పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా అత్యవసర, వైద్య సామాగ్రి సరఫరాకు 403 లైఫ్‌లైన్ ఉడాన్ విమాన సేవలు
Posted On:
28 APR 2020 4:03PM by PIB Hyderabad
దేశీయ విమాన సేవల విభాగంలో లైఫ్‌లైన్ ఉడాన్ కింద ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐఏఎఫ్ మరియు ప్రైవేట్ విమానయాన సంస్థలకు చెందిన 403 విమానాలు రవాణా సేవలను అందించాయి. వీటిలో ఎయిరిండియా, అలయన్స్ ఎయిర్ సంస్థలకు చెందిన 235 విమానాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ 27 వరకు దేశ వ్యాప్తంగా ప్రజలకు 748.68 టన్నుల మేర నిత్యవసర మరియు వైద్య సామాగ్రిని అందించడానికి వీలుగా లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు సేవలందించాయి.
3,97, 632 కి.మీ. పైగా ప్రయాణం..
లైఫ్‌లైన్ ఉడాన్ విమానాలు 3,97, 632 కి.మీ.పైగా ప్రయాణించి నిత్యవసర మరియు వైద్య సామాగ్రిని రవాణా చేశాయి. కోవిడ్-19 వైరస్‌కు వ్యతిరేకంగా భారతదేశం సాగిస్తున్న యుద్ధానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన నిత్యవసర, వైద్య సరుకును రవాణా చేయడానికి వీలుగా పౌర విమానయాన శాఖ లైఫ్‌లైన్ విమానాలను నడుపుతోంది. ప్రయివేటు
ఆపరేటర్లయిన స్పైస్‌జెట్, బ్లూ డార్ట్, ఇండిగో, విస్తారా సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన సరుకు రవాణా విమానాలను నడుపుతున్నాయి. స్పైస్‌జెట్ ఏప్రిల్ 27 వరకు 633 కార్గో విమానాలను 11,09,028 కిలోమీటర్ల దూరం ప్రయాణింపజేసి 4,637 టన్నుల సరుకును గమ్యస్థానాలకు చేర వేశాయి. ఇందులో 228 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. మరోవైపు బ్లూ డార్ట్ సంస్థ ఏప్రిల్ 27వ వరకు 219 కార్గో విమానాలతో 2,38,928 కిలోమీటర్ల మేర ప్రయాణించి 3,636 టన్నుల సరుకును రవాణా చేసింది. ఇందులో 10 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. మరోవైపు ఇండిగో సంస్థ ఏప్రిల్ 27 వరకు 77,996 కిలోమీటర్ల దూరం మేర మొత్తం 50 కార్గో విమానాలను నడిపింది. వీటి ద్వారా 185 టన్నుల సరుకు రవాణాను చేపట్టింది. ఇందులో 17 అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. ఈ సంస్థ రవాణాలో ప్రభుత్వ అవసరాల మేరకు ఉచితంగా చేపట్టిన వైద్య సామాగ్రిని రవాణా కూడా ఉంది. మరోవైపు విస్తారా విమానయాన సంస్థ ఏప్రిల్ 27 వరకు 14 కార్గో విమానాలను నడిపింది. 20,466 కిలోమీటర్ల దూరాన్ని మరియు 113 టన్నుల సరుకును రవాణా చేసింది.
అంతర్జాతీయంగా కార్గో ఎయిర్ బ్రిడ్జ్ స్థాపన..
అంతర్జాతీయ విమాన రంగంలో భారత్ తూర్పు ఆసియాతో వైమానిక సేవల అనుసంధానతను పునరుద్ధరించారు. దీంతో ఔషధాలు, వైద్యపరకరాలు, కోవిడ్-19 ఉపశమన పదార్థాల రవాణా నిమిత్తం కార్గో ఎయిర్ బ్రిడ్జ్ ఏర్పడేలా చర్యలు చేపట్టారు. ఎయిర్ ఇండియా సంస్థ దాదాపు 609 టన్నుల పరిమాణంలో వైద్య సరుకులను దేశంలోకి తీసుకువచ్చింది. దీనికి అదనంగా, బ్లూ డార్ట్ సంస్థ ఏప్రిల్ 14 నుండి 27వ తేదీ వరకు గ్వాంగ్జౌ నుండి 109 టన్నుల వైద్య సామాగ్రిని దేశంలోకి బ్లూ డార్ట్ సంస్థ ఈ నెల 25న షాంఘై నుండి 5 టన్నుల వైద్య సరుకును భారత్‌కు తీసుకు వచ్చింది. మరోవైపు స్పైస్‌జెట్ సంస్థ ఈ నెల 27వ తేదీ వరకు షాంఘై నుండి 140 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకురాగా.. హాంగ్‌కాంగ్, సింగపూర్ దేశాల నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దాదాపు 13 టన్నుల వైద్య సామాగ్రిని భారత్‌కు తెచ్చింది.
(Release ID: 1618998)
Read this release in:
English
,
Kannada
,
Assamese
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil