హోం మంత్రిత్వ శాఖ

సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డుకు నామినేషన్ల ఆహ్వానం చివరి తేదీ జూన్ 30, 2020 వరకు పొడిగింపు

Posted On: 04 MAY 2020 10:00AM by PIB Hyderabad

భారతదేశం ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించేందుకు కృషి చేసిన వారి నిమిత్తం కేంద్ర ప్ర‌భుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట అత్యున్నత పౌర పురస్కారం సర్దార్ ప‌టేల్‌ నేషనల్ యూనిటీ అవార్డును ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రంగంలో ముఖ్యమైన ఉత్తేజకరమైన సహకారాన్ని అందించ‌డం లేదా ‌ఐక్య భారతదేశం యొక్క విలువను బలోపేతం చేసిన వ్యక్తులు లేదా ఇన్‌స్టిట్యూష‌న్‌లు లేదా సంస్థలు చేసిన కృషికి బ‌ల‌మైన ప్రోత్సాహ‌క‌రంగా ఉండేలా త‌గిన గుర్తింపుగా ఈ అవార్డును అంద‌జేస్తారు. సర్దార్ ప‌టేల్‌ నేషనల్ యూనిటీ అవార్డుకు గాను నామినేష‌న్లు, సిఫార‌సుల‌ను ఆహ్వానిస్తూ 20 సెప్టెంబర్ 2019 న ప్ర‌భుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అవార్డుకు సంబంధించిన‌ వివరాలు www.nationalunityawards .mha.gov.in అనే వెబ్ సైట్‌లో లభిస్తాయి. ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో నామినేషన్ల ఆహ్వానాన్ని జూన్ 30, 2020 వరకు పొడిగించాలని తాజాగా నిర్ణయించారు.

 



(Release ID: 1620878) Visitor Counter : 166