ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్స్

Posted On: 29 APR 2020 6:25PM by PIB Hyderabad

భార‌త ప్ర‌భుత్వం, కోవిడ్ -19 సంక్షోభ తీవ్ర‌త‌కు అనుగుణంగా , ముంద‌స్తు చ‌ర్య‌లు, సానుకూల వైఖ‌రి ద్వారా రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాలతో క‌ల‌సి సమిష్టి కృషితో వైర‌స్‌ నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్షిస్తున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు న్యూడిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ (విసి) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సభ్యులతో మాట్లాడారు.. లయన్స్ క్లబ్ సభ్యులు రూ. 9.1 కోట్ల రూపాయ‌లు  పిఎం కేర్స్ ఫండ్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ‌నిధికి   12.5 కోట్లు ఇచ్చినందుకు ఆయ‌న వారికి  కృత‌జ్ఙ‌త‌లు తెలిపారు.
లక్షలాది మందికి భోజనం అందించ‌డంలో,  ముఖ్య‌మైన వైద్య పరికరాలు,  రక్షణ సామగ్రి ని అందించ‌డంలో  ల‌య‌న్స్‌క్ల‌బ్‌  సహకారాన్ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌తో పాటు ఈ రంగంలో కృషిచేస్తున్న వారితో  క‌లిసి  భారతదేశం  కోవిడ్ -19 ను ఎదుర్కోవడంలో విజయవంతం కాగ‌ల‌ద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి  అన్నారు.

  కోవిడ్ -19 ను ఎదుర్కోవ‌డానికి  సంబంధించి వివిధ అంశాలు, ఆరోగ్య మౌలిక‌స‌దుపాయాల‌పై చ‌ర్చించ‌డానికి రాష్ట్రాలు, జిల్లాల ప్ర‌తినిధుల‌తో నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌కు  కేంద్ర ఆరోగ్య‌,కు‌టుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ‌మ‌తి ప్రీతి సుడాన్  అధ్య‌క్ష‌త వ‌హించారు.
 
ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో జి.ఐ.ఎస్ డాష్ బోర్డు ప‌నితీరు.కోవిడ్ -19 పోర్ట‌ల్‌, ప్ర‌త్యేక ఆర్‌టి-పిసిఆర్ రెఫ‌రల్ యాప్ ల గురించి చ‌ర్చించారు.
కోవిడ్ -19 నియంత్ర‌ణకు సంబంధించి ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌కు స‌హాయ‌కారిగా ఉండే సెల్ఫ్ అసెస్‌మెంట్ సాధ‌న‌మైన ఆరోగ్య‌సేతు యాప్‌ను ప్ర‌జ‌లు వాడే విధంగా  దీనికి ప్ర‌చారం క‌ల్పించాల్సిందిగా ఆమె రాష్ట్రాల‌ను కోరారు.

  కోవిడ్ తో సంబంధంలేని అత్యావ‌శ్య‌క వైద్య‌సంర‌క్ష‌ణ‌ను ఏమాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌రాద‌ని ఆమె సూచించారు. డ‌యాల‌సిస్‌, కాన్స‌ర్ చికిత్స‌, డ‌యాబిటిస్‌, గ‌ర్భిణులకు వైద్య‌సేవ‌లు, గుండె సంబంధిత  అనారోగ్యం ఉన్న‌వారి ప‌ట్ల త‌గిన జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరారు. ఇలాంటి సేవ‌లు ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌లో అందుబాటులో ఉండే విధంగా , అవి ప‌నిచేసేవిధంగా , వాటిపై ఏమాత్రం ప్ర‌భావం ప‌డ‌కుండా చూడాల‌ని కోరారు.

కోవిడ్ -19 కేసుల నిర్వహణపై   డి.హెచ్.ఆర్ కార్య‌ద‌ర్శి, అలాగే డిజి ఐసిఎంఆర్ డాక్టర్ బలరామ్ భార్గవ మాట్లాడుతూ,నమూనాల సేకరణ ,దానితో పాటుగా ఉన్న ఫారమ్‌లను నింపడంలో క‌చ్చిత‌త్వ‌పు  ప్రాముఖ్యతనుఆయ‌న  నొక్కి చెప్పారు. ఆర్‌.టి-పిసిఆర్ యాప్ ను అందుబాటులోకి తేవ‌డం జ‌రిగింద‌ని, దానిని వెంటనే ఉపయోగించాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలను ఆయ‌న‌ కోరారు.

ఇప్ప‌టివ‌ర‌కూ కోవిడ్ -19 నుండ‌డ‌డి 7695 మంది కోలుకున్నారు.దీనితో వ్యాధిన‌య‌మైన వారి రేటు 24.5 శాతానికి చేరింతి. దేశ‌వ్యాప్తంగా కోవిడ్ నిర్దారిత కేసుల సంఖ్య 31,332 కు చేరింది.

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు పంప‌వచ్చు.

కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .


 

*****



(Release ID: 1619387) Visitor Counter : 168