జౌళి మంత్రిత్వ శాఖ

ఎం.ఎస్‌.పి కార్య‌క‌లాపాల ద్వారా మ‌హారాష్ట్ర‌లో 34 కేంద్రాల‌లో ప‌త్తిసేక‌ర‌ణ కొన‌సాగుతోంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో మొత్తం 36,500 క్వింటాళ్ల క‌ప‌స్ ను అంటే 6900 బేళ్ళ‌తో స‌మాన‌మైన ప‌త్తిని సేక‌రించ‌డం జ‌రిగింది

మ‌హారాష్ట్ర‌లో ఉత్ప‌త్తి అయిన మొత్తం క‌ప‌స్ లో 77.40 శాతం క‌ప‌స్ ఇప్ప‌టికే మార్కెట్‌కు చేరుకుంది. ఇది 2020 మార్చి 25 నాటికి అమ్ముడు పోయింది. కాట‌న్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (సిసిఐ) 91.90 క్వింటాళ్ళ క‌ప‌స్ అంటే 18.66 ల‌క్ష‌ల బేళ్ళ‌తో స‌మాన‌మైన రూ 4995 కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల ప‌త్తిని సేక‌రించింది.

రైతుల‌నుంచి సేక‌రించిన క‌ప‌స్‌కు చెల్లించాల్సిన బ‌కాయిల‌ను చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. మొత్తం ప్రొక్యూర్‌మెంట్ విలువ‌లో రూ 4987 కోట్లు ఇప్ప‌టికే రైతుల‌కు చేరింది.

Posted On: 04 MAY 2020 12:59PM by PIB Hyderabad

 

మ‌హారాష్ట్ర‌లోని ఎపిఎంసిల‌లో క‌ప‌స్ ప‌త్తి అమ్మ‌కంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్టు కొన్ని మీడియా క‌థ‌నాలు వ‌చ్చాయి.

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తన ఏజెంట్ అయిన‌ మహారాష్ట్ర స్టేట్ కాటన్ గ్రోయర్స్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో కలిసి టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖ . మహారాష్ట్రలో భారత ప్రభుత్వ ఎంఎస్‌పి కార్యకలాపాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు రైతులకు భరోసా ఇస్తోంది.

  మహారాష్ట్రలో అక్టోబర్, 2019 నుండి ఎం.ఎస్‌.పి సేకరణ కొనసాగుతోంది. 2020 మార్చి 25 నాటికి, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఇప్పటికే మహారాష్ట్రలోని పత్తి రైతుల నుండి రూ .4995 కోట్ల విలువైన 18.66 లక్షల బేల్స్ పత్తికి సమానమైన 91.90 లక్షల క్వింటాల్ కపాస్‌ను 83 కేంద్రాలనుండి కొనుగోలు చేసింది. .
 
 మహారాష్ట్రలో 2020 మార్చి 25 వరకు ఉత్పత్తి చేయబడిన మొత్తం కపాస్‌లలో 77.40 శాతం మార్కెట్లలోకి వచ్చింది. దీనిఇన‌ సిసిఐ , ప్రైవేట్ వ్యాపారులకు అమ్మారు. లాక్‌డౌన్  సమయానికి 22.60శాతం పత్తి ఇంకా రావ‌ల‌సి ఉంది. ఈ మిగిలిన క‌పాస్‌లో, సుమారు 40 నుండి 50శాతం కపాస్ విలువ సుమారు రూ. 2100 కోట్లు ఉంటుందని అంచనా.  ఇది ఎఫ్‌.ఎ.క్యు గ్రేడ్ కావచ్చు .కోవిడ్ మ‌హమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు మెరుగైన ధరను ఇవ్వకపోవడం వల్ల సాగుదారులు ఎంఎస్‌పి రేట్లు పొందాలని కోరుకుంటూ ఉండ‌వ‌చ్చు.

ఎం.ఎస్‌.పి కార్యకలాపాలు ప్ర‌స్తుతం కొన‌సాగుతున్నాయి.   34 కేంద్రాలలో సిసిఐ ప్రొక్యూర్‌మెంట్  కొనసాగుతోంది . లాక్డౌన్ కాలంలో 6900 బేళ్లకు సమానమైన మొత్తం 36,500 క్వింటాళ్ల కపాస్ మహారాష్ట్రలో సేకరించారు.
ఈ సేకరణను రాష్ట్ర ఎపిఎంసిలు నియంత్రిస్తాయి . జిల్లా యంత్రాంగం గుర్తించిన 27 కేంద్రాలు రెడ్‌ జోన్ల పరిధిలోకి వస్తున్నాయి, ఇందులో 2020 మే 3 తర్వాత సేకరణ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
మిగిలిన 22 సెంటర్‌లలో, కపాస్‌ను తీసుకురావడానికి రైతులకు పాస్‌లు,, టోకెన్ల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సిసిఐ సంప్రదించింది , ఈ విషయాన్నిటెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ రైతుల రాక , ఎపిఎంసిలలో కపాస్ సేకరణపై రోజువారీ స్థితి నివేదికల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది,
ఎప్ప‌టిక‌ప్పుడు ఏర్ప‌డే స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సిసిఐ  త‌గిన స‌మ‌న్వ‌యంతో,  తరచూ సమావేశాలు నిర్వ‌హిస్తోంది..

.రైతులు ఆందోళ‌న‌తో అమ్మ‌కాల‌కు పాల్ప‌డ‌కుండా చూసేందుకు ఎపిఎంసిల‌లోకి రైతుల‌ను అనుమ‌తించేందుకు తగిన  ఏర్పాట్లు చేయాల్సిందిగా టెక్స్ టైల్ మంత్రిత్వ‌శాఖ మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి త‌గిన సూచ‌న‌లు చేసింది.

సేకరించిన కపాస్‌లకు రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించడానికి సిసిఐ చర్యలు చేపట్టింది. మొత్తం సేకరణ విలువ రూ .4995 కోట్లుకాగా, ఇప్పటికే రూ .4987 కోట్లు రైతులకు చెల్లించారు.
 


 

***



(Release ID: 1620884) Visitor Counter : 229