వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అభియాన్ కింద 8 కోట్ల‌మంది వ‌ల‌స‌కార్మికులు, వారి కుటుంబాల‌కు ఉచిత ఆహార‌ధాన్యాలు

రాష్ట్రాలు, కేంద్రాపాలిత ప్రాంతాల‌కు ఆహార‌ధాన్యాల కేటాయింపు, మొత్తం ఖ‌ర్చు భ‌రించ‌నున్న కేంద్ర ప్ర‌భుత్వం: శ్రీ రామ్‌విలాస్ పాశ్వాన్
23 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు 2020 ఆగ‌స్టు నాటికి ఒక దేశం, ఒక కార్డు కిందికి రానున్నాయి.

Posted On: 16 MAY 2020 5:20PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వ‌ల‌స కూలీలు, పేద ప్ర‌జ‌ల ఇబ్బందుల ప‌ట్ల త‌క్ష‌ణం స్పందిస్తోంది. వినియోగ‌దారుల వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ , ఎవ‌రూ ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా చూసేందుకు అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటోంది. ఈ విష‌యాన్ని కేంద్ర వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం,ప్ర‌జాపంపిణీ వ్య‌వహారాల శాఖ మంత్రి  శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈరోజు న్యూడిల్లీలొ కృషి భ‌వ‌న్‌లో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో చెప్పారు.

 


 ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2020 మే 12 న ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ పేరుతో 20 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల ప్ర‌త్యేక ఆర్థిక స‌మ‌గ్ర ప్యాకేజ్‌ని ప్ర‌కటించారు. ఈ ఆర్థిక చ‌ర్య‌ల ( ఆత్మ నిర్భ‌ర భార‌త్ అభియాన్‌)లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీతారామ‌న్‌, పేద‌లు, వ‌ల‌స కార్మికుల‌కు ఉప‌యోగ‌ప‌డే ప‌లు స్వ‌ల్ప‌కాలిక‌, దీర్ఘ‌కాలిక చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించారు.జాతీయ ఆహార‌ప భ‌ద్ర‌తా చ‌ట్టం,  రాష్ట్రాల ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్థ కింద జారీచేసిన కార్డులు లేని   8 కోట్ల మంది వ‌ల‌స కార్మికుల‌కు ఒక్కొక్క వ్య‌క్తికి నెలకు 5 కేజీల వంతున ఉచితంగా రెండు నెల‌లు ( మే, జూన్ 2020) ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేప‌ట్ట‌డం ఇమిడి ఉంది.
.వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహారం, ప్ర‌జాపంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ ఈరోజు న్యూఢిల్లీలో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు..


ప్ర‌స్తుత కోవిడ్ -19 ప్ర‌మాద‌క‌ర‌ పరిస్థితిలో వలసదారుల దుస్థితిని తగ్గించడానికి , వారికి , వారి కుటుంబాలకు ఆహార ధాన్యాలు లభ్యమయ్యేలా చూడడానికి, 8 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల‌ ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు  కేటాయించారు. రాష్ట్రంలో రవాణా ఖ‌ర్చులు, డీలర్ల మార్జిన్ మొదలైన వాటితో సహా అటువంటి పంపిణీ కారణంగా అయ్యే  ఖ‌ర్చు మొత్తాన్ని  భారత ప్రభుత్వం  భరిస్తుంది .


రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల‌ వారీగా ఆహార ధాన్యాల‌ కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక నిర్దిష్ట రాష్ట్రం , కేంద్ర‌పాలిత ప్రాంతంలోజాతీయ ఆహార భ‌ద్ర‌తా చ‌ట్టం (ఎన్‌.ఎఫ్‌.ఎస్‌.ఎ) పరిధిలో ఉన్న మొత్తం లబ్ధిదారుల సంఖ్యలో10 శాతం ల‌బ్ధిదారుల‌ను  ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని  కేటాయింపులు చేశారు. లబ్ధిదారులను గుర్తించడం, అటువంటి లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడం సంబంధిత రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంత‌ ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు.
కేటాయించిన ఆహార ధాన్యాలను,  పిఎమ్‌జికెఎ విషయంలో అనుసరించిన నమూనా ప‌ద్ద‌తిలో  ల‌బ్దిదారుల‌కు పంపిణీ చేసిన తరువాత, వారి వివరాలను ఆహార , ప్రజా పంపిణీ శాఖకు అందించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల‌ని రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ను కోరిన‌ట్టు శ్రీ పాశ్వాన్‌ తెలిపారు.
2020 జూలై 15 లోపు రాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ పంపిణీ వివరాలను ఈ విభాగానికి నివేదించవచ్చు.వచ్చే వారం ఆహార ధాన్యాల పంపిణీ పై స‌మీక్ష నిర్వ‌హించేందుకు అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాల ఆహార మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు శ్రీ రాంవిలాస్ పాశ్వాన్ చెప్పారు.
‘వన్ నేషన్ వన్ కార్డ్’- ఒక దేశం, ఒక కార్డు పథకం కింద రేషన్ కార్డు  జాతీయ పోర్టబిలిటీకి వీలు క‌ల్పించ‌డానికి, ఈ విభాగం ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (ఐఎం-పిడిఎస్) ను ప్రారంభించిందని శ్రీ పాశ్వాన్ తెలిపారు. 2020 మే 1 నాటికి 17 రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ లబ్ధిదారులకు ‘వన్ నేషన్ వన్ కార్డ్’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చార‌ని ఆయన తెలియజేశారు. 2020 జూన్  నాటికి మ‌రో 3 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఈ ప‌థ‌కం కిందికి రానున్నాయ‌ని మంత్రి చెప్పారు. 2020 ఆగ‌స్టు నాటికి  23 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఈ ప‌థ‌కం కిందికి రానున్నాయ‌ని చెప్పారు. 2021 మార్చినాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు డిఒఎఫ్‌పిడి ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుని ప‌నిచేస్తోంది. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ‌చ్చిప‌డిన ప్ర‌స్తుత స‌మ‌యంలో చాలా వ‌ర‌కు  వ‌ల‌స కార్మికులకు ఈ ఒక దేశం ఒక కార్డు ప‌థకం ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌జా పంపిణీ వ్య‌వ‌స్త కింద గ‌ల ల‌బ్ధిదారులు త‌మ రేష‌న్‌ను ఏ చౌక‌ధ‌ర‌ల దుకాణం నుంచైనా బ‌యోమెట్రిక్ వెరిఫికేష‌న్ ద్వారా దేశంలో ఎక్క‌డినుంచైనా ఒక దేశం ఒక కార్డు ప‌థ‌కం అందుబాటులో ఉన్న‌ రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల నుంచి  తీసుకోవ‌చ్చు.
 

వ‌ల‌స కూలీల కోసం రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు అద‌న‌పు ఆహార‌ధాన్యాల కేటాయింపున‌కు సంబంధిచిన వివ‌రాలు కింది లింక్ ను క్లిక్ చేసి చూడ‌వ‌చ్చు.


(Release ID: 1624525) Visitor Counter : 381