రైల్వే మంత్రిత్వ శాఖ

రాష్ట్ర అథారిటీల‌కు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌ను స‌మ‌కూర్చేందుకు భార‌తీయ రైల్వేలు స‌న్న‌ద్ధంగా ఉన్నాయి.

భార‌తీయ రైల్వేల‌లో 5231 కోచ్‌లు కోవిడ్ కేర్ సెంట‌ర్లుగా సిద్ధంగా ఉన్నాయి.
కోవిడ్ కేర్ సెంట‌ర్ల ఏర్పాటుకు 215 స్టేష‌న్ల గుర్తింపు.
ఈ 215 స్టేష‌న్ల‌లో రైల్వేలు 85 స్టేష‌న్ల‌లో ఆరోగ్య సంర‌క్ష‌ణ స‌దుపాయాలు క‌ల్పించ‌నున్నాయి. 130 స్టేష‌న్ల‌లో సిబ్బందిని, అత్వ‌స‌ర మందులను స‌మ‌కూర్చ‌డానికి అంగీక‌రిస్తే , రాష్ట్రాలు కోవిడ్ కోచ్‌ల‌ను కోర‌వ‌చ్చు.
కోవిడ్ కేర్ సెంటర్ల‌లో నీరు, విద్యుత్, మరమ్మతులు, క్యాటరింగ్ భద్రతా ఏర్పాట్ల‌ను భారత రైల్వే చూసుకుంటుంది
రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను విడుద‌ల చేసిన కేంద్ర ప్రభుత్వం
ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) , ఇతర సంస్థలతో సంప్రదించి రైల్వేచే మార్గదర్శకాల రూప‌క‌ల్ప‌న‌
కోవిడ్ -19 సవాలును ఎదుర్కోవటానికి భారత రైల్వే 2500 మందికి పైగా వైద్యులు , 35,000 మంది పారామెడిక్ సిబ్బందిని నియమించింది
ప్రతికూల పరిస్థితులలో జాతీయ స‌ప్ల‌య్ చెయిన్‌న‌రు నిర్వహించడంతో పాటు, కోవిడ్ పై పోరాటంలో భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా భారత రైల్వే గణనీయమైన కృషి చేస్తున్న‌ది
రైల్వేలు త‌మ ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌ను ర‌క్షించ‌డానికి స్వంతంగా పిపిఇల‌ను కూడా ఉత్ప‌

Posted On: 07 MAY 2020 3:18PM by PIB Hyderabad

రైల్వే మంత్రిత్వ శాఖ తన 5231 బోగీలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్ర‌త్వ‌శాఖ‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, కోవిడ్ కేర్ సెంటర్లకు వైద్యపరంగా కేటాయించగలిగే చాలా తేలికపాటి కేసులకుఈ కోచ్‌లను ఉపయోగించవచ్చు. అనుమానిత,  ధృవీకరించబడిన కోవిడ్ కేసుల‌కోసం, సామర్థ్యాలను పెంచడానికి , ఆయా రాష్ట్రాల‌లో కోవిడ్‌స‌దుపాయాలు నిండిపోయిన ద‌శ‌లో లో ఈ బోగీలను ఉపయోగించవచ్చు
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ జారీచ‌సిన మార్గ‌ద‌ర్శ‌కాలు దీనితో జ‌త‌చేయ‌డం జ‌రిగింది.( లింక్ కింద‌ ఇవ్వ‌బ‌డింది)
కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ, భారత ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలకు తోడ్పాటుగా, భారత రైల్వే అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. భారతీయ రైల్వే తన 5231 కోవిడ్ కేర్ సెంటర్లను రాష్ట్రానికి అందించడానికి సన్నద్ధమైంది. క్వారంటైన్ స‌దుపాయం కోసం  జోనల్ రైల్వే , బోగీలలో మార్పులు   చేసి సిద్ధం చేసింది
కోవిడ్ కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌డానికి గుర్తించిన 215 స్టేషన్లలో,  85 స్టేషన్లలో రైల్వేలు హెల్త్ కేర్‌ స‌దుపాయాలు క‌ల్పిస్తాయి., 130 స్టేషన్లలో, ఆరోగ్య సౌకర్యాలు కల్పించటానికి, ఆయా రాష్ట్రాలు సిబ్బంది ,అవసరమైన .మందుల‌ను అందించడానికి అంగీకరించే ప‌క్షంలోనే కోవిడ్ కేర్ కోచ్‌ల‌ను  అభ్యర్థించాలని కోరారు. భారతీయ రైల్వే 158 స్టేషన్లో మంచినీరు,  ఛార్జింగ్ సదుపాయం క‌ల్పించ‌నుంది. అలాగే  58 స్టేషన్లను  కోవిడ్ కేర్ కేంద్రాలకు మంచినీరు సిద్ధంగా ఉంది. (ఇందుకు సంబంధించిన జాబితా లింక్ కింద అనెక్సుర్ -ఎ లో ఉంది).
కోవిడ్ కేర్ సెంటర్లతో పాటు, కోవిడ్ 19 సవాలును ఎదుర్కోవటానికి 2500 మందికి పైగా వైద్యులు , 35,000 మంది పారామెడిక‌ల్‌ సిబ్బందిని భార‌తీయ రైల్వేలు అందుబాటులో  ఉంచుతుంది. వివిధ జోన్ల‌లో డాక్ట‌ర్లు , పారామెడిక్ సిబ్బందిని తాత్కాలిక ప్రాతిప‌దిక‌పై నియ‌మించ‌డం జరుగుతోంది.
కోవిడ్ -19 రోగుల చికిత్స కోసం, ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు 17 ప్ర‌త్యేక‌ ఆసుపత్రులలో 5,000 పడకలు , రైల్వే ఆసుపత్రులలో 33 హాస్పిటల్ బ్లాక్‌లను గుర్తించారు..
ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ  మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు త‌మ‌ అభ్యర్థనను రైల్వేకు పంపుతాయి. రైల్వేలు ఈ బోగీలను రాష్ట్ర , కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేటాయించనున్నాయి. రైల్వే కేటాయించిన తరువాత, రైలును త‌గిన మౌలిక సదుపాయాలతో అవసరమైన స్టేషన్‌లో  ఉంచుతారు . జిల్లా కలెక్టర్ , మేజిస్ట్రేట్ లేదా వారి అధీకృత వ్యక్తులలో ఒకరికి దీనిని అప్ప‌గిస్తారు.  రైలు ఉంచిన ప్ర‌దేశంలో  మంచినీరు, విద్యుత్, మరమ్మతులు, క్యాటరింగ్ ఏర్పాట్లు, భద్రత వంటి వాటిని రైల్వే శాఖ చూసుకుంటుంది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వాక మార్గ‌ద‌ర్శ‌కాల లింక్‌:
స్టేష‌న్ల జాబితా అనెక్సుర్ -ఎ:



(Release ID: 1621821) Visitor Counter : 204