మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
9, 10 తరగతులవిద్యార్థుల బోధనకోసం ప్రత్నామ్నాయ కాలెండర్ ను (అకాడమిక్ కాలెండర్) విడుదల చేసి కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి
11, 12 తరగతుల బోధనకోసం త్వరలోనే ప్రత్యామ్నాయ కాలెండర్ ను త్వరలోనే విడుదల చేస్తాం : కేంద్ర మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Posted On:
02 MAY 2020 6:39PM by PIB Hyderabad
ఈ విద్యా సంవత్సరంలో 9, 10 తరగతుల బోధనకోసం ప్రత్యామ్నాయ కాలెండర్ ( అకాడమిక్ కాలెండర్)ను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ విడుదల చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కాలెండర్‌ను విడుదల చేశారు. పలు సాంకేతిక పరికరాలను, సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకొని విద్యార్థులకు బోధన చేసే విధానంపైన ఈ ప్రత్యామ్నాయ కాలెండర్లో మార్గదర్శకాలున్నాయని కేంద్ర మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ వివరించారు. విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా వారు ఇంటి దగ్గరనుంచే పాఠ్య ప్రణాళికను పూర్తి చేసేలా వీటిని రూపొందించామని ఆయన అన్నారు. విద్యార్థులకు అందుబాటులో వుండే పరికరాలైన మొబైల్స్, రేడియో, టెలివిజన్, ఎస్ ఎం ఎస్..ఇంకా ఇతర సోషల్ మీడియా ను పరిగణలోకి తీసుకొని ఈ ప్రత్యామ్నాయ బోధనను రూపొందించారు.
చాలా మంది మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ సౌకర్యం ఉండకపోవచ్చు. లేదా వారు సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ లాంటివి ఉపయోగంచకలేకపోవచ్చు. ఇలాంటివారందరికీ ఉపాధ్యాయులు ఎస్ ఎంస్ ద్వారా, వాయిస్ కాల్ ద్వారా అవగాహన కల్పించడానికి వీలుగా ఈ మార్గదర్శకాలను తయారు చేశారు. ప్రాధమిక స్థాయి విద్యార్థుల విషయంలో వారి తల్లిదండ్రులు సాయం చేయాల్సి వుంటుంది.
దివ్యాంగులైన విద్యార్థులకు కూడా ఉపయోగపడేలా కాలెండర్ తయారు చేశామని ఆడియో పుస్తకాలు, రేడియో ప్రోగ్రాములు, వీడియో ప్రోగ్రాములకు సంబంధించిన లింకులను అందిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.
కోవిడ్ -19 కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల ఎన్ సి ఇఆర్ టి స్వయం ప్రభ (కిషోర్ మంచ్) టీవీ ఛానెల్ ద్వారా ఎన్ సి ఇఆర్ టి పాఠాలు ప్రసారం చేస్తోంది.
ఆన్ లైన్ ద్వారా బోధనకు సంబంధించిన వనరులపై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రిన్సిపాళ్లకు, తల్లిదండ్రులకు తగిన అవగాహన కల్పించడానికి ఈ కాలెండర్ ఉపయోగపడుతుంది. తద్వారా విద్యార్థుల్లో తమ పాఠాల మీద అవగాహన పెరుగుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన వివిధ స్థాయిల విద్యార్థులకోసం ప్రత్నామ్నాయ కాలెండర్లను ఎన్ సి ఇ ఆర్ టి తయారు చేసింది. 1వ తరగతినుంచి 8 వ తరగతివరకూ విద్యార్థులకోసం ఏప్రిల్ 1నే కాలెండర్ విడుదల చేయడం జరిగగింది.
*****
(Release ID: 1620523)
Visitor Counter : 211
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam