ప్రధాన మంత్రి కార్యాలయం
విద్యుత్తు రంగాన్ని సమీక్షించడం కోసం ఒక సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి
Posted On:
01 MAY 2020 5:52PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న విద్యుత్తు రంగం పై ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, కోవిడ్-19 యొక్క ప్రభావాన్ని సమీక్షించారు. ఈ రంగం యొక్క సామర్ధ్యాన్ని, పునరుద్ధరణ శక్తి ని మరియు సంపోషణీయత ను వృద్ధి చేసేందుకు అమలు పరచవలసిన వివిధ దీర్ఘకాలిక సంస్కరణల ను కూడా సమావేశం లో ఆయన చర్చించారు.
వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం; రిన్యూవబుల్స్ గురించి ప్రచారం చేయడం; బొగ్గు సరఫరా లో సారళ్యత; ప్రభుత్వ- ప్రయివేటు భాగస్వామ్యాల పాత్ర మరియు విద్యుత్తు రంగం లో పెట్టుబడి కి ప్రోత్సాహాన్ని అందించడం వంటి చర్య లు చర్చల లో చోటు చేసుకొన్నాయి.
ఆర్థిక వ్యవస్థ ను ముందుకు నడిపించడం లో విద్యుత్తు రంగాని కి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి పలికారు. ప్రయివేటు పెట్టుబడుల ను ఆకర్షించడం లో ఒప్పందాల ను కట్టుదిట్టం గా ఆచరణ లోకి తీసుకురావలసిన ఆవశ్యకత చర్చ కు వచ్చింది.
వినియోగదారు కేంద్రిత విధానాల ను అవలంబించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలని, అలాగే ప్రతి వారం లోనూ ప్రతి రోజూ కూడా 24 గంటల పాటు నాణ్యమైనటువంటి మరియు విశ్వాస యోగ్యమైనటువంటి విద్యుత్తు ను వినియోగదారులందరి కి సరఫరా చేసే లక్ష్యాన్ని సాధించే దిశ గా శ్రమించాలని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్తు పంపిణీ కంపెనీ ల లాభదాయకత ను బాగు పరచుకోవడం, ధర ల సక్రమ వ్యవస్థీకరణ, సబ్సిడీల ను సకాలం లో విడుదల చేయడం తో పాటు మెరుగైన పరిపాలన కు చర్యల ను తీసుకోవాలన్న అంశాల ను కూడా సమావేశం లో చర్చించడమైంది.
హోం మంత్రి, ఆర్ధిక మంత్రి, విద్యుత్తు, నైపుణ్యం మరియు నూతన, ఇంకా నవీకరణ యోగ్య శక్తి శాఖ సహాయ మంత్రి, ఆర్ధిక శాఖ సహాయ మంత్రి ల తో పాటు భారత ప్రభుత్వం లోని ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశాని కి హాజరయ్యారు.
***
(Release ID: 1620160)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam