అని అన్నారు. 

గ్రామీణ భారతానికి కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ, " ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్ కింద మోడీ ప్రభుత్వం చేసిన 40,000 కోట్ల రూపాయల అదనపు కేటాయింపు పేదలకు, వలస కూలీలలకు ఉపాధి కల్పన తో పాటు  జీవనోపాధి ఆస్తులను కల్పించడానికి కూడా సహాయ పడతాయి." అని పేర్కొన్నారు ఇది మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థనుమౌలిక సదుపాయాలను బాగా పెంచుతుందని ఆయన అన్నారు.

కోవిడ్-19 ను నిర్వహించడంలో ప్రధానమంత్రి మోడీ నాయకత్వం అనేక అభివృద్ధి చెందిన దేశాలను అధిగమించిందని హోంమంత్రి ప్రశంసించారు.    భారతదేశ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, పునరుద్ధరించడం ద్వారా భవిష్యత్తులో భారతదేశాన్ని ఇటువంటి మహమ్మారికి సిద్ధం చేయాలని ప్రధానమంత్రి సంకల్పించారు.  ప్రతి జిల్లాలో అంటువ్యాధుల నివారణ ఆసుపత్రుల బ్లాక్‌లను ఏర్పాటు చేయడం, ల్యాబ్‌ నెట్ వర్క్ తో పాటు నిఘాను బలోపేతం చేయడం, పరిశోధనలను ప్రోత్సహించడం మొదలైన వాటికోసం భారతదేశ ఆరోగ్య వ్యయాన్ని పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ దూరదృష్టి వైద్య రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళుతుందని,  నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. " అని ఆయన అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల పాలసీ పునరుద్ధరణ, ఐ.బి.సి. సంబంధిత చర్యల ద్వారా సులభతరం వ్యాపారాన్ని మరింత మెరుగుపరచడం, కంపెనీ చట్టంలో మార్పులు, వంటి నిర్ణయాలు, భారతదేశాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళ్ళడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ భవిష్యత్ ఆలోచనలను, నిబద్ధతను ప్రతిబింబిస్తాయని, ఆయన అన్నారు 

రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందనీ, తద్వారా రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్ల రూపాయల మేర అదనపు వనరులను సమకూరుతాయనీ, హోంమంత్రి చెప్పారు.  రాష్ట్రాలకు ఇప్పటికీ అందజేసిన ఇతర నిధుల గురించి ఆయన మాట్లాడుతూ, పన్నుల పంపిణీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో  రూ.46,038 కోట్లు ఇచ్చిందనీ, రెవెన్యూ లోటు గ్రాంటు రూ.12,390 కోట్లు, రూ.11,000 కోట్లు మేర ఎస్.డి.ఆర్.ఎఫ్. నిధులు ఇచ్చినట్లు వివరించారు   

 

*****



(Release ID: 1624730) Visitor Counter : 169