రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

లాక్‌డౌన్ స‌మ‌యంలో మందుల కొనుగోలుకు వాట్స్‌యాప్‌, ఈ మెయిల్ ద్వారా ఆర్డ‌ర్ల‌ను అంగీక‌రిస్తున్న ప్ర‌ధాన‌మంత్రి భారతీయ జ‌నఔష‌ధి కేంద్రాలు

Posted On: 05 MAY 2020 12:59PM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వ ర‌సాయ‌నాలు, ఎరువుల మంత్రిత్వ‌శాఖ‌ ప‌రిధిలోని  ప్ర‌ధాన‌మంత్రి భార‌తీయ జ‌నౌష‌ధి కేంద్రాలు (పిఎంబిజెకె), లాక్‌డౌన్ స‌మ‌యంలో మందుల కొనుగోలుకు వాట్స్‌యాప్‌, ఈ మెయిల్ ద్వారా ఆర్డ‌ర్ల‌ను అంగీక‌రిస్తున్నాయి.అప్ లోడ్ చేసిన ప్రిస్క్కిప్ష‌న్ ఆధారంఆ మందుల‌ను పేషెంట్ల ఇంటివ‌ద్ద‌కే అందిస్తున్నారు. ఇది పేషెంట్లు సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని  ఉప‌యోగించి సుల‌భంగా మందులు సేక‌రించ‌డానికి వీలు క‌లిగిస్తుంది. పి.ఎం.బి.జె.కెలు ఈ స‌దుపాయం క‌ల్పిస్తున్నందుకు కేంద్ర ర‌సాయ‌నాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. స‌దానంద గౌడ అభినంద‌న‌లు తెలుపుతూ,  " చాలా మంది పిఎమ్‌బిజెకెలు పేషెంట్ల‌కు అవ‌స‌ర‌మైన మందుల‌ను   వేగంగా పంపిణీ చేయడానికి , వారికి మెరుగైన సేవలను అందించడానికి వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో సహా ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలను ఉపయోగిస్తుడ‌డం తెలిసి ఆనందంగా ఉంది.ష అని అన్నారు.

 


ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషాధి పరియోజన (పిఎంబిజెపి) కింద పిఎంబిజెకెలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని 726 జిల్లాల్లో 6300 పిఎమ్‌బిజెకెలు పనిచేస్తున్నాయి, సరసమైన ధరలకు నాణ్యమైన మందుల‌ను ఇవి స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. ఈ ఔ షధాలు సగటున 50శాతం నుండి 90శాతం వరకు చౌకగా ఉంటాయి. ఏప్రిల్ 2020 లో 52 సుమారు, కోటి రూపాయల విలువైన మందుల‌ను దేశవ్యాప్తంగా సరఫరా చేశారు.

మారుమూల ప్రాంతాల‌లో ఉన్న స్టోర్ల‌కు సరఫరా చేయడానికి ఇండియా పోస్ట్‌తో ఏర్పాట్లు కూడా ఉన్నాయి.
అంతేకాకుండా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, కేంద్ర రసాయనాలు , ఎరువుల మంత్రిత్వ శాఖలోని బ్యూరో ఆఫ్ ఫార్మా పిఎస్‌యుస్ ఆఫ్ ఇండియా (బిపిపిఐ) ముడి పదార్థాలు ,లాజిస్టిక్స్ కోసం వారి వ‌ర్కింగ్ కేపిట‌ల్  సమస్యలను పరిష్కరించడానికి నిర్ణీత తేదీలోపు దాని అమ్మకందారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లిస్తోంది.
లాక్ డౌన్‌ కారణంగా సరఫరాలో  అడ్డంకులను పరిష్కరించడానికి ప్రతి రాష్ట్రానికి బిపిపిఐ అధికారులచే  ప్ర‌త్యేక‌ బృందం  ఏర్పాటు చేశారు.
జన ఔష‌ధి గిడ్డంగులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి . సిబ్బందికి అక్క‌డే  నివాస ఏర్పాట్లు చేశారు.
వినియోగదారులు , స్టోర్ యజమానుల సమస్యలను పరిష్కరించడానికి బిపిపిఐ హెల్ప్‌లైన్ నంబ‌ర్లు పనిచేస్తున్నాయి.

లాక్ డౌన్ వ్యవధిలో అవసరమైన ఔష‌ధాల‌ సరఫరాను నిర్వహించడానికి, రూ 186.52  కోట్ల రూపాయ‌ల  గ‌రిష్ఠ చిల్ల‌ర ధ‌ర విలువ‌‌గ‌ల‌,ఎక్కువ‌గా వాడే 178 ఔష‌ధాల కొనుగోలుకు బిపిపిఐ ఏప్రిల్ నెల‌లో కొనుగోలు ఉత్త‌ర్వులు జారీ చేసింది.



 


****



(Release ID: 1621167) Visitor Counter : 312