ప్రధాన మంత్రి కార్యాలయం
కెనడా ప్రధాని కి మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
Posted On:
28 APR 2020 9:49PM by PIB Hyderabad
కెనడా ప్రధాని శ్రీ జస్టిన్ ట్రూడో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
కోవిడ్-19 విశ్వమారి కి సంబంధించి ప్రపంచం లో ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితి ని గురించి ఇద్దరు నేత లు చర్చించారు. ప్రపంచవ్యాప్తం గా సంఘీభావం, సమన్వయం, సరఫరా గొలుసుకట్టు యొక్క నిర్వహణ మరియు సహకార భరిత పరిశోధన కార్యకలాపాల కు ప్రాముఖ్యాన్ని ఇవ్వవలసివుంది అంటూ వారు వారి సమ్మతి ని వ్యక్తం చేశారు.
కెనడా లో ఉంటున్న భారతీయ పౌరుల కు- ప్రత్యేకించి భారతీయ విద్యార్థుల కు- సహాయాన్ని మరియు తోడ్పాటు ను అందిస్తున్నందుకు గాను కెనడా ప్రధాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు పలికారు. భారతదేశం లో ఉంటున్న కెనడా పౌరుల కు భారత ప్రభుత్వం సాయపడుతున్నందుకు ప్రధాని శ్రీ ట్రూడో ప్రశంసలు కురిపించారు.
భారతదేశపు ఔషధ నిర్మాణ రంగ సంబంధిత సామర్ద్యాల ను కెనడా తో సహా ప్రపంచం లోని పౌరుల కు అందుబాటు లో ఉంచడం కోసం భారత్ శాయశక్తుల సన్నద్ధం అయి ఉంటుంది అంటూ ప్రధాన మంత్రి శ్రీ మోదీ హామీ ని ఇచ్చారు.
విశ్వమారి ని ఎదిరించి పోరాడడం కోసం సాగుతున్న ప్రపంచవ్యాప్త కృషి కి- ప్రత్యేకించి కోవిడ్-19 కి చికిత్సపరమైనటువంటి పరిష్కారాల ను గాని లేదా ఒక టీకామందు ను గాని కనుగొనడానికి లక్షించిన సాంకేతిక విజ్ఞానం లోను, పరిశోధన లోను సహకారాని కి చొరవ తీసుకోవడం ద్వారా
భారతదేశం మరియు కెనడా ల భాగస్వామ్యం సార్ధకమైన తోడ్పాటు ను అందజేయగలుగుతుంది అనే విషయం లో ఉభయ నేత లు వారి అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
**
(Release ID: 1619173)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam