రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ హెచ్ఐఎల్‌ (ఇండియా) సంస్థ ఆఫ్రికన్ దేశాల నుండి పెద్ద ఆర్డర్లపై దృష్టి సారించింది

Posted On: 12 MAY 2020 1:58PM by PIB Hyderabad

కోవిడ్ -19 లాక్‌డౌన్‌తో అపారమైన లాజిస్టిక్ మరియు ఇతర సవాళ్లు ఎదుర‌వుతున్న‌‌ప్ప‌టికీ  
రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేసే ప్ర‌భుత్వ రంగపు సంస్థ  హెచ్ఐఎల్‌ (ఇండియా)  దేశంలోని రైతు సమాజానికి పురుగు మందుల తగినంత సరఫరాను నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆఫ్రికన్ దేశాల నుండి కూడా డీడీటీ ఎగుమతి ఆర్డర్లు పొందడంపై ప్ర‌ధానంగా దృష్టి సారిస్తోంది. రాబోయే నెలల్లో ఈ ప్రాంతంలో మలేరియా కేసుల పెరుగుదలకు అవ‌కాశం ఉంద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవ‌ల‌ జారీ చేసిన హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని డీడీటీ సరఫరా కోసం పది దేశాల‌తో కూడి దక్షిణాఫ్రికా అభివృద్ధి సంఘానికి (ఎస్ఏడీసీ) హెచ్‌ఐఎల్ లేఖ రాసింది. దేశంలో ఈ నెల‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న వ్యవధిలో కూడా హెచ్ఐఎల్ సంస్థ 120.40 ఎంటీల డీడీటీ టెక్నిక‌ల్‌ను, 226.00 ఎంటీల ‌డీడీటీ 50 శాతం డ‌బ్ల్యూడీపీ, 85.00 ఎంటీల‌ మలాథియాన్ టెక్నికల్, 16.38 ఎంటీల‌ హిల్‌గోల్డ్‌ మరియు 27.66 ఎంటీల ఫార్మూలేష‌న్‌ల‌ను ఉత్పత్తి చేసింది. దీంతో రైతు సమాజంపై లాక్‌డౌన్ ప్ర‌భావం ప‌డ‌కుండా ఈ సంస్థ కృషి చేసింది. దీనికి తోడు లోకస్ట్ కంట్రోల్ ప్రోగ్రాం కోసం మలాథియాన్ టెక్నికల్ ఉత్ప‌త్తి కొనసాగుతోంది. రాజస్థాన్‌, గుజ‌రాత్ రాష్ట్రాల‌లో వ్యవసాయ శాఖ‌ల లోకస్ట్ కంట్రోల్ ప్రోగ్రాం కోసం మలాథియాన్ టెక్నిక‌ల్ మిశ్ర‌మం సరఫరాను కొనసాగిస్తోంది. దీనికి తోడు ఎన్‌డీబీడీసీపీ సరఫరా ఆర్డర్ ప్రకారం ఒడిశా (30 ఎంటీ) కు డీడీటీ 50 శాతం డ‌బ్ల్యూడీపీ పంపబడింది. హెచ్ఐఎల్ యొక్క త‌యారీ యూనిట్లు క‌నీస మాన‌వ శ‌క్తితో సామాజిక దూరం నిర్వ‌హించ‌డంతో పాటు కోవిడ్ నియంత్ర‌ణ‌కు సంబంధించి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల్ని (ఎస్ఓపీ) పాటిస్తూ తయారీ యూనిట్లు నడుస్తున్నాయి. హెచ్ఐఎల్‌కు చెందిన యూనిట్లలో పారిశుద్ధ్య స్థాయిని పెంచారు. కర్మాగారంలోకి అన్ని ప‌ని ప్ర‌దేశాల‌లోకి ప్రవేశించే ప్లాంట్లు, ట్రక్కులు మరియు బస్సులు తరచూ శుభ్రపరుస్తున్నారు. గత వారంలో కంపెనీ మొత్తం అమ్మకం రూ.278.82 ల‌క్ష‌లుగా నిలిచింది. వ్యవసాయ రసాయనాలు, ఎరువులు మరియు విత్తనాల అమ్మకం ఇందులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో టెండర్ యొక్క ప్రాసెసింగ్ మరియు సేకరణ కార్యకలాపాలు కూడా జర‌ప‌బ‌డుతున్నాయి.


(Release ID: 1623369) Visitor Counter : 237