ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

32 వ కామన్వెల్త్ ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్

- కోవిడ్‌-19 నిర్వహణ దిశ‌గా భారత్‌ సకాలంలో చేప‌ట్టిన‌ మేటి మరియు క్రియాశీల‌క‌ చర్యలను ప్ర‌ధానంగా ఎత్తిచూపిన‌‌ మంత్రి

Posted On: 14 MAY 2020 6:36PM by PIB Hyderabad

32 వ కామన్వెల్త్ ఆరోగ్య మంత్రుల సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా పాల్గొన్నారు. కోవిడ్-19 మ‌హ‌మ్మారిపై సమన్వయంతో కూడిన కామన్వెల్త్ ప్రతిస్పందనల అంద‌జేత అనే ఇతివృత్తంతో గురువారం నాడు ఈ సమావేశం జ‌రిగింది. ఈ ప్ర‌పంచ స్థాయి సమావేశంలో భాగంగా కేంద్ర ఆరోగ్య మంత్రి చేసిన ప్రకటన ఈ క్రింది విధంగా ఉంది:
"కోవిడ్-19 మ‌హ‌మ్మారిపై సమన్వయంతో కూడిన కామన్వెల్త్ ప్రతిస్పందనల అంద‌జేత గురించి మాట్లాడేందుకు ముందు మ‌హ‌మ్మారి కార‌ణంగా జ‌రిగిన ప్రాణన‌ష్టం ప‌ట్ల నా ప్రగాఢ‌ సంతాపాన్ని మరియు ఆందోళనను తెలియజేయాలనుకుంటున్నాను. విలువైన ప్రాణాలను రక్షించడంలో అనేక మంది ఫ్రంట్‌లైన్ ఆరోగ్య సేవ ప్రొవైడ‌ర్లు, పౌర సంస్థ‌ల వారు అందిస్తున్న మేటి సహకారాన్ని మేము గుర్తించాము. భారత్ కోవిడ్‌-19 నిర్వహణను గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర‌ మోడీజీ గారి అత్యున్నత స్థాయి రాజకీయ నిబద్ధతతో చేపట్టింది. ఆయ‌న మార్గదర్శకత్వంలో కోవిడ్ -19 క‌ట్ట‌డికి గాను చురుగ్గా, ముందస్తుగా మరియు మేటి శ్రేణిలో చ‌ర్య‌లు చేప‌ట్టింది. దేశంలోకి ప్రవేశ ప్రదేశాల వద్ద బ‌ల‌మైన నిఘా, విదేశాలలో భార‌త‌ పౌరులను తరలించడం, వ్యాధి నిఘా నెట్‌వర్క్ ద్వారా సమాజంలో క‌రోనాపై నిఘా, ఆరోగ్య మౌలిక సదుపాయాల బలోపేతం, ఆరోగ్య సిబ్బంది శిక్షణ మరియు సామర్థ్యం పెంపొందించడం, రిస్క్ కమ్యూనికేషన్,  కమ్యూనిటీ ప్రమేయం వంటి అన్ని అవసరమైన మరియు సమయానుసారమైన చర్యలను భారత్ తన నిర్వహణలో భాగంగా చేసుకుంది. ఈ దిశ‌గా త‌గిన‌ ప్రయత్నాలు చేప‌ట్టింది.
మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద లాక్‌డౌన్‌ను అమలు చేయడంలో, వ్యాధి యొక్క విస్తృతిని పెరుగుదలను తగ్గించడం ద్వారా మరియు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థతో పాటు వ్యాధి పెరుగుదలను ఎదుర్కోగలదని నిర్ధారించడం ద్వారా ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాము. అదే సమయంలో మేము ప్ర‌జ‌ల ప్రాణాలను అలాగే జీవనోపాధిని కూడా కాపాడుకునేందుకు గాను చ‌ర్య‌లు చేప‌ట్టాము.. దీనిలో భాగంగా అన్ని అవసరమైన సేవలను లాక్‌డౌన్‌ పరిధి నుండి దూరంగా ఉంచామ‌ని ఆయ‌న తెలిపారు. మా ప్రధాని 265 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడటానికి మరియు మన జనాభాలో బలహీన వర్గాలకు మద్దతు ఇవ్వడానికి. మేము క్రమంగా ఆంక్షలను సడలించాము. కోవిడ్ -19 నేప‌థ్యాన‌ భవిష్యత్ సంసిద్ధత, ప్రతిస్పందన మరియు స్థితిస్థాపకత కోసం అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క ప్రధాన సామర్థ్యాలను నిర్మించడం, బలోపేతం చేయ‌డం‌ చాలా అవసరం.
కోవిడ్‌-19 సవాలుతో పోరాడటానికి ఏకీకృత ప్రపంచ చర్యను కోరిన మొదటి దేశం భారతదేశం. మేము మార్చి మధ్యలో మా ప్రాంతంలో సార్క్ నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము.. దీనిలో భాగంగా “కలిసి ముందుకుపోదాం; ఇది వృద్ధిలో భాగం కాదు; గందరగోళం లేని స‌హ‌కారం; మరియు స‌న్న‌ద్ధ‌త‌, భయం లేకుండా ముందుకు సాగ‌డం” అనే అంశాల‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించాము. ఈ సంక్షోభానికి భారతదేశం యొక్క ప్రతిస్పందనను సూచించే అంశాలు ఇవే. దాదాపు 100  పేద దేశాలకు భారతదేశం హైడ్రాక్సీ క్లోరోక్విన్ వంటి అవసరమైన మందులను అందించి ఈ సంక్షోభ సమయంలో సంఘీభావం తెలిపే మద్దతును విస్తరించింది. మహమ్మారికి కారణాలను అన్వేషించ‌డం కోవిడ్ -19 నియంత్ర‌ణ‌కు గాను మందులు మరియు వ్యాక్సిన్లను కనుగొనడం, పునరావృతిని నిరోధించ‌డం కూడా చాలా ముఖ్యం. కోవిడ్ -19 నిమిత్తం ప్ర‌స్తుతం ఉన్న కొత్త అన్ని సంబంధిత వైద్య ఉత్పత్తులు మరియు సాంకేతిక పరిజ్ఞానాలకు సార్వత్రిక మరియు సరసమైన ప్రాప్యతను సులభతరం చేయడం చాలా అవ‌స‌రం. వీటిని కోవిడ్‌-19 ను పరిష్కరించడానికి న్యాయమైన మరియు సమానమైన పద్ధతిలో అందుబాటులో ఉంచాలి. భారత ప్రభుత్వ క్రియాశీల సహకారంతో భారత శాస్త్రవేత్తలు క‌రోనా వైర‌స్‌కు టీకాలు, త‌గిన ఔషధాల ఆవిష్కరణతో పాటు, స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు రోగ‌నిర్ధార‌ణ కిట్ల అభివృద్ధి మరియు వివిధ రకాల ప్రాణాలను రక్షించే పరికరాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కోవిడ్‌-19 అనంతర కాలంలో ఎదుర‌య్యే కొత్త ప్ర‌మాదాలు ఇత‌రత్రా సవాళ్లను పరిష్కరించడానికి మ‌నం పరస్పరం మద్దతుతో ముందుకు సాగాలి. ఉత్తమ పద్ధతులను ప‌ర‌స్ప‌రం పంచుకోవాలి మరియు వినూత్న మార్గాలను అన్వేషించాలి.”



(Release ID: 1623946) Visitor Counter : 237