రైల్వే మంత్రిత్వ శాఖ

ఎంపిక చేసిన ప్ర‌యాణికుల రైలు స‌ర్వీసుల‌ను క్ర‌మంగా పున‌రుద్ధ‌రించ‌నున్న భార‌తీయ రైల్వే

Posted On: 10 MAY 2020 8:26PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వే 2020 మే 12 వ తేదీ నుంచి క్ర‌మంగా ప్ర‌యాణీకుల రైలు స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ప్రారంభంలో 15 జ‌త‌ల రైళ్ళు( 30 తిరుగు ప్ర‌యాణాలతో) న‌డుస్తాయి. ఈ రైళ్లు న్యూ ఢిల్లీ స్టేషన్ నుండి దిబ్రూఘ‌డ్‌, అగర్తలా, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మద్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్  జమ్మూ తావీలను క‌లుపుతూ ప్రత్యేక రైళ్లుగా నడుస్తాయి.
ఆ తరువాత, కొత్త మార్గాల్లో భారతీయ రైల్వే మరిన్ని ప్రత్యేక సేవలను ప్రారంభిస్తుంది.. అయితే 20 ,000 కోచ్‌ల‌ను కోవిడ్ -19 సంర‌క్ష‌ణ కేంద్రాలుగా మార్చ‌డానికి కేటాయించారు . దీనితో అందుబాటులో ఉన్న  కోచ్‌ల‌ను బ‌ట్టి ఈ రైళ్ల‌ను న‌డుపుతారు. వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వ‌ల‌స కార్మికుల‌కోసం, ప్రతిరోజూ 300 రైళ్ల వరకు శ్రామిక్ స్పెషల్స్‌" గా  న‌డ‌ప‌డానికి వీలుగా తగిన సంఖ్యలో కోచ్‌లు రిజర్వు చేశారు.
ఈ రైళ్లలో రిజర్వేషన్ల కోసం టి్క్కెట్ల‌ బుకింగ్ మే 11 వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది . ఇది ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో (https://www.irctc.co.in/) మాత్రమే అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లు మూసివేస్తారు.  కౌంటర్ టిక్కెట్లు (ప్లాట్‌ఫాం టికెట్లతో సహా) ఏవీ జారీ చేయబడవు. చెల్లుబాటు అయ్యే ధృవీకరించబడిన టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులను మాత్రమే రైల్వే స్టేషన్లలోకి అనుమతిస్తారు. ప్రయాణీకులు ఫేస్ కవర్ ధరించడం ,బయలుదేరేటప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవడం తప్పనిసరి.  కోవిడ్ -19 లక్షణాలు లేని ప్రయాణీకులను మాత్రమే రైలు ఎక్కడానికి అనుమతిస్తారు. రైలు షెడ్యూల్‌తో సహా మరిన్ని వివరాలు నిర్ణీత సమయంలో విడిగా ప్ర‌క‌టిస్తారు..



(Release ID: 1622833) Visitor Counter : 290