ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్ డేట్స్
Posted On:
03 MAY 2020 4:19PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్రతకు అనుగుణంగా , ముందస్తు చర్యలు, సానుకూల వైఖరి ద్వారా రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలతో కలసి సమిష్టి కృషితో వైరస్ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ , ఈరోజు లేడీ హార్దింగ్ మెడికల్ కాలేజీని సందర్శించి కోవిడ్ -19 నిర్వహహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డైరక్టర్ కార్యాలయాన్ని, ఎమర్జెన్సీ, ఒపిడి, నమూనాల సేకరణ కేంద్రాన్నిసందర్శించారు. అలాగే కోవిడ్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్‌ఫ్లోర్, రెడ్ జోన్ ఏరియా, డాక్టర్లు, హెల్త్ వర్కర్లు డ్యూటీలు మారే సదుపాయాన్ని సందర్శించారు
కోవిడ్ -19 ప్రత్యేక భవననంలో గల ఆంకాలజీ బిల్డింగ్‌లో వైద్యులు, వైద్యసిబ్బంది ప్రత్యేక స్నానాలకు, క్రిమిసంహారకాలతో తమను తాము శుభ్రపరచుకునే సదుపాయం,వంటివి వీరికి తగిన రీతిలో ఉండడంపట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాపై పోరాడుతున్న సిబ్బందితో ఆస్పత్రి యాజమాన్యం రోజుకు రెండు సార్లు మాట్లాడేందుకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
లాక్‌డౌన్ 3.0 ను (మే 17 వరకు పాటించాల్సిందిగా) తు.చ తప్పకుండా పాటించాల్సిందిగా డాక్టర్ హర్ష వర్ధన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ -19 వ్యాప్తి నిరోధానకి, వైరస్ వ్యాప్తి గొలుసును తెంచడానికి ఇది మేలైన చర్య అని ఆయన అన్నారు. కోవిడ్ -19 పేషెంట్లకు చికిత్స అందిస్తున్న వైద్యులను వేరుగా చూడవద్దని విజ్ఞప్తి చేశారు.అలాగే వ్యాధికి గురైన పేషెంట్ల పట్ల వివక్ష కూడదని , వీరు కోవిడ్ -19 పై పోరాటంలో విజయం సాధించిన వారని అన్నారు.
.
ఇప్పటివరకూ దేశంలో 10,632 మందికి వ్యాధి నయం అయింది. గత 24 గంటలలో 682 మంది పేషెంట్లకు వ్యాధి నయమైనట్టు గుర్తించారు. దీనితో దేశంలో వ్యాధి రికవరీ రేటు 26.59 కి చేరుకుంది. మొత్తం నిర్ధారణ అయిన కోవిడ్ కేసులు 39,980 కి చేరాయి. నిన్నటి నుంచి 2644 కోవిడ్ నిర్ధారణ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/.
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in .కు పంపవచ్చు.
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
*****
(Release ID: 1620671)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam