ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నిరోధ చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష సమావేశం
Posted On:
28 APR 2020 6:32PM by PIB Hyderabad
కరోనా మహమ్మారి వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ముందు జాగ్రత్తలు తీసుకుంటూ, ముందస్తు వ్యూహాత్మక స్పందనతో అత్యంత పకడ్బందీగా ముందుకు సాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిసి కోవిడ్ -19 వైరస్ ను నిరోధించడానికి కృషి చేస్తోంది. అంతే కాదు ఎప్పటికప్పుడు నిర్ణయాల మీద సమీక్ష చేసుఉకంటూ అత్యున్నత స్థాయిలో పర్యవేక్షణ చేసుకుంటూ కరోనా కట్టడి చేయడం జరుగుతోంది.
ఇందులో భాగంగా బయో టెక్నాలజీ విభాగ అధిపతులతోను, దానికి సంబంధించి 18 స్వయంప్రతిపత్తి విభాగాల అధిపతులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం జరిగింది. దేశంలోనే తయారీ కార్యక్రమంలో భాగంగా యాంటీ బాడీలను గుర్తించే కిట్లను, వాస్తవ సమయ పిసిఆర్ ఆధారిత గుర్తింపు కిట్లను, వ్యాక్సిన్లు తయారు చేయడానికి సంబంధించి పరిశోధనలు ఎంతవరకు వచ్చాయనే విషయంపై శ్రీ హర్షవర్ధన్ సమీక్ష చేశారు. పరిశోధనల్ని వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ కోరారు.
ఢిల్లీలో కోవిడ్ -19 నిఘా ఎలా వుందనేదానిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ శ్రీ అనిల్ బాయ్ జాల్, ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యేందర్ జైన్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఇక కోవిడ్ -19 వైరస్ సంక్రమించినవారిలో తక్కవస్థాయి లక్షణాలున్నవారు, లేదా అసలు లక్షణాలు కనబరచని వారు తమ తమ ఇళ్లలోనే స్వీయ నియంత్రణలో వుండడంపై మార్గదర్శకాలను విడుదల చేశారు. చికిత్సకు సంబంధించి అన్ని సౌకర్యాలున్నవారు తమ ఇళ్లలోనే వుండి చికిత్స తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన వివరాల లింకు
https://www.mohfw.gov.in/pdf/GuidelinesforHomeIsolationofverymildpresymptomaticCOVID19cases.pdf.
ఇక కోవిడ్ -19 రోగులకు ఆమోదం పొందిన చికిత్సలేవీ లేవని, ప్లాస్మా థెరపీ కూడా ఆమోదం పొందిన చికిత్స కాదని ఇప్పటికే ఐసిఎంఆర్ స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు జరుగుతున్న చికిత్సలన్నీ ప్రయోగాత్మకంగా చేస్తున్నవే. ప్లాస్మా థెరపీ కూడా అలాంటిదే. ఇది చికిత్సగా పనికొస్తుందనే ఆధారం ఇంకా దొరకలేదు. ప్లాస్మా థెరపీ సమర్థతపై ఐసిఎంఆర్ జాతీయ అధ్యయనం చేస్తోంది. ఐసిఎంఆర్ తన అధ్యయనం పూర్తి చేసి బలమైన శాస్త్రీయత సాధించేంతవరకూ అంతవరకూ ప్లాస్మా థెరపీని పరిశోధనలకు మాత్రమే ఉపయోగించాలని ఐసిఎంఆర్ స్పష్టం చేసింది. ఎందుకంటే ప్లాస్మా థెరపీని ఉపయోగిస్తే అది ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశముందని ఐసిఎంఆర్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఐసిఎంఆర్ వివరాణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది.
గతంలో కోవిడ్ -19 కేసులు నమోదై...గత 28 రోజులుగా ఒక్క కేసు కూడా రాని జిల్లాలు దేశంలో 17 వున్నట్టు తేలింది. ఇలాంటి జిల్లాలకు తాజాగా మరో జిల్లా కలిసింది.
కోవిడ్ -19 వచ్చినవారిలో ఇంతవరకూ 6, 868 మందికి నయమైంది. దాంతో రికవరీ రేటు 23. 3 శాతంగా నమోదైంది. భారతదేశంలో ఇంతవరకూ 29, 435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ -19 కు సంబంధించిన తాజా సమాచారం, మార్గదర్శకాలు, సూచనలు, సలహాల కోసం క్రమం తప్పకుండా
visit: https://www.mohfw.gov.in/ సందర్శించగలరు.
ఎవైనా సాంకేతికపరమైన సందేహాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు ఇమెయిల్ చేయగలరు. ఇతర సందేహాలను ncov2019[at]gov[dot]in కు పంపవచ్చు. ట్వీట్ చేయాలనుకుంటే @CovidIndiaSeva కు చేయవచ్చు.
ఇక ఫోన్ చేయాలనుకునేవారు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ హెల్ప్ లైన్ నెంబరు +91-11-23978046 or 1075 (టోల్ ఫ్రీ) కు చేయవచ్చు. ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్లు కావాలనుకునేవారు. https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf ద్వారా తెలుసుకోవచ్చు.
*****
(Release ID: 1619111)
Visitor Counter : 232
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam