ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నియంత్రణకు సంసిద్ధత, వ్యాప్తి నివారణకు ఈశాన్య ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించిన - డాక్టర్ హర్ష వర్ధన్.

"ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లగా మార్చడం కోసం మనందరం దృష్టి పెడదాం. రాష్ట్రాల్లో రక్షణ స్థాయిని నిలబెడదాం" - డాక్టర్ హర్ష వర్ధన్

Posted On: 09 MAY 2020 4:35PM by PIB Hyderabad

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపుమేఘాలయమిజోరాం, నాగాలాండ్, త్రిపురసిక్కం లలో కోవిడ్-19 నియంత్రణకు సంసిద్ధత, వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలపై ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే తో కలిసి ఈరోజు ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షా సమావేశంలో, మిజోరాం ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ ఆర్లాల్ తాంగ్లియానా;  అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ అలో లిబంగ్;  అస్సాం రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ పీయూష్ హజారికాతో పాటు 8 రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.  

కోవిడ్-19 ను ఎదుర్కోవడంలో దేశంలోని రాష్ట్రాలు ప్రదర్శిస్తున్న అంకితభావాన్ని డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు. " ఈశాన్య రాష్ట్రాల్లో చాలా చోట్ల గ్రీన్ జోన్లు ఎక్కువగా ఉండడం, చాలా ఉపశమనంగా, ప్రోత్సాహకర్మాగా వుంది.   ఈ రోజు వరకు కేవలం అస్సాం మరియు త్రిపుర లల మాత్రమే కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.  మిగిలిన అన్ని రాష్ట్రాలు కోవిద్ గ్రీన్ జోన్లలోనే ఉన్నాయిఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లగా మార్చడం కోసం మనందరం దృష్టి పెడదాం. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో రక్షణ స్థాయిని నిలబెడదాం" - అని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు.  దేశంలో 2020 మే నెల 9వ తేదీ వరకు 59,662 కేసులు నమోదయ్యాయని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారువీటిలో 17,847 మంది చికిత్స పూర్తిచేసుకుని ఇళ్లకు వెళ్లిపోగా, 1,981 మంది మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లో 3,320 కొత్త కేసులను ధృవీకరించారు. కాగా 1,307 మంది రోగులు చికిత్స పూర్తిచేసుకుని ఇళ్లకు వెళ్లి పోయారు.  మరణాల రేటు 3.3 శాతంగా ఉండగా, రికవరీ రేటు 20.9 శాతంగా ఉందని కూడా ఆయన తెలిపారు. కోవిడ్-19 వ్యాధి సోకిన వారిలో 2.41 శాతం మంది రోగులు ఐ.సి.యు లో చికిత్స పొందుతున్నారు. 0.38 శాతం మంది వెంటిలేటర్లపైన , 1.88 శాతం మంది ఆక్సిజన్ సహాయంతోనూ  చికిత్స పొందుతున్నారు"దేశంలో పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం రోజుకు 95,000 పరీక్షలు నిర్వహించే స్థాయికి పెరిగింది. ప్రభుత్వ ప్రయోగశాలలు 332, ప్రైవేట్ ప్రయోగశాలలు 121 ఉన్నాయి. మొత్తం మీద కోవిడ్-19 కోసం ఇంతవరకు 15,25,631 పరీక్షలు నిర్వహించడాం జరిగింది." అని డాక్టర్ హర్ష వర్ధన్ వివరించారు 

ఈశాన్య రాష్ట్రాలతో సవివరమైన సమీక్ష సందర్భంగా, ఆయా రాష్ట్రాలలో టెస్టింగ్ సౌకర్యాలుఆరోగ్య మౌలిక సదుపాయాలూ, నిఘా, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటి వివిధ విషయాలకు సంబంధించి వారు అనుసరిస్తున్న ఉత్తమ విధానాలుసమస్యలను కేంద్ర మంత్రులకు వివరించారుకోవిడ్-19 వ్యాప్తి నిరోధానికి కేంద్రప్రభుత్వం ఇంతవరకు చేపట్టిన వివిధ చర్యలను డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.  "గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ అత్యున్నత స్థాయిలలో రాజకీయ నిబద్ధత నోవెల్ కరోనా వైరస్ వ్యాధి (కోవిడ్-19) కు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రతిస్పందనకు నాయకత్వం వహిస్తోంది. నోవెల్ కరోనావైరస్ కోసం భారతదేశం తన వివిధ సమయానుకూల చర్యలు మరియు ధృడమైన నిఘా వ్యవస్థల ద్వారా మహమ్మారితో పోరాడుతోంది." అని డాక్టర్ హర్ష వర్ధన్ అన్నారు. 

