ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నిర్వహణకు మద్దతుగా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

Posted On: 09 MAY 2020 9:04PM by PIB Hyderabad

 

అధిక కేసులతో తల్లడిల్లుతున్న 10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను మోహరించాలని ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కోవిడ్-19 వ్యాప్తి నిర్వహణను సులభతరం చేయడానికి ఈ బృందాలు ఆయా రాష్ట్రాల ఆరోగ్య విభాగాలకు సహాయం చేస్తాయి.

ఆరోగ్యకుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులుసంయుక్త కార్యకర్శి స్థాయిలో ఒక నోడల్ అధికారిప్రజారోగ్య నిపుణుడు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రభావిత ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ఆరోగ్య శాఖకు ఈ బృందాలు సహకరిస్తాయి. ఈ కింద జిల్లాలకు బృందాలను పంపుతున్నారు:

1. గుజరాత్ 

2. తమిళనాడు 

3. ఉత్తర ప్రదేశ్ 

4. ఢిల్లీ 

5. రాజస్థాన్ 

6. మధ్యప్రదేశ్ 

7. పంజాబ్ 

8. పశ్చిమ బెంగాల్ 

9. ఆంధ్రప్రదేశ్ 

10. తెలంగాణ

అత్యధిక కేసులు ఉన్న జిల్లాల్లో ఇప్పటికే ప్రజారోగ్య నిపుణుల 20 కేంద్ర బృందాలు పంపడం జరిగింది. 

ఒక అత్యున్నత స్థాయి బృందాన్ని కూడా ఇటీవలే ముంబై కి పంపారు. 

*****



(Release ID: 1622585) Visitor Counter : 254