హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నందువల్ల వివిధ చోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలు, ఇతరుల అంతర్ రాష్ట్ర కదలికలకు కేంద్రం అనుమతి ఇచ్చింది

Posted On: 29 APR 2020 6:25PM by PIB Hyderabad

కోవిడ్ -19 మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనల అమలు కారణంగా  వలస కూలీలు,  యాత్రికులు,  పర్యాటకులు, విద్యార్థులు మరియు ఇతరులు  ఎక్కడి వారక్కడ నిలిచిపోయారు.  ఆ విధంగా నిలిచిపోయిన వారు రహదారి మార్గంలో  బయలుదేరి వెళ్ళడానికి కేంద్రం ఇప్పుడు అనుమతి ఇచ్చింది.  ఆయా రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాలు  సంప్రదింపులు జరుపుకొని పరస్పర అంగీకారానికి వచ్చిన తరువాత వారు వెళ్ళడానికి అనుమతి ఇస్తారు.  

ఆ విధంగా ఇతర రాష్ట్రం నుంచి  తమ గమ్యానికి చేరుకున్న వారికి  స్థానిక ఆరోగ్య అధికారులు పరీక్షలు నిర్వహించి,  అవసరమైతే సంస్థాగత  క్వారెంటైన్ కు పంపడం లేదా హోం  క్వారెంటైన్ కు అనుమతించడం జరుగుతుంది.  వారికి కాలక్రమము ప్రకారం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.    

ఇందుకోసం ఆరోగ్య సేతు యాప్ వాడవలసిందిగా వారిని ప్రోత్సహించాలని రాష్ట్రాలు /  కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు.  దాని ద్వారా వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడం, జాడతీయడం  వీలవుతుంది.  

రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం పంపిన అధికారిక సందేశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



(Release ID: 1619424) Visitor Counter : 234