కోవిడ్-19 ను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియజేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకించిన ఆస్పత్రులు పెరుగుతున్నాయనీ, ఐసోలేషన్ మరియు ఐ.సి.యూ. పడకలు,  క్వారంటైన్ కేంద్రాలను  గుర్తించి  అభివృద్ధి చేయడం జరుగుతుందనీ ఆయన చెప్పారు.  వీటివల్ల, కోవిడ్-19 కారణంగా సంభవించే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందన్న భరోసా కలిగింది. రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు / కేంద్ర సంస్థలకు అవసరమైన పరిమాణంలో మాస్కులు, వ్యక్తిగత రక్షణ పరికరాలు, వెంటిలేటర్లు వంటివి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసి సహకరిస్తోంది.  ఈశాన్యప్రాంతంలో కోవిడ్-19 నిర్వహణ సమర్ధవంతంగా కొనసాగేందుకు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ, విదేశీవ్యవహారాల శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా  ఆయా రాష్ట్రాలకు తిరిగి వచ్చే వలస కూలీలు, విద్యార్థులు, ప్రవాస భారతీయులు స్క్రీనింగ్, క్వారంటైన్ వంటివి విధిగా పాటించేలా చర్యలు తీసుకోవాలి.  రోగులను ఆసుపత్రులనుండి ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా సవరించిన మార్గదర్శకాలను రాష్ట్రాలు విధిగా పాటించాలని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ హర్ష వర్ధన్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, " కొంతమంది ఈ దిశగా పనిచేసినప్పటికీ, ఇతరులు మరింత ప్రభావవంతమైన పర్యవేక్షణ, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇంటింటి సర్వే తో పాటు  ప్రారంభ రోగ నిర్ధారణపై దృష్టి పెట్టాలి ”.అని చెప్పారు.  కోవిడ్ వల్ల భావితం కాని జిల్లాల్లోనూ, గత 14 రోజుల నుండి ఎక్కువ కేసులు నమోదుకాని జిల్లాల్లోనూ,  వైద్య కళాశాల ఆసుపత్రుల సహకారంతో ఐ.డి.ఎస్.పి నెట్ వర్క్ ద్వారా తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (ఎస్.ఏ.ఆర్.ఐ.) / ఇన్ఫ్లుఎంజా వంటి అనారోగ్యం (ఐ.ఎల్.ఐ.)  పై నిఘాను ముమ్మరం చేయాలి.  కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు నిఘాకు సహాయపడటానికి, ప్రజల స్వీయ అంచనా కోసం ప్రజలందరూ ఆరోగ్య సేతు యాప్ ను డౌన్‌లోడ్  చేసుకునేలా కృషి చేయాలని ఆయన కోరారు. కోవిడ్-19 కోసం ప్రత్యేకించిన ఆస్పత్రులు, సహాయ కేంద్రాలు, సంరక్షణ కేంద్రాలు వంటి సేవల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి నిధులు కేటాయించినట్లు రాష్ట్రాలకు సమాచారం ఇవ్వబడింది. ఈ నిధి కింద ఆర్ధిక సహాయం పొందటానికి రాష్ట్రాలు తమ ప్రతిపాదనలను సమర్పించాల్సిన అవసరం ఉంది.

 అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు ఆయా సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు. రాష్ట్రాల్లోకి ప్రవేశించే ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తిని నిరోధించే చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేయాలనీ, మార్గదర్శకాలకు అనుగుణంగా  క్వారంటైన్ విధానాలను పాటించాలనీ అన్నారు. 

కోవిడ్-19 తో పాటు, ఇతర ఆరోగ్య సమస్యలపై కూడా ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్రాలకు సూచించారు.  గర్భిణీలకు తగిన వైద్య సహాయం, టీకాల కార్యక్రమం, టి.బి. గుర్తింపు, చికిత్స వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలిఅంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలిప్రజల ఆరోగ్య పరిరక్షణ అవసరాలకు తగినట్టుగా టెలి-మెడిసిన్, టెలి-కౌన్సిలింగ్ సదుపాయాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలిఆరోగ్య పరిరక్షణ సిబ్బంది, పారామెడిక్స్, ఇతర ఆరోగ్య పరిరక్షణ కార్మికులకు సకాలంలో జీత,భత్యాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎన్.హెచ్.ఎమ్. నిధులను  ఆరోగ్యశాఖకు బదిలీ అయ్యిందీ, లేనిదీ, ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.  కోవిడ్ కానీ ఇతర ఆరోగ్య సమస్యల పరిష్కారానికి 1075 నెంబరు తో పాటు 104 హెల్ప్ లైన్ నెంబర్ సేవలను కూడా వినియోగించుకోవాలని రాష్ట్రాలను కోరారుఅత్యవసర మందులు సమృద్ధిగా నిల్వలు ఉంచుకోవాలనీ, వీలయితే కార్యకర్తలను నియోగించి, అవసరమైనవారికి ఇంటిదగ్గర మందులు ఇచ్చే విధానాన్ని అమలుచేయడానికి ప్రయత్నించాలని కూడా రాష్ట్రాలకు సూచించారు. 

కొన్ని రాష్ట్రాల్లో ధూమపానం చేయని పొగాకు వాడకం ఎక్కువగా ఉన్నందున,  దాని విస్తృత వినియోగాన్ని నిషేధించే దిశగా, కఠినమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ హర్ష వర్ధన్ రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్-19 వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలని కోరారు. ఈ దిశగా బలమైన సంస్కరణలు అవసరమవుతాయని, ఆయన అన్నారు.  నోట్లో నమిలే పొగాకు వాడకాన్ని నిషేధించిన రాష్ట్రాలను, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జరిమానా విధిస్తున్న రాష్ట్రాలను ఆయన ప్రశంసించారు.

ఈ సమావేశంలో హెచ్.ఎఫ్.డబ్ల్యూ. కార్యదర్శి, శ్రీమతి ప్రీతీ సుడాన్;  హెచ్.ఎఫ్.డబ్ల్యూ. ఓ.ఎస్.డి. శ్రీ రాజేష్ భూషణ్;  ఎన్.హెచ్.ఎమ్., ఏ.ఎస్. & ఎమ్.డి. శ్రీమతి వందన గుర్నాని;  ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. సంయుక్త కార్యదర్శి డాక్టర్ మనోహర్ అగ్ననీ ఎన్.సి.డి.సి. డైరెక్టర్ డాక్టర్ ఎస్.కే. సింగ్;  ఆరోగ్యశాఖ ప్రధానకార్యదర్శి తో పాటు ఆయన రాష్ట్రాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు

*****


(Release ID: 1622577) Visitor Counter : 228