హోం మంత్రిత్వ శాఖ
భారతదేశానికి వచ్చేందుకు, భారతదేశం నుంచి వెళ్ళేందుకు ప్రయాణీకులు అంతర్జాతీయ విమాన ప్రయాణాల నిషేధాన్ని ఎత్తివేసే వరకూ కొన్ని వర్గాలు మినహా విదేశీ ప్రయణాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న అన్ని వీసాలు నిలిపివేయబడతాయి
Posted On:
05 MAY 2020 8:00PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ -19 వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో, దౌత్య అధికారికి చెందిన వారికి, ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు, ఉపాధి మరియు ప్రాజెక్టు వర్గాలు మినహా, విదేశీయులకు మంజూరు చేసిన వీసాలన్నింటినీ 2020 మే 3 వరకూ నిపివేయాలని 2020 ఏప్రిల్ 17న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఏ) నిర్ణయించింది.
(https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1615500)
ఈ విషయాన్ని పునఃపరిశీలించిన తర్వాత దౌత్య, అధికారిక, ఐక్యరాజ్యసమితి లేదా అంతర్జాతీయు సంస్థలు ఉపాధి మరియు ప్రాజెక్టు వర్గాలకు చెందిన వారు మినహా విదేశీయులకు మంజూరు చేసిన అన్ని వీసాలు, అంతర్జాతీయ ప్రయాణాల మీద నిషేధం ఎత్తి వేసే వరకూ నిలిపేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
అధికారిక ఆర్డర్ కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి
(Release ID: 1621353)