ప్రధాన మంత్రి కార్యాలయం
కరోనా వాక్సిన్ అభివృద్ధి, ఔషధ అన్వేషణ, చికిత్స, పరీక్షలకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
Posted On:
05 MAY 2020 11:00PM by PIB Hyderabad
టీకా అభివృద్ధి, ఔషధాల ఆవిష్కరణ, రోగ నిర్ధారణ ,చికిత్స, పరీక్షలలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ప్రస్తుత కృషిని ప్రధానమంత్రి ఈరోజు సమీక్షించారు. భారతీయ వ్యాక్సిన్ కంపెనీలు వాటి నాణ్యత, ఉత్పాదక సామర్థ్యం విషయంలో పేరెన్నికగన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి తమ కార్యకలపాలు సాగిస్తున్నాయి. దీనికితోడు ప్రస్తుతం, వారు వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలో ప్రారంభ దశ ఆవిష్కర్తలుగా వచ్చారు. అదేవిధంగా, భారతీయ అధ్యయన సంస్థలు, స్టార్టప్‌లు కూడా ఈ విషయంలో ముందున్నాయి. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి కి సంబంధించి 30 కి పైగా భారతీయ వ్యాక్సిన్లు వివిధ దశలలో ఉన్నాయి, కొన్ని నమూనా పరీక్షల దశకు వెళ్తున్నాయి
అదేవిధంగా, ఔషధ అభివృద్ధిలో మూడు విధానాలు అనుసరిస్తున్నారు. మొదట, ఇప్పటికే ఉన్న ఔషధాల పునర్వినియోగం. ఈ విభాగంలో కనీసం నాలుగు మందులు పరీక్షలో ఉన్నాయి. రెండవది, ప్రయోగశాల ధృవీకరణతో అధిక పెర్ఫార్మెన్స్ కంప్యుటేషనల్ అప్రోచ్ ద్వారా కొత్త ఔషధాల , అణువుల అభివృద్ధి. మూడవది, సాధారణ యాంటీ-వైరల్ ప్రాపర్టీలకోసం మొక్కల నుంచి తీసిన ఉత్పత్తులను పరిశీలించడం.
ఆర్టి-పిసిఆర్ విధానం , యాంటీబాడీ డిటెక్షన్ కోసం , రోగ నిర్ధారణ , పరీక్షలకు సంబంధించి అనేక విద్యా పరిశోధనా సంస్థలు స్టార్టప్‌లు కొత్త పరీక్షలను అభివృద్ధి చేశాయి. అదనంగా, దేశవ్యాప్తంగా ప్రయోగశాలలను అనుసంధానించడం ద్వారా, ఈ రెండు రకాల పరీక్షల సామర్థ్యం భారీగా పెరిగింది. ప్రస్తుత అవసరాలను తీర్చడం ద్వారా, పరీక్ష కోసం అవసరమైన వాటిని దిగుమతి చేసుకునే సమస్యను భారతీయ స్టార్టప్‌లు, పరిశ్రమల కన్సార్టియా పరిష్కరించింది. ప్రస్తుతం ఈ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం, దీర్ఘకాలిక పరిశ్రమ అభివృద్ధికి అవకాశం కల్పిస్తోంది..
అధ్యయన సంస్థలు, పరిశ్రమ ప్రభుత్వం , అసాధారణమైన, వేగవంతమైన సమర్థవంతమైన నియంత్రణ ప్రక్రియతో కలసి ముందుకు రావడాన్ని ప్రధానమంత్రి నిర్వహించిన సమావేశంలో గుర్తించారు. . ఇటువంటి సమన్వయం ,వేగాన్ని ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో పొందుపరచాలని ప్రధాని ఆకాంక్షించారు.సంక్షోభంలో సాధ్యమయ్యేది ,రోజువారీ శాస్త్రీయ కార్యకలాపాలలో ఒక భాగంగా ఉండాలని ఆయన ఉద్ఘాటించారు.
ఔషధ ఆవిష్కరణలో కంప్యూటర్ సైన్స్, రసాయన శాస్త్రం, బయోటెక్నాలజీ వంటి విభాగాలు కలసి ముందుకు రావడంపట్ల శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని ప్రధాని అన్నారు. సింథసిస్ కు కంప్యూటర్ సైన్ప్‌ను, లేబరెటరీలలో పరీక్షలను అనుసంధానించే అంశంపై హ్యాకథాన్ నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ హ్యాకథాన్‌లో విజయం సాధించిన వారిని స్టార్టప్‌లు తీసుకుని పరిశోధనలను మరింత అభివృద్ధి, ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి వీలు కలుగుతుందని ఆయన అన్నారు.
మౌలిక విజ్ఞాన శాస్త్రవేత్తల నుంచి అనువర్తిత శాస్త్రాలవారి వరకు, భారతీయ శాస్త్రవేత్తలు,వినూత్న ,అసలైన పద్ధతిలో పరిశ్రమతో కలిసి రావడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఈ రకమైన గర్వకారణమైన ధోరణి, వాస్తవికత, స్ఫూర్తి మనం ముందుకు సాగే విధానంలో బలంగా కనిపించాలి.. అప్పుడే మనం సైన్స్ లో ఇతరులకు అనుచరులుగా కాక, ప్రపంచంలోనే అత్యుత్తమమైన స్థాయిలో ఉండగలం.
***
(Release ID: 1621496)
Visitor Counter : 335
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada