హోం మంత్రిత్వ శాఖ

రైళ్ల ద్వారా వ్యక్తుల కదలికలను సులభతరం చేయడానికి వీలుగా ప్రామాణిక నియమాలను (ఎస్.ఓ.పి.) విడుదల చేసిన - హోంమంత్రిత్వశాఖ

Posted On: 11 MAY 2020 2:41PM by PIB Hyderabad

రైళ్ల ద్వారా వ్యక్తుల కదలికలను సులభతరం చేయడానికి వీలుగా కేంద్ర దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ.) ప్రామాణిక నియమాలను (ఎస్.ఓ.పి.) విడుదలచేసింది. 

ప్రయాణీకులను ధృవీకరించబడిన ఈ-టికెట్ ద్వారా మాత్రమే రైల్వే స్టేషన్ లోపలికి, బయటకు తిరగడానికి అనుమతిస్తారు.  ప్రయాణీకులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది.  వ్యాధి లక్షణాలు లేని వ్యక్తులను మాత్రమే రైలులోకి అనుమతిస్తారు. రైలులో ప్రయాణం చేస్తున్నప్పుడు, రైల్వే స్టేషన్ల లోనూ సామాజిక దూరాన్నీ, ఆరోగ్య / పరిశుభ్రత నియమాలను తప్పకుండా పాటించాలి

రైలు స్టేషన్లు  మరియు రైలు పెట్టెలలోకి ప్రవేశించే సమయంలోనూ, బయటకు వచ్చే సమయంలోనూ ప్రయాణీకులందరికీ చేతులు శుభ్రం చేసుకోడానికి వీలుగా సాని టీజర్లు అందించడం జరుగుతుంది.  ప్రయాణీకులందరూ ప్రయాణం బయలుదేరే ప్రదేశంలోనూ, ప్రయాణం సమయంలోనూ ఫేస్ కవర్లు / మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.  గమ్యస్థానం చేరిన అనంతరం, ప్రయానికులందరూ, ఆయా రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాలు విధించిన ఆరోగ్య నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ.) మరియు హోంమంత్రిత్వశాఖలతో సంప్రదించిన అనంతరం రైల్వే మంత్రిత్వశాఖ (ఎమ్.ఓ.ఆర్.) రైళ్ల రాక పోకలను ఒక పద్దతి ప్రకారం అనుమతిస్తుంది. 

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిన అధికారిక ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి. (Release ID: 1622971) Visitor Counter : 195