నౌకారవాణా మంత్రిత్వ శాఖ

భారత నౌకాశ్రయాల్లో సిబ్బంది మార్పు గురించి వివిధ సంస్థలతో సంభాషించిన - శ్రీ మన్ సుఖ్ మాండవీయ.
పరిస్థితి అనుకూలంగా మారడంతో చిక్కుకున్న భారతీయ నావికులను సత్వరమే తీసుకువస్తామని హామీ ఇచ్చిన - శ్రీ మాండవీయ.

Posted On: 28 APR 2020 1:30PM by PIB Hyderabad

భారతీయ నౌకాశ్రయాల్లో సిబ్బంది మార్పు / తరలింపు గురించి కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయమంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) శ్రీ మన్ సుఖ్ మాండవీయ షిప్ లైనెర్స్, ఓడ యజమానులు, షిప్పింగ్ కంపెనీలు, మారిటైమ్ అసోసియేషన్లు, నావికుల యూనియన్ల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్జాతీయ జలాల్లో పనిచేస్తున్న, చిక్కుకుపోయిన భారతీయ నావికుల పరిస్థితిని ఆయన ఈ సందర్భంగా పునఃసమీక్షించారు. 

 

             

విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయ నావికుల వివరాలను భవిష్యత్ తరలింపు ప్రణాళిక కోసం అందజేయవలసిందిగా శ్రీ మాండవీయ ఆదేశించారు.  పరిస్థితి అనుకూలించిన వెంటనే విదేశాలలో చిక్కుకున్న భారతీయ నావికులను సత్వరమే స్వదేశానికి తీసుకువస్తామని శ్రీ మాండవీయ వివిధ నావికుల సంఘాలకు హామీ ఇచ్చారు.  సరకుల రవాణా సజావుగా జరగడానికి నావికుల ప్రాధాన్యతను శ్రీ మాండవీయ ప్రశంసించారు. కీలకమైన, క్లిష్ట పరిస్థితుల్లో నావికులు ఎదుర్కొన్న సవాళ్ళ గురించి శ్రీ మాండవీయ ప్రస్తావిస్తూ, అటువంటి పరిస్థితుల్లో వారు చేసిన కృషిని అభినందించారు. 

 

 

  భారత నౌకాశ్రయాల్లో నావికుల ప్రవేశం, నిష్క్రమణల ప్రక్రియ సులువుగా జరిగేటట్లు చూడాలని కూడా షిప్పింగ్ మంత్రిత్వశాఖ కు చెందిన అధికారులను శ్రీ మాండవీయ ఆదేశించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  భారత జాతీయ ఓడ యజమానుల సంఘం (ఐ.ఎన్.ఎస్ఏ.);  మారిటైమ్ అసోసియేషన్ అఫ్ నేషన్ వైడ్ షిప్పింగ్ ఏజెన్సీస్ - ఇండియా (ఎమ్.ఏ.ఎన్.ఎస్.ఏ.);  భారత నావికుల జాతీయ యూనియన్ (ఎన్.యు.ఎస్.ఐ.);  ది ఇండియన్ మారిటైమ్ ఫౌండేషన్ (ఐ.ఎం.ఎఫ్.); ది మారిటైమ్ యూనియన్ అఫ్ ఇండియా (ఎమ్.యు.ఐ.);  ది మారిటైమ్ అసోసియేషన్ అఫ్ షిప్ ఓనర్స్ షిప్ మేనేజర్స్ అండ్ ఏజెంట్స్ (ఎమ్.ఏ.ఎస్.ఎస్.ఏ.) మొదలైన సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. 

***(Release ID: 1618922) Visitor Counter : 21