నీతి ఆయోగ్
సామాజిక దూరం పాటించడమే ఇప్పుడు అందుబాటులో ఉన్న అత్యంత శక్తిమంతమైన వాక్సిన్ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్
Posted On:
30 APR 2020 5:07PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ ఈరోజు కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ప్రభుత్వేతర సంస్థలు, పౌరసమాజ సంస్థలతో ఒక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌కు నీతి ఆయోగ్ సి.ఇ.ఒ అమితాబ్ కాంత్ మోడరేటర్‌గా వ్యవహరించారు.
నీతి ఆయోగ్ వారి దర్పణ్ పోర్టల్ లో నమోదైన ఎన్జిఓలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.వీటిలో ప్రముఖమైనవి,: బిల్ , మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి హరిమీనన్; హెల్ప్ ఏజ్ ఇండియా నుంచి మాథ్యూ చెరియన్ ; టాటా ట్రస్టుల నుంచి హెచ్.ఎస్.డి శ్రీనివాస్ ; పిరమల్ స్వస్త్యనుంచి అశ్విన్ దేశ్‌ముఖ్, సివైఎస్‌డి నుంచి జగదానంద ; ప్రయాస్నుంచి అమోద్ కాంత్; రెడ్ క్రాస్ నుంచి యాహియా అలీబి ప్రాతినిధ్యం వహించారు . అలాగే సేవా నుంచి చాయా బావసర్, మన్ దేశీ ఫౌండేషన్ నుంచి ప్రభాత్ సిన్హా; సులభ్ ఇంటర్నేషనల్ నుంచి లలిత్ కుమార్ ; లాల్ పాత్ ల్యాబ్స్ నుంచి, అరవింద్ లాల్ ; పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియానుంచి కె. శ్రీనాథ్ రెడ్డి ; కేర్ ఇండియా నుంచి మనోజ్ గోపాలకృష్ణన్; వర్కింగ్ ఉమెన్స్ ఫోరం నుంచి, నందిని ఆజాద్ ; అక్షయపాత్రనుంచి విజయ్ శర్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్.జి.ఒలు , సిఎస్ఒలు పలు అంశాలను ప్రస్తావించారు.కోవిడ్ -19 రోగుల పట్ల , కోవిడ్ నియంత్రణలో ముందుండి పనిచేస్తున్న కార్యకర్తల పట్ల వివక్ష,చిన్నచూపును ఎదుర్కోవడం, గ్రామీణ ప్రాంతాలలో మందుల కొరతను నివారించడం, ఈ పాస్ లకు సహాయం, మరిన్ని పిపిఇలు ఎన్ 95 మాస్క్‌ల సరఫరా, ప్రస్తుత సంక్షో భ సమయంలో గణాంకాలకు అనుగుణంగా స్పందన ఉండేట్టు చూడడం, వలసవచ్చిన వారికి వారికి అందవలసిన ప్రయోజనాలు అందేట్టు చూడడం , డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడం, లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం అసంఘటిత రంగంలోని ఎంటర్ ప్రెన్యూయర్లకు ఆర్థిక , విధానపరమైన మద్దతు కల్పించడం, దేశంలోని మారుమూల ప్రాంతాలకు నిత్యావసరాలు పంపడం, హరిత జోన్లలో ఆదాయ వనరులు కల్పించే కార్యక్రమాలను ప్రారంభించే ప్రతిపాదనలు , గ్రామీన ప్రాంతాలలో వర్చువల్ కేర్ ఇన్ ను ప్రోత్సహించడం, ఆర్.టి.-పిసిఆర్ టె్స్ట్‌ల పూలింగ్, వైద్య సిబ్బంది సామర్ధ్యాల నిర్మాణం, క్వారంటైన్ స్థాయిపెంపు, పెద్ద ఎత్తున ఈ కేర్ సదుపాయాలు, మరింత వికేంద్రీకృత క్యమూనిటీ నిఘా యంత్రాంగం ,కమ్యూనిటీ పౌష్టికాహార కేంద్రాల ఏర్పాటు, ఇలా పలు అంశాలను వారు ప్రస్తావించారు.
కోవిడ్ -19 పై పోరాటంలో ఎన్జీఓలు , సిఎస్ఓలు చేసిన అద్భుతమైన, నిస్వార్థమైన కృషిని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ప్రశంసించారు. లాక్ డౌన్ కొనసాగిన దశలో వారి సహాయాన్ని మంత్రి కోరారు. . భారతీయ పౌరుల శ్రేయస్సు కోసం వారు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
చైనాలో కరోనావైరస్ వ్యాప్తి గురించి తెలుసుకున్న కొద్ది రోజుల్లోనే భారత్ వెంటనే చురుకైన చర్యలు తీసుకుందని డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రాలకు సలహాలు,సూచనలు జారీ చేసిందని, కఠినమైన రీతిలో సమాజ ఆరోగ్య పర్యవేక్షణను చేపట్టిందని చెప్పారు. అలాగే విమానాశ్రయాలలో, సరిహద్దులలో ఓడరేవులలో వెంటనే థర్మల్ స్క్రీనింగ్ ప్రారంభించినట్టు చెప్పారు.
