ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం

"నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా, మనం మహమ్మారి వ్యాప్తిలో విజయం సాధించలేము." : డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 12 MAY 2020 3:13PM by PIB Hyderabad

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, ఫ్లోరెన్స్ నైటింగేల్ 200వ జయంతి సందర్భంగా ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధ్యక్షత వహించారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) ఈ ఏడాదిని "నర్సులుమిడ్ వైఫ్ ల సంవత్సరంగా" కూడా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది

 

 

నర్సింగ్ నిపుణుల పనిని, నిస్వార్థ అంకితభావాన్నీ డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు. ఆరోగ్య పరిరక్షణ సేవల నిర్వహణలో వారు  బలమైన, కీలకమైన స్తంభాలుగా ఆయన అభివర్ణించారు. "మీ పని విశిష్టతను, చిత్తశుద్ధిని ఎవరూ నిర్వచించలేరు. అలాంటిది మీ నిబద్ధత.  మీ దయ, అంకితభావం, అలాగే మీరు రోగులను ఎల్లప్పుడూ మొదటి స్థానంలో ఉంచుతున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు." అని డాక్టర్ హర్ష వర్ధన్  అన్నారు. ఈ మహమ్మారి కొనసాగుతున్న సమయంలో వారి నిస్వార్ధ, నిరంతర కృషికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. "నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా, మనం మహమ్మారి వ్యాప్తిలో విజయం సాధించలేము. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను లేదా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణను మనం సాధించలేము. " అని ఆయన పేర్కొన్నారు. 

కోవిడ్ ప్రబలుతున్న రోజుల్లో ప్రజలంతా గట్టి సవాలును ఎదుర్కొంటున్న సమయంలో నర్సులు అందిస్తున్న సేవలను డాక్టర్ హర్ష వర్ధన్ కొనియాడారు. " ఇటీవల విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పూణే లోని స్టాఫ్ నర్స్ శ్రీమతి జ్యోతి విఠల్ రక్షా;  పూణే లోని అసిస్టెంట్ మాట్రాన్ శ్రీమతి అనిత గోవిందరావు రాథోడ్;  జిల్మిల్ లోని ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిలో నర్సింగ్ అధికారి మార్గరెట్ లను ఈ రోజు నేను ప్రత్యేకంగా తలచుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియ జేస్తున్నాను.  ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టడానికి  మీరు చేస్తున్న పోరాటానికి, మీతో పాటు నేను కూడా ఉంటాను. మన నైతికతను అధికంగా ఉంచుదాము. ప్రోటోకాల్ నిబంధనలను  అనుసరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైన జాగ్రత్తలు, శిక్షణ తీసుకోవాలి. ” అని ఆయన వివరించారు. 

కోవిడ్-19 కు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రతిస్పందనకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో నిబద్ధత నాయకత్వం వహిస్తోందని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు. ఆరోగ్య పరిరక్షణలో ముందుండి సేవలందిస్తున్న కార్మికులు ఏదైనా హింసకు గురైతే రక్షించడానికి ఒక ఆర్డినెన్స్ ను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సేవా సిబ్బందికి గాయాలైనా లేదా ఆరోగ్య సంరక్షణ సేవా సిబ్బందికి నష్టాన్ని కలిగిస్తే పరిహారం కోరే విధంగా ఈ  ఆర్డినెన్స్ ను రూపొందించారు. హింసాత్మక చర్యలను గుర్తించి, బెయిల్ కు వీలులేని నేరంగా వాటిని పరిగణిస్తారు. ఇటువంటి హింస చర్యలను ప్రోత్సహించడం లేదా సమర్థించడం కూడా శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. నేరస్తులకు మూడు నెలల నుండి ఐదు నెలల వరకు జైలు శిక్ష తో పాటు 50,000 రూపాయలనుండి 2,00,000 వరకు జరిమానా కూడా విధిస్తారు.  తీవ్రమైన బాధకు గురిచేసిన సందర్భాలలో నేరస్థులకు ఆరు నెలల నుండి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారు.  దీనికి అదనంగాకోవిడ్-19 కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు "ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పధకం" కింద బీమా వర్తింపచేసి, 90 రోజులకు 50 లక్షల రూపాయల బీమా కల్పిస్తారు. ఈ పధకంలో మొత్తం 22.12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు బీమా సౌకర్యం కలుగుతుంది. కోవిడ్-19 సోకినందువల్ల కలిగే ప్రమాదవశాత్తు మరణాలకు కూడా ఇది వర్తిస్తుంది. 

నేటి పరిస్థితుల దృష్ట్యా, నర్సులు తమను తాము అన్ని నిబంధనలు, ఈ వ్యాధి వ్యాప్తి నియంత్రణ, నివారణ గురించి పూర్తి సమాచారాన్ని అంచనా వేయవలసిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. తద్వారా, వారు తమను తాము రక్షించుకోవడమే కాక, అందరికీ ఉత్తమమైన సలహాలను ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.   ఢిల్లీ లోని ఎయిమ్స్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్వహించే వివిధ వెబినార్ల ద్వారా నర్సులు పూర్తి ప్రయోజనాలను పొందాలని ఆయన కోరారు. 

ఈ కార్యక్రమంలో - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ప్రీతీ సుడాన్ప్రత్యేక కార్యదర్శి శ్రీ అరుణ్ సింఘాల్;  సంయుక్త కార్యదర్శి శ్రీ నిపుణ్ వినాయక్;  న్యూఢిల్లీ లోని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అధ్యక్షులు శ్రీ టి.దిలీప్ కుమార్;  న్యూఢిల్లీ లోని అఖిలభారత ప్రభుత్వ నర్సుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీమతి జి.కే. ఖురానా;  ట్రైన్డ్ నర్స్ స్ అసోసియేషన్ అఫ్ ఇండియా, ఉపాధ్యక్షులు, శ్రీమతి అన్నే కుమార్; అఖిలభారత ఏ.ఎన్.ఎమ్. ఎల్.హెచ్.వి.ల సమాఖ్య, ఏ.ఎన్.ఎమ్. గీతా రాణి;  సొసైటీ అఫ్ మిడ్ వైవ్స్ అఫ్ ఇండియా, ఢిల్లీ చాప్టర్ అధ్యక్షురాలు, త్రెస్సా హల్దాని;  న్యూఢిల్లీ లోని భారత నర్సింగ్ మండలి కార్యదర్శి లెఫ్టనెంట్ కల్నల్ సరబ్జీత్ కౌర్ తో పాటు వివిధ నర్సింగ్ సమాఖ్యలు / అసోసియేషన్లు,  ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. 

*****



(Release ID: 1623361) Visitor Counter : 281