రైల్వే మంత్రిత్వ శాఖ
సరుకు రవాణా కార్యకలాపాలలో మార్పులు తెచ్చేందుకు లాజిస్టిక్స్ పరిశ్రమ అధిపతులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన రైల్వే మంత్రి శ్రీపియూష్ గోయల్ పరిష్కారాలు వినూత్నంగా, లాభదాయకంగా , లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించే విధంగా ఉండాలి: పియూష్ గోయల్
Posted On:
01 MAY 2020 5:20PM by PIB Hyderabad
భారతీయ రైల్వేలలో సరుకు రవాణా కార్యకలాపాలలో మార్పులు తెచ్చేందుకు సాధ్యమయ్యే మార్గాలను అన్వేషించేందుకు కేంద్ర రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్ ఈ రోజు లాజిస్టిక్స్ పరిశ్రమలోని ముఖ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సుమారు మూడు గంటల పాటు సాగింది. ఈ సందర్భంగా పలు సూచనలు వచ్చాయి. సరకురవానా కార్యకలాపాలను మరింత సమర్ధంగా, లాభదాయకంగా నిర్వహించేందుకు సాధ్యమయ్యే విధానపరమైన అంశాల గురించి సూచనలు వచ్చాయి.
కోవిడ్ సంక్షోభ సమయంలో రైల్వే పోషిస్తున్న ముఖ్య పాత్రను ప్రధానంగా ప్రస్తావించిన మంత్రి, కోవిడ్ సంక్షోభాన్ని రైల్వే ప్రజల పట్ల ఎంతో బాధ్యతతో , సానుభూతితో చూస్తున్నదని అన్నారు, లాక్‌డౌన్ సమయంలో, దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువులను తీసుకెళ్లడం ద్వారా రైల్వే దేశానికి జీవనాధారంగా నిలిచిందని ఆయన అన్నారు. "ప్రధాన మార్గాలకు కనెక్టివిటీని పెంచడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నిర్వహణ పనులు చేపట్టడం,దెబ్బతిన్న వంతెనలను కూల్చివేయడం , మరమ్మతులు చేయడం ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి దీర్ఘకాల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాం" అని శ్రీ గోయల్ చెప్పారు..
అదే సమయంలో, సరుకు రవాణా , లాజిస్టిక్ వ్యాపారం అందించిన అద్భుతమైన అవకాశాన్ని కూడా తాము గుర్తించామని, సమీప భవిష్యత్తులో తమ సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్టు కూడా రైల్వే మంత్రి స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో రైల్వే బోర్డుఛైర్మన్, ఇతర ముఖ్య అధికారులు లాజిస్టిక్స్ పరిశ్రమ ముఖ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అనేక నిర్మాణాత్మక సూచనలు వచ్చాయి., ఇందులో నిర్ణీత వ్యవధిలో సరకుల డెలివరీకి హామీ ఇచ్చే నమూనాకు మారడం, భాగస్వాములకు కొంత భీమా సదుపాయం కల్పించడం, సరుకు రవాణా రేట్లు హేతుబద్ధీకరించడం , లాజిస్టిక్ ఖర్చులను మరింత సహేతుకస్థాయికి తీసుకురావడం, టెర్మినల్స్ , పోర్టులలో దశలవారీగా లోడ్ , అన్‌లోడ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటివి ఉన్నాయి.
పరిశ్రమ వర్గాల నుండి వచ్చిన సలహాలను స్వాగతిస్తూ రైల్వే మంత్రి, వినూత్న ఆవిష్కరణలు కీలకమని, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడానికి పరిష్కారాలు లాభదాయకంగా ఉండాలని అన్నారు.
"సరుకు రవాణా కార్యకలాపాలలో మార్పులు తీసుకురావడంలో సహాయపడటానికి, రైల్వేల సరకు రవాణాట్రాఫిక్‌ను రెట్టింపు చేసి 2.5 బిలియన్ టన్నుల స్థాయికి తీసుకువెళ్లడానికి, వేగవంతమైననాన్‌స్టాప్ రైళ్లు, మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థలు, నిర్ణీత వ్యవధిలో నడిచే టైమ్ టేబుల్ కార్గో రైళ్లు, మెరుగైన ఫైనాన్సింగ్ ప్రత్యామ్నాయాలు అవసరం" అని శ్రీ గోయల్అన్నారు.
***
(Release ID: 1620163)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam