రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశ నిమిత్తం మాల్దీవులకు పయనమైన ఐఎన్ఎస్ జలాశ్వ నౌక
Posted On:
14 MAY 2020 6:15PM by PIB Hyderabad
ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశను ప్రారంభించడానికి భారత నావికా దళ నౌక జలాశ్వ
మాల్దీవుల్లోని మాలేకు తిరిగి పయనమైంది. విదేశీ తీరాల నుండి భారత జాతీయులను సముద్రం ద్వారా స్వదేశానికి రప్పించడానికి గాను భారత ప్రభుత్వం ఆపరేషన్ సముద్ర సేతును ప్రారంభించిన సంగతి తెలిసిందే. భారత నావికా దళ నౌక జలాశ్వ ఈ నెల 15న తెల్లవారు జామున మాలే నౌకాశ్రయంలోకి ప్రవేశించనుంది. అనంతరం మాల్దీవుల్లోని భారత రాయబార కార్యాలయంలో ఇప్పటికే నమోదు చేసుకున్న భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకు రానుంది. రెండో దశ పర్యటనలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వ 700 మంది భారతీయ పౌరులతో బయలుదేరనుంది. ఈ నెల 15వ తేదీ రాత్రికి ఈ నౌక కొచ్చికి తిరుగు పయనమవుతుంది. అంతకుముందు, ఈ నెల 12వ తేదీన 698 మంది భారతీయ పౌరులను విజయవంతంగా స్వదేశానికి తీసుకువచ్చిన తరువాత ఐఎన్ఎస్ జలాశ్వ తరలింపు ఆపరేషన్ యొక్క రెండవ దశకు సన్నాహక చర్యలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మునుపటి ట్రిప్‌లో భారతీయులు
ప్రయాణించిన ప్రాంతాలను ప్రత్యేక శ్రద్ధతో క్రిమిసంహారకం చేయడంతో పాటు శానిటైజేషన్ ప్ర్రక్రియ
చేపట్టారు. ఆపరేషన్ సముద్ర సేతు రెండో దశలో భాగంగా ఐఎన్ఎస్ జలాశ్వ ఈ నెల 15వ తేదీన సుమారు 700 మంది భారతీయ పౌరులు స్వదేశానికి తిరిగి తీసుకురానుంది. ఇందులో
100 మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తరలింపు కోసం ఎంపిక చేసిన భారతీయ పౌరుల్ని వైద్యపరంగా పరీక్షించి వారికి తగిన గుర్తింపు కార్డులను కూడా కేటాయించనున్నారు. వారి సామానులను ఓడలోకి ఎక్కేంచేందుకు ముందు శుభ్రపరచనున్నారు.
(Release ID: 1623898)
Visitor Counter : 260
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam