సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

బుధ్ధ పూర్ణిమ నేపథ్యంలో వర్చువల్ “వేసక్ గ్లోబల్ సెలబ్రేషన్స్” లో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడి

వర్చువల్ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల బౌద్ధ సంఘాల అధిపతులు

కోవిడ్ -19 బాధితులు, ముందు వరుస యోధుల (ఫ్రంట్ లైన్ వారియర్స్) గౌరవార్థం గ్లోబల్ ప్రార్థనా వారంగా ఈ కార్యక్రమం అంకితం

Posted On: 07 MAY 2020 5:05PM by PIB Hyderabad

బుద్ధ పూర్ణిమ సందర్భంగా వర్చువల్ వేసక్ గ్లోబల్ సెలబ్రేషన్స్ లో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసంగించారు. సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జ్) మరియు పర్యాటక శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జ్) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జ్) మరుయు మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కిరెన్  రిజు ఈ కార్యక్రమంలో ఆన్ లైన్ ద్వారా పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తన ముఖ్య ఉపన్యాసంలో బుద్ధుని జీవితం, బోధనలు మరియు సందేశం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయని తెలిపారు. వారి సందేశం ఏ ఒక్క సందర్భానికో, అంశానికో పరిమితం కాదని, కాలం మారినా, పరిస్థితులు మారినా, సమాజంలో అనేక మార్పులు వచ్చినా, బుద్ధుని బోధనల ప్రభావం మన జీవితాల్లో నిరంతరం ప్రసరిస్తూ ఉందని తెలిపారు. గౌతమ బుద్ధుడు అనేది కేవలం పేరు మాత్రమే కాదని, మానవ హృదయాల్లో ప్రతిధ్వనించే పవిత్రమైన ఆలోచన, సమస్త మానవాళికి మార్గనిర్దేశం చేసే బోధనలు అని ప్రధాని తెలిపారు.

బుద్ధ భగవానుని ప్రతి ఉపన్యాసం మానవాళికి సేవ చేయాలనే భారతదేశ నిబద్ధతను బలపరుస్తుందని ప్రధాని తెలిపారు. బుద్ధుడు భారత జ్ఞానోదయం మరియు భారతదేశం ఒక్క స్వీయ సాక్షాత్కారాలకు నిదర్శనమని, ఈ స్వీయ సాక్షాత్కారంతో, భారతదేశం మొత్తం మానవత్వం, మొత్తం ప్రపంచం యొక్క అభివృద్ధి కోసం పని చేస్తూనే ఉంటుందని, ప్రపంచ ప్రగతి కోసం భారతదేశ పురోగతి ఎల్లప్పుడూ సహాయపడుతూనే ఉంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

శ్రీ నరేంద్ర మోడీ పూర్తి ప్రసంగం కోసం దయచేసి ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేయండి.

https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1621741

కేంద్ర సాంస్కృతి శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జ్), పర్యాటక శాఖ సహాయమంత్రి (ఇంఛార్జ్) శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ బుద్ధ పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. 2015లో బుద్ధపూర్ణిమను జాతీయ వేడుకగా పాటించే ప్రయత్నం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. బుద్ధ భగవానుడు ప్రేమ మరియు అహింసల శక్తిని చూపించాడన్న శ్రీ పటేల్, అహింస అనేది జ్ఞానం యొక్క భాష అని బుద్ధభగవానుడు ఒక్క మాటలో చెప్పాడని తెలిపారు. బుద్ధ భగవానుడు ప్రేమ శక్తిని ప్రపంచానికి తెలిపారన్న శ్రీ పటేల్, తన ప్రసంగంల బుద్ధుడు బోధించిన ఉదాహరణలను కూడా పంచుకున్నారు.

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జ్) మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కిరన్ రిజిజూ మాట్లాడుతూ బుద్ధ పూర్ణిమను జరుపుకోవడానికి నలుమూలల నుంచి ప్రజలంతా ఒకటే కుటుంబం వలే సమావేశం కావడం తాను గొప్పగా భావిస్తున్నానని, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇది వసుధైవ కుటుంబకం అంటే ప్రపంచ మొత్తం ఒకే కుటుంబం అనే మాటల యొక్క ఉత్తమ ఉదాహరణగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ (ఐ.బి.సి), ఎ గ్లోబల్ బుద్ధిస్ట్ అంబ్రెల్లా సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధ సంఘాల అధిపతుల భాగస్వామ్యంతో వర్చువల్ ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించింది. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బుద్ధ పూర్ణిమ వేడుకలు వర్చువల్ మాధ్యమం ద్వారా జరుగుతున్నాయి. కోవిడ్ -19 బాధితులు మరియు ముందు వరుస యోధుల గౌరవార్థం ఈ కార్యక్రమాన్ని గ్లోబల్ ప్రార్థనా వారంగా అంకితం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ప్రార్థన వేడుకలు మహాబోధి ఆలయం, బోధ్ గయ, ముల్గంధ కుటి విహారా, సారనాథ్, భారతదేశం, పరినిర్వాణ స్థూపం, కుషి నగర్, భారతదేశం నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయబడ్డాయి. సేక్రేడ్ గార్డెన్ లుంబిని, నేపాల్, శ్రీలంకలోని పవిత్రమైన మరియు చారిత్రక అనురాథపుర స్థూప ప్రాంగణంలో రువ్వాన్వేలి మహా సేయా నుండి పిరిత్ జపాలు నిర్వహించారు. బౌద్ధనాథ్, స్వయంభు, నామో స్థూపాలు, నేపాల్ ఇతర ప్రసిద్ధి బౌద్ధ ప్రదేశాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ప్రత్యక్షంగా ఫేస్ బుక్ లైవ్ లో, యూ ట్యూబ్ లో, ఐ.బి.సి. సోషల్ మీడియా హ్యాండిల్స్ తో పాటు మండలా మొబైల్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.

భారతదేశం, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, చెక్ రిపబ్లిక్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మయన్మార్, మంగోలియా, మలేషియా, నేపాల్, రష్యా, శ్రీలంక, సింగపూర్, తైవాన్, వియత్నాం  సహా అనేక దేశాలకు చెందిన వారు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

తథాగట గౌతమ్ బుద్ధుని జననం, జ్ఞానోదయం మరియు మహా పర్నిర్వణాలను ఉత్సవాలుగా జరుపుకునే క్రమంలో వెసక్- బుద్ధ పూర్ణిమను ట్రిపుల్ బ్లెస్స్డ్ డే గా పరిగణిస్తారు.

 

***

 

(Release ID: 1621892) Visitor Counter : 311