ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారిపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం 15వ సమావేశం; ప్రస్తుత స్థితి, ప్రభుత్వ సన్నద్ధత, మహమ్మారిని అదుపుచేయడానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రుల బృందం సమీక్ష
కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి పెట్టాలని డాక్టర్ హర్షవర్ధన్ పిలుపు
Posted On:
15 MAY 2020 3:29PM by PIB Hyderabad
కోవిడ్ -19పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం 15వ సమావేశం శుక్రవారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన నిర్మాణ్ భవన్ లో జరిగింది. సమావేశానికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పూరి, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్, హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్, నౌకానిర్మాణం & రసాయనాలు మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మనసుఖ్ లాల్ మాండవీయ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే హాజరయ్యారు. వారితో పాటు రక్షణ సిబ్బంది ప్రధానాధికారి శ్రీ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కోవిడ్ -19 ప్రస్తుత పరిస్థితిని గురించి మంత్రుల బృందానికి సవివరంగా తెలియజేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల సంఖ్య ప్రస్తుతం 42,48,389 ఉండగా 2,94,046 మంత్రి మరణించారు. మరణాల రేటు 6.92% ఉంది. ఇండియాలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖుయ 81,970 ఉండగా 2,649 మరణాలు సంభవించాయి. మరణాల రేటు 3.23% ఉంది. ఇప్పటి వరకు మొత్తం 27,920 మందికి నయమైంది. గత 24 గంటల్లో 1,685 మందికి స్వస్థత చేకూరింది. తద్వారా ఇండియాలో స్వస్థత రేటు 34.06 శాతానికి పెరిగింది. రోగుల సంఖ్య రెట్టింపు కావడం బాగా నెమ్మదించిందని, లాక్ డౌన్ కు ముందు 3.4 రోజుల్లో రోగుల సంఖ్య రెట్టింపు అవుతుండగా గత వారం నాటికి అది బాగా తగ్గి 12.9 రోజులకు పెరిగిందని తెలిపారు. లాక్ డౌన్ కు ముందు 3.2 శాతం ఉన్న కేసు మరణాల రేటు గత వారంలో 2.1 శాతానికి తగ్గింది.
ఆ తరువాత ఈ మహమ్మారిని అదుపు చేయడానికి అనుసరించవలసిన వ్యూహాన్ని గురించి, కేంద్రం, వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల గురించి మంత్రుల బృందం కూలంకషంగా చర్చించింది. దేశంలో ఎక్కువగా అంటే దాదాపు 79% కేసులు 30 మునిసిపల్ ప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారిని అదుపు చేసే వ్యూహంలో ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై మరియు రోగుల చికిత్స, కేసు మరణాల అదుపుపై దృష్టి పెట్టాలని, ఇందుకోసం వైరస్ సోకిన వారిని గుర్తించడం మరియు సంక్రమితుల జాడతీయడమే ఉత్తమ మార్గమని మంత్రివర్గం అభిప్రాయపడింది. వలస కూలీలు మరియు ప్రవాసులు తిరిగి రావడం వల్ల రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి కూడా మంత్రుల బృందం చర్చించింది.
వివిధ జోన్లలో మహమ్మారిని అదుపు చేయడానికి భారత ప్రభుత్వం చేసిన సిఫార్సుల ఆధారంగా సమర్ధవంతంగా చర్యలు చేపట్టడానికి రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పంపిన మార్గదర్శకాలను మంత్రుల బృందానికి తెలియజేయడం జరిగింది.
దేశంలో ఇప్పుడు కోవిడ్ -19 చికిత్సకు 8,694 సౌకర్యాలు/కేంద్రాలు ఏర్పాటయ్యాయని వాటిలో 919 కోవిడ్ ప్రత్యేక ఆసుపత్రులు , 2,036 కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు , 5,739 కోవిడ్ సంరక్షణ కేంద్రాలు అన్నింటిలో కలిపి సీరియస్ కేసుల కోసం 2,77,429 పడకలు, 29,701 ఐ సి యు పడకలు, సంరక్షణ కేంద్రాలలో 5,12,250 వేరుగా ఉంచే పడకలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో కోవిడ్ -19ను ఎదుర్కోవడానికి ప్రస్తుతం 18,855 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు/ కేంద్ర సంస్థలకు 84.22 లక్షల ఎన్95 మాస్కులు మరియు 47.98 లక్షల వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పి పి ఈలు) సమకూర్చింది. ప్రస్తుతం దేశంలో మాస్కులు, పి పి ఈల ఉత్పత్తి సామర్ధ్యం బాగా పెరిగిందని, సమీప భవిష్యత్తులో దేశ అవసరాలను తీర్చే విధంగా రోజుకు 3 లక్షల వ్యక్తిగత సంరక్షణ సాధనాలు (పి పి ఈలు), 3 లక్షల ఎన్95 మాస్కుల ఉత్పత్తి జరుగుతోందని మంత్రుల బృందానికి తెలియజేశారు. దానికి తోడు దేశీయ తయారీదారులు వెంటిలేటర్లను కూడా ఉత్పత్తి చేస్తున్నారని, వారికి ఆర్డర్లు కూడా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు.
భారత వైద్య పరిశోధనా మండలి (ఐ సి ఎం ఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ తమ సమర్పణలో దేశంలో ప్రభుత్వ, ప్రయివేటు ప్రయోగశాలలో కోవిడ్ -19 పరీక్షల సంఖ్య రోజుకు లక్షకు పెరిగిందని, ఇప్పటి వరకు 20 లక్షల మందిని పరీక్షించడం జరిగిందని తెలియజేశారు. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రంలో కోబాస్ 6800 స్వయంచాలిత యంత్రం సహాయంతో రోజుకు 1200 నమూనాలను పరీక్షించవచ్చని అన్నారు. ఇప్పుడు అవసరానికి తగినన్ని టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నామని కూడా భార్గవ తెలియజేశారు.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విదేశాల నుంచి ప్రవాసులను స్వదేశానికి తీసుకు రావడం గురించి కూడా మంత్రుల బృందానికి తెలియజేశారు. మొదటి దశలో దాదాపు 12,000 మందిని వెనక్కి తీసుకు వచ్చారు. పరీక్షల తరువాత వారిని ఆయా రాష్ట్రాలలో క్వారెంటైన్ లో ఉంచారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఓఎస్డీ శ్రీ రాజేష్ భూషణ్,పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోలా, వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ అనూప్ వాధ్వాన్ ,భారత వైద్య పరిశోధనా మండలి (ఐ సి ఎం ఆర్) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ, డి జి ఐ టి బి పి శ్రీ ఆనంద్ స్వరూప్, విదేశీ వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి శ్రీ దమ్ము రవి, హోమ్ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్, ఆర్ధిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సి. ఎస్. మహాపాత్ర , ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ శ్రీ లవ్ అగర్వాల్ , సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.
కోవిడ్ -19కు సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు మరియు సూచనలను గురించిన యదార్ధ , తాజా సమాచారం కోసం దయచేసి క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/. వెబ్ సైటును దర్శించండి.
కోవిడ్ -19కు సంబంధించిన ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]inకు మరియు ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]inకు మెయిల్ చేయవచ్చు. లేదా ట్విట్టర్ లో @CovidIndiaSevaకు ట్వీట్ చేయవచ్చు.
ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు +91-11-23978046 లేదా 1075 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 గురించి రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్లు https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf . లో పొందవచ్చు.
(Release ID: 1624217)
Visitor Counter : 219