కోవిడ్-పాజిటివ్ రోగులు , కోవిడ్ -19 పై పోరాటంలో ముందున్న కార్మికులను చిన్నచూపు చూసే అనుచిత ధోరణిపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. కోవిడ్ -19 మహమ్మారి వంటి ఆరోగ్య సంక్షోభాల సమయంలో హింసకు వ్యతిరేకంగా ఆరోగ్య సంరక్షణ కార్మికులను రక్షించడానికి ప్రభుత్వం ఇటీవల అంటువ్యాధుల చట్టాన్ని సవరించింది. అయితే, ప్రతిదీ చట్టం సహాయంతో పరిష్కారం కాదు కనుక ఈ బెడదను ఎదుర్కోవడానికి ఎన్జిఓలు సిఎస్ఓల తోడ్పడాలని ఆయన కోరారు.
వలస కార్మికులు సజావుగా వారి వారి గ్రామాలు , స్వంత పట్టణాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలిసిపోయే విధంగా సహాయపడాలని ఆయన కోరారు. వారు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కొంత ప్రతిఘటన ఉండవచ్చునని ఇలాంటి సమయంలో ఎన్జీఓలు అడుగు పెట్టి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు..‘ ఇలాంటి వారు తమను పునర్ వ్యవస్తీకరించుకోవడానికి తగిన రీతిలో పరీక్షలు నిర్వహించాలని, సరైన సూచనలు అందించాలని సమాజం నుంచి సహాయం కోరుకుంటారు’ అని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన కోవిడ్ -19 కు సంబంధించి జిల్లాల వర్గీకరణ గురించి తెలిపారు. 129 జిల్లాలను హాట్ స్పాట్‌లుగా గుర్తించారని, 297 జిల్లాలను హాట్ స్పాట్ లేని జిల్లాలుగా గుర్తించారన్నారు. 300 కుపైగా జిల్లాలు ఏమాత్రం కరోనా బారిన పడ లేదన్నారు.‘ మనకు మూడు కేటగిరీలున్నాయి. అవి రెడ్ , ఆరంజ్,గ్రీన్ కేటగిరీలు. రెడ్ జోన్‌లో 14 రోజుల పాటు ఒక్క పాజిటివ్ కేసుకూడా లేకుండా ఉంటే వాటిని ఆరంజ్ జోన్లుగా మారేందుకు సహాయం చేస్తున్నాం. అలాగే ఆరంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు కృషి చేస్తున్నాం. మన దేశంలో శత్రువు ఖచ్చితంగా ఎక్కడ ఉందో మనకు తెలుసు, ఆశత్రువుతో ఎలా వ్యవహరించాలో కూడా మనకు తెలుసు. మన సర్వశక్తులూ ఉపయోగించి దానిని ఓడిస్తాం’ అని ఆయన అన్నారు.
పిపిఇలు , మాస్క్‌లపై, మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్, ‘దేశంలో 108 తయారీదారులకు అవకాశం ఇచ్చాం. , వీరు ఇప్పుడు ప్రతిరోజూ 1.5 ఎల్ పిపిఇలను ఉత్పత్తి చేస్తున్నారు. N95 మాస్క్‌లు ఇప్పుడు ప్రతిరోజూ లక్షకు పైగా ఉత్పత్తి అవుతున్నాయి. ఈ అత్యావశ్యక వస్తువుల సరఫరా తగినంతగా ఉంది మేము వాటిని రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్నాము. ’ ఆని ఆయన చెప్పారు.
ప్రజల రోగ నిరోధక శక్తిని పెంచే సహజ పద్ధతులకు సంబంధించి ఆయుష్ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసినట్టు కూడా ఆయన తెలిపారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, మంత్రి సూచించారు. కోవిడ్ -19 పై పోరాటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ యాప్ మనకు అవసరమైన రక్షణనిస్తుందన్నారు. ప్రభుత్వం ట్విట్టర్ ఇండియా కొలాబరేషన్‌తొ @CovidIndiaSeva ను ప్రారంభించింది. పౌరులు ఏదైనా ప్రత్యేక సమస్య లేదా పరిష్కారం గురించి ప్రభుత్వానికి తెలియజేయ దలిస్తే దీని ద్వారా తెలపవచ్చన్నారు. ఆ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని నేను హామీ ఇస్తున్నాను’ అని ఆయన అన్నారు.
చివరగా, డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ , ‘ క్రమం తప్పకుండా చేతులు కడుగుకోవడం, అన్ని వేళలా మాస్క్ ధరించడం మిమ్మల్ని, మిమ్మల్ని ప్రేమించే వారిని ఈ ఇన్‌ఫెక్షన్ సోకకుండా రక్షిస్తుంది.ఇవి సులభమైన ముందస్తు జాగ్రత్తలు. ఇంట్లోని పెద్దలను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వారికి ముప్పు ఎక్కువ. ఇళ్లలోనే ఉండండి, ఇంటినుంచే పనిచేయండి. దీనికి వాక్సిన్ కనుగొనేదాకా జాతీయ స్థాయిలో లాక్‌డౌన్, సామాజిక దూరం పాటించడం అనేవి మనకున్న అత్యంత శక్తిమంతమైన సామాజిక వాక్సిన్లు’ అని ఆయన అన్నారు.
(Release ID: 1619729)
Visitor Counter : 195