వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

దేశ వ్యాప్తంగా పీఎం-జికెఏవై కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు సరఫరా చేసేందుకు భారీ కసరత్తు: కేంద్ర ఆహార,

ప్రజా పంపిణీ శాఖ మంత్రి



2641 రేక్ లలో 74 లక్షల మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఎఫ్ సి ఐ సిద్ధం చేయడం రికార్డు అని వెల్లడించిన శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్



మూడు నెలల పాటు 19.50 కోట్ల కుటుంబాలకు ఉచితంగా పప్పు ధాన్యాలను అందించేందుకు నాఫెడ్ భారీ కార్యక్రమం చేపట్టిందని తెలిపిన మంత్రి



ఆహార ధాన్యాలకు ఎటువంటి కొరత లేదు; కొనసాగుతున్న సేకరణ : శ్రీ పాశ్వాన్

Posted On: 08 MAY 2020 5:24PM by PIB Hyderabad

పీఎం-జికెఏవై కింద ఆహార ధాన్యాల పంపిణీ:

"ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎం-జికె)" కింద రాష్ట్రాల అవసరాలను తీర్చడానికి అన్ని రాష్ట్రాల్లో పంపిణీ చేయడానికి ఆహార ధాన్యాలు తక్షణమే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలుఆహారప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ఎఫ్‌సిఐ ఇప్పటికే మొత్తం 2641 రేక్‌లను (గోధుమ మరియు బియ్యంతో సహా) లోడ్ చేసింది దాని సుమారు పరిమాణం 73.95 ఎల్‌ఎమ్‌టి (55.38 ఎల్‌ఎమ్‌టి బియ్యం, 18.57 ఎల్‌ఎమ్‌టి గోధుమలు). 24.03.2020 (దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన తేదీ) నుండి 08.05.2020 వరకు భారీ ఎత్తున ఆహార ధాన్యాలు సిద్ధం చేసి ఇప్పటి వరకు అతి పెద్ద రికార్డ్ నెలకొల్పింది.  

21 రాష్ట్రాలు / యుటిలలో దాదాపు 41.35 కోట్ల మంది లబ్ధిదారులను వర్తింపజేస్తూ పిఎం-జికెఎ కింద ఏప్రిల్ నెలలో 90% కంటే ఎక్కువ పంపిణీని పూర్తి చేశాయని ఆయన చెప్పారు. కొన్ని రాష్ట్రాలు / యుటిలుఅండమాన్ నికోబార్ ద్వీపండి అండ్ ఎన్హెచ్డామన్ & డయ్యుమధ్యప్రదేశ్ఒడిశాపుదుచ్చేరిహిమాచల్ ప్రదేశ్ మొదలైనవి పిఎమ్‌కెకెఎ కింద రెండు నెలలు ఆహార ధాన్యాలు  ఒకేసారి పంపిణీ చేస్తున్నాయి.  

పిఎం-జికెఎ కింద ఉచిత ఆహార ధాన్యాల అదనపు ప్రయోజనం గురించి అవగాహన కల్పించడానికి కోట్ల ప్రత్యేక సంక్షిప్త సందేశాల(ఎస్ఎంఎస్)ను ఎన్ఎఫ్ఎస్ఏ రేషన్ కార్డుదారులకు 20 రాష్ట్రాలు /యుటి లు పంపినట్లు మంత్రి చెప్పారు. 

కోవిడ్-19 మహమ్మారి వలన కలిగే వివిధ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడమే  పిఎం-జికెఎ లక్ష్యమని ఆయన తెలిపారు. రాబోయే మూడు నెలల్లో ఆహార ధాన్యాలు లభించలేదనే కారణంగా పేదలు దుర్బలమైన పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

దీని ప్రకారం, 2020 ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు నెలల కాలానికి అన్ని రాష్ట్రాలు / యుటిలలో పిఎం-జికెఎ కింద 80 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు అదనపు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి తీసుకున్న విధాన నిర్ణయాన్ని ఆహారప్రజా పంపిణీ శాఖ ప్రకటించింది. 

పిఎం-జికేఏవై కింద పప్పుధాన్యాల పంపిణీ: 

ఆహార ధాన్యాలతో పాటుదేశవ్యాప్తంగా మూడు నెలల పాటు సుమారు 19.50 కోట్ల గృహాలకు ప్రభుత్వం ఒక కిలో చొప్పున పప్పుధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తోందని శ్రీ పాశ్వాన్ తెలిపారు. పప్పుధాన్యాలకు సంబంధించి ఇంత భారీ కార్యక్రమాన్ని వినియోగదారుల వ్యవహారాల శాఖ చేపట్టడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు. ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా 165 నాఫెడ్ గోడౌన్లలో ఉన్న తన నిల్వలను ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించింది. దేశవ్యాప్తంగా 100 పప్పు మిల్లులను ఇప్పటివరకు నాఫెడ్ పరిధిలోకి తెచ్చింది

21 రాష్ట్రాలు, యుటిలలో 51,105 ఎల్ఎంటి పప్పు ధాన్యాలను పంపిణీ చేసినట్లు మంత్రి చెప్పారు. కంది పప్పు, మినప పప్పు, సెనగ పప్పు. పెసర పప్పు ...వీటిలో ఏ పప్పులు ఎవరికి కావాలో తెలియజేయడంలో  రాష్ట్రాలు / యుటిలు ఆలస్యం చేయడం వల్లే సరఫరా, పంపిణీలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు. లాక్డౌన్ సమయంలో వివిధ రాష్ట్రాల నుండి, మయన్మార్ సరిహద్దులోని అరుణాచల్ ప్రదేశ్ లోని విజయనగర్ మరియు లడఖ్ వంటి అనేక ప్రవేశించలేని ప్రదేశాల నుండి రవాణా చేయడం చాలా సవాళ్లుగా ఉన్న  పరిస్థితులలో పప్పుధాన్యాలు వాయు మార్గం ద్వారా పంపాల్సి వచ్చింది. అంతేకాకుండాసామజిక దూరంలో భాగంగా ప్రజల కలయికను తగ్గించాలనే ఉద్దేశంతో యుపి వంటి కొన్ని రాష్ట్రాలు పప్పుధాన్యాలను ఆహార ధాన్యాలతో కలిసి ఒకే సారి పంపిణీ చేయాలని నిర్ణయించాయిఇది కూడా పంపిణీ ఆలస్యానికి కారణమైంది.

 

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ప్రణాళిక 17 రాష్ట్రాలు/యుటి లకు వర్తింపు:

"ఒకే దేశం ఒకే రేషన్ కార్డ్" ప్రణాళిక ప్రకారంఉత్తరప్రదేశ్బీహార్పంజాబ్హిమాచల్ ప్రదేశ్దాదర్, నగర్ హవేలిడామన్ & డయ్యు.. ఈ 5 రాష్ట్రాలు / యుటిలను జాతీయ క్లస్టర్తో అనుసంధానించమని కోరినట్లు శ్రీ పాశ్వాన్ తెలిపారు. 1 జనవరి 2020 నుండి ఈ క్లస్టర్‌లో 12 రాష్ట్రాలు ఉన్నాయి - అవి ఆంధ్రప్రదేశ్గోవాగుజరాత్హర్యానాజార్ఖండ్కేరళకర్ణాటక మధ్యప్రదేశ్మహారాష్ట్రరాజస్థాన్తెలంగాణత్రిపుర . ఇప్పుడుమొత్తం 17 రాష్ట్రాలు / యుటిలు నేషనల్ క్లస్టర్‌తో అనుసంధానించబడి, 60 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ఆహార ధాన్యాల కోటాను పంపిణీ చేసేందుకు జాతీయ / అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ సౌకర్యం ప్రారంభించబడుతుంది. రేషన్ కార్డును ఉపయోగించడం ద్వారా వారికి నచ్చిన ఏదైనా చౌక ధర దుకాణం ద్వారా రేషన్ పొంద వచ్చు. 


ఎఫ్ సి ఐ ద్వారా ఆహార ధాన్యాల సేకరణ కొనసాగింపు 

పెరిగిన డిమాండ్లను తీర్చడానికి తగిన ఆహార ధాన్యాల సరఫరా అందుబాటులో ఉందనిసేకరణ ప్రక్రియ కూడా కొనసాగుతోందని  శ్రీ పాశ్వాన్ హామీ ఇచ్చారు. 08.05.2020 నాటికిరబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్‌ఎంఎస్) 2020-21లో గోధుమల సంచిత సేకరణ 226.85 ఎల్‌ఎమ్‌టి కాగాఆర్‌ఎంఎస్ 2019-20లో సంబంధిత సేకరణ 277.83 ఎల్‌ఎమ్‌టి. అందువల్లప్రస్తుత సీజన్లో గోధుమల సేకరణ మునుపటి సీజన్ కంటే 18.35% తక్కువగా ఉందని ఆయన చెప్పారు. వరి సంచిత సేకరణ, 06.05.2020 నాటికిరైస్ ఇన్ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2019-20 439.02 ఎల్‌ఎమ్‌టి అయితేకెఎంఎస్ 2018-19లో సంబంధిత సేకరణ 398.13 ఎల్‌ఎమ్‌టి. అందువల్ల ప్రస్తుత సీజన్‌లో బియ్యం సేకరణ 10.27% ఎక్కువ అని ఆయన అన్నారు.

ఆర్ఎంఎస్ 2020-21 సమయంలో గోధుమవరి / బియ్యం సేకరణ సాధారణంగా ఏప్రిల్ న ప్రారంభమవుతుంది. కోవిడ్-19 కారణంగాచాలా రాష్ట్రాలు ఏప్రిల్ 15 న తమ సేకరణ కార్యకలాపాలను ప్రారంభించగలవు. ప్రస్తుతమున్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యాతరువాతి రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్‌ఎంఎస్) 2020-21లో గోధుమల సేకరణఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2019-20లో రబీ పంట వరి / బియ్యం సేకరణను చేపట్టాలని నిర్ణయించారు. తాత్కాలిక ప్రాతిపదికనగోధుమవరి /బియ్యం  విషయంలో వరుసగా మునుపటి ఆర్ఎంఎస్ -2019-20, కేఎంఎస్ 2018-19 (రబీ పంట) మాదిరిగానే సేకరణ లక్ష్యం / అంచనా అలాగే ఉంటుంది.

ఒకేసారి పెద్ద సంఖ్యలో రైతుల గుమిగూడడాన్ని నివారించడానికి సేకరణ కార్యకలాపాలు దఫాల వారీ జరిగేలా చూడాలనిదీనికోసం ఒకరకమైన టోకెన్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఈ కేంద్రాలలో భౌతిక దూరాన్ని నిర్ధారించడానికిపరిశుభ్రతను కాపాడటానికి సేకరణ కార్యకలాపాలను వికేంద్రీకరించేలా సేకరణ కేంద్రాల సంఖ్యను కూడా సాధ్యమైనంత వరకు పెంచవచ్చు.

 

కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ఆహార ధాన్యాల ప్యాకేజింగ్ కోసం జనపనార సంచులు / బేళ్ల కొరత వల్ల తలెత్తే పరిస్థితిని అంచనా వేయడానికి ఆహారప్రజా పంపిణీ శాఖ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని శ్రీ పాశ్వాన్ తెలిపారు.  

*****


(Release ID: 1622333) Visitor Counter : 400