రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

“కరోనా యోధులకు సాయుధ దళాల గౌరవ వందనం” పట్ల ప్రశంసలు కురిపించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్

Posted On: 03 MAY 2020 7:33PM by PIB Hyderabad

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అహరహం పోరాటం చేస్తున్న కరోనా యోధులకు త్రివిధ దళాలు గౌరవ వందనం సమర్పించడంలో భాగంగా భూతలం, జల మార్గం, వాయు మార్గాల్లో చేపట్టిన కార్యకలాపాల పట్ల సాయుధ దళాలను కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.

మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలపడానికి సాయుధ దళాలు అనేక కార్యకలాపాలను నిర్వహించాయన్న రక్షణ మంత్రి, కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటంలో పాల్గొన్న వారందరి మనోధైర్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ముందువరుస యోధులు ప్రశంసనీయమైన కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారని తెలిపారు.

ఆస్పత్రులపై ఐ.ఎ.ఎఫ్, నేవీ మరియ కోస్ట్ గార్డ్ లు హెలికాఫ్టర్ల ద్వారా ఫ్లై పాస్ట్ మరియు పూల రేకులను వెదజల్లడం గురించి ప్రస్తావిస్తూ, కోవిడ్ -19 వల్ల ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించే క్రమంలో  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయతకత్వంలోని దేశ సంకల్పానికి మరియు ఐక్యతకు వారు వందనం చేశారని తెలిపారు.

వైద్య నిపుణులు, పోలీసులు మరియు ఇతర ముందు వరుస యోధుల పట్ల కృతజ్ఞతలు తెలిపేందుకు అనేక ప్రదర్శనల ద్వారా సాయుధ దళాలు చేసిన ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీ రాజ్ నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సవాళ్ళలో దేశం మొత్తం ఐక్యంగా నిలిచిందని తెలిపారు.

వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, మీడియా మరియు అవసరమైన సేవలు మరియు సామగ్రి నిర్వహణలో నిమగ్నమైన అనేక మంది కరోనా యోధులు కోవిడ్ -19 వ్యాప్తిని నివారించే క్రమంలో జాతీయ ప్రయత్నాలకు స్థిరంగా సహకారం అందించారు. వీరంతా ప్రతిరోజు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. విద్యుత్తు మరియు నీరు వంటి ప్రాథమిక సదుపాయాలను అందరికీ అందజేయడం, వీధులను శుభ్రంగా ఉంచడం, ప్రాథమిక ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచడం లాంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ కోవిడ్ రోగి చికిత్స అందుకోకుండా వెళ్ళలేదు. లా అండ్ ఆర్డర్ చక్కగా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సైతం ఇక్కడకు తీసుకువచ్చి, వారి సంరక్షణను చూసుకున్నారు.

ఇలాంటి ఉన్నతమైన కరోనా యోధులకు సాయుధ దళాలు ఈ రోజు ప్రత్యేకమైన సైనిక మార్గంలో నివాళులు అర్పించారు. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం మరియు డిబ్రూగర్ నుంచి కచ్చ్ వరక, పోలీసు స్మారక స్థూపాల వద్ద దండలు వేయడం, వైద్యులు మరియు అత్యవసర సరఫరా కార్యకర్తలను గౌరవించడం, సత్కరించడం వంటి వివిధ కార్యకలాపాలను సైన్యం నిర్వహించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వైద్య శాలలను సాయుధ దళాల బృందాలు సందర్శించి, వారి సేవలకు గుర్తుగా మిలటరీ బ్యాండ్ తో దేశభక్తి గీతాల ఆలాపన ద్వారా గౌరవించాయి.

ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, భోపాల్, ఆగ్రా, అమృత్ సర్, బెల్గాం, రాణీఖేత్ ఫిథోరాఘర్ సహా అనే మహా నగరాలు, పెద్ద మరియు చిన్న టౌన్ షిప్ లలో ఆర్మీ, నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐ.ఎ.ఎఫ్) మరియు కోస్ట్ గార్డ్ (ఐ.సి.జి) ఆసుపత్రులను సందర్శించి వందనాలు అర్పించాయి. స్థానిక పోలీసు స్మారక చిహ్నాలకు దండలు వేయడం ద్వారా కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. ఇది నిజంగా అపూర్వమైనది. దీని పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రజలు సాయుధ దళాలకు శుభాకాంక్షలతో పాటు వారి అభిమానాన్ని తెలియజేశారు.

భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్) యొక్క ఫైటర్ మరియు రవాణా విమానాల ద్వారా ఫ్లై పాస్ట్ వంటి కార్యక్రమాలను సాయుధ దళాలను దేశం అంతటా నిర్వహించాయి. ఐ.ఎ.ఎఫ్. ఇండియన్ నేవీ మరియు కోస్ట్ గార్డ్ (ఐ.సి.డి) హెలికాఫ్టర్లు కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఆస్పత్రుల మీద పూల వర్షం కురిపించాయి. ఆర్మీ మరియు ఐ.ఎ.ఎఫ్. బృందాలు కోవిడ్ ఆస్పత్రులను సందర్శించి, కరోనా యోధులకు కృతజ్ఞతలు తెలుపుతూ దేశభక్తి గీతాల్ని, సంగీతాన్ని ఆలపించాయి.

సుఖోయ్ -30 ఎం.కె.ఐ, మిగ్ -29 మరియు జాగ్వార్ లతో కూడిన యుద్ధ విమానాలు రాజ్ పథ్ మీదుగా తిరిగాయి. పైకప్పు భాగాల నుంచి ప్రజలకు కనిపించేలా ఢిల్లీ మీదుగా తిరిగాయి. అదనంగా సి 130 జె హెర్క్యులస్ రవాణా విమానం కూడా ఎన్.సి.ఆర్. ప్రాంతంపై ప్రయాణించింది.

నేవీ మరియు ఐ.సి.జి. నౌకలు ఎంచుకున్న ప్రదేశాల్లో తీరాల దగ్గర కార్యక్రమాలు నిర్వించాయి. రమోట్ సైట్లు మరియు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ మరియు మినికోయ్ ద్వీపాల సుదూర ప్రాంతాలు మరియు దేశంలోని మొత్తం తీర ప్రాంతాల కలిపే 25 ప్రదేశాల్లో ఈ రాత్రి దీపాలతో ఓడలు గౌరవాన్ని తెలియజేస్తాయి. 

 

--



(Release ID: 1620765) Visitor Counter : 235