సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇచ్చే భ‌త్యాల‌లో కేంద్రం ఎలాంటి కోతా విధించ‌డం లేదు: పిఐబి నిజ‌నిర్ధార‌ణ విభాగం

Posted On: 27 APR 2020 9:22PM by PIB Hyderabad

కేంద్ర‌ప్ర‌భుత్వ ఉద్యోగులకు ఇచ్చే భ‌త్యాల‌లో (అలొవెన్సెస్) కేంద్రం ఎలాంటి కోత విధించ‌డం లేద‌ని ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో నిజ నిర్ధార‌ణ విభాగం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు పిఐబి ట్వీట్ చేసింది. క‌రోనా వైర‌స్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్ర‌భుత్వం ఉద్యోగుల భ‌త్యాల‌లో కోత‌ విధిస్తారంటూ ఒక మీడియా సంస్థ చేస్తున్న ప్ర‌చారం అస‌త్య‌మ‌ని పిఐబి త‌న ట్వీట్ లో తెలిపింది. 
ట్వీట్ లింకు వివ‌రాలు :
https://twitter.com/PIBFactCheck/status/1254721963945111552?

క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల కిట్ల విష‌యంలో ఫేస్ బుక్‌లో కొన‌సాగుతున్న పుకారుపై కూడా పిఐబి నిజ‌నిర్ధార‌ణ విభాగం వాస్త‌వాల‌ను సేక‌రించి ట్విట్ట‌ర్ లో  పోస్టు చేసింది. ఈ పుకారు ప్ర‌కారం కోవిడ్ -19 కిట్లు త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తున్నా స‌రే ఐసిఎంఆర్ వాటిని తీసుకోకుండా గ‌ణ‌నీయంగా పెంచిన ధ‌ర‌ల‌కు కొంటున్న‌ద‌నేది స‌ద‌రు ఫేస్ బుక్ లో వ‌చ్చిన పుకారు. అయితే అలాంటిదేమీ లేద‌ని నిర్ణీత ధ‌ర ప్ర‌కార‌మే కిట్ల‌ను కొంటున్నామ‌ని ఆ ధ‌ర‌కంటే త‌క్కువ‌కు ఎవ‌రు ఇచ్చినా వాటిని తీసుకుంటామ‌ని ఐసిఎంఆర్ వివ‌ర‌ణ ఇచ్చంది.
దీనికి సంబంధించిన ట్వీట్ లింకు వివ‌రాలు:

 

https://twitter.com/PIBFactCheck/status/1254714069283508226?

నేప‌థ్యం
.....
సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌య్యే అవాస్త‌వ వార్త‌ల‌కు, వైర‌ల‌య్యే పుకార్ల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికిగాను, సుప్రీం కోర్టు సూచ‌న‌ల ప్ర‌కారం పిఐబి ఆధ్వ‌ర్యంలో నిజ‌నిర్ధార‌ణ కోసం ఒక ప్ర‌త్యేక‌మైన విభాగాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. పిఐబి ఫ్యాక్ట్ చెక్ అనేది పిఐబి వారి ట్విట్ట‌ర్ హ్యాండిల్. ఇది సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ట్రెండ‌య్యే పోస్టుల‌ను నిరంత‌రం గ‌మ‌నిస్తూ వుంటుంది. వాటిపై స‌మగ్ర‌మైన స‌మీక్ష చేసి వాస్త‌వాల‌ను ప్రజ‌ల‌కు తెలియ‌జేస్తుంది. పిఐబి ఇండియా హ్యాండిల్ మ‌రియు పిఐబి ప్రాంతీయ యూనిట్ల హ్యాండిళ్లు  #PIBFactCheck అనే హ్యాష్ ట్యాగ్ ఉప‌యోగిస్తున్నాయి. దీని ద్వారా పిఐబి కి సంబంధించిన అధికారిక స‌మాచారం తెలుసుకోవ‌చ్చు. 
ప్ర‌జ‌లు ఎవ‌రైనా స‌రే త‌మ‌కు తెలిసిన సోష‌ల్ మీడియా మెసేజ్ నిజ‌మో కాదో తెలుసుకోవాల‌నుకుంటే దానికి సంబంధించిన వివ