రైల్వే మంత్రిత్వ శాఖ

గత ఏడాదితో పోలిస్తే లాక్‌డౌన్ వ్యవధిలో ప్రైవేట్ ఆహార ధాన్యాలు (పీఎఫ్‌జీ) సరుకు రవాణాలో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి

- లాక్‌డౌన్‌ వ్యవధిలో మార్చి 25 నుండి ఏప్రిల్ 28 వరకు భారతీయ రైల్వే లోడ్ చేసిన పీఎఫ్‌జీ సరుకు మొత్తం 7.75 లక్షల టన్నులకు చేరిక‌ (303 రేక్‌లు) గత ఏడాది ఇదే కాలంలో జ‌రిపిన ర‌వాణా సుమారు 6.62 లక్షల టన్నులు (243 రేక్‌లు) మాత్ర‌మే
- భారతీయ రైల్వే ఆహార ధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తోంది, నిరంతరాయంగా స‌రుకు సరఫరా గోలుసు కొన‌సాగేలా చ‌ర్య‌లు

Posted On: 29 APR 2020 5:51PM by PIB Hyderabad

కోవిడ్‌-19 కార‌ణంగా లాక్‌డౌన్ అమ‌లవుతున్న నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా ఆహార ధాన్యాలు వంటి నిత్యావసర వస్తువుల లభ్యత ఉండేలా నిర్ధారించ‌డంలో భాగంగా భారతీయ రైల్వే  సరుకు రవాణా మరియు పార్శిల్ సేవలతో త‌న‌ ప్రయత్నాల‌ను కొన‌సాగిస్తోంది. ఈ ఏడాది మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 28 వరకు లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న కాలంలో, అన్ని భారతీయ గృహాల వంటశాలల్లో స‌రుకుల లోటు రాకుండా నిర్ధారించడానికి, దేశవ్యాప్తంగా 7.75 లక్షల టన్నులకు పైగా (303 ర్యాకులు) ప్రైవేట్ ఆహార ధాన్యాలు (పీఎఫ్‌జీ) సరుకును లోడ్ చేశారు. గతేడాది ఇదే కాలంలో దాదాపు 6.62 లక్షల టన్నుల (243 ర్యాకులు) పీఎఫ్‌జీ ర‌వాణా మాత్ర‌మే జ‌రిగింది. బీహార్‌, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ప్రైవేటు ఆహార ధాన్యాలు (పీఎఫ్‌జీ) సరుకు రవాణాలో ప్రధాన రాష్ట్రాలుగా నిలుస్తున్నాయి. ఆహార ధాన్యాలు వంటి వ్యవసాయ ఉత్పత్తులను సకాలంలో ర‌వాణా చేసేందుకు గాను భారతీయ రైల్వే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్ అమ‌లులో ఉన్న స‌మ‌యంలో వీటి సరఫరాను నిర్ధారించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లాక్‌డౌన్‌ వ్యవధిలో ఈ ముఖ్యమైన వస్తువుల లోడింగ్, రవాణా మరియు అన్‌లోడ్ పూర్తి స్థాయిలో జరుగుతోంది.
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి భార‌తీయ రైల్వే త్వ‌ర‌గా పాడైపోయేందుకు అవ‌కాశం ఉన్న పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులతో పాటు వ్యవసాయ ప్రయోజనాల కోసం విత్తనాల ర‌వాణాకు పార్శిల్‌ ప్రత్యేక రైలు మార్గాలను గుర్తించింది. దేశంలోని అన్ని ప్రాంతాల‌కు అనుసంధాన‌త క‌ల్పించేందుకు గాను భార‌తీయ రైల్వే డిమాండ్ తక్కువగా ఉన్న ఆ మార్గాల్లో కూడా రైలు స‌ర్వీసుల‌ను న‌డుపుతోంది. సాధ్యమైన అన్ని ప్రదేశాలలో రైళ్ల నిలిపేందుకు వీలుగా గ‌రిష్ఠంగా ఎన్‌-రూట్ స్టాప్‌పేజీలు ఇవ్వబడ్డాయి. తద్వారా గరిష్ఠ స్థాయిలో పార్శిల్‌ క్లియరెన్స్ జ‌రిపేలా రైల్వే త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతోంది.


(Release ID: 1619373) Visitor Counter : 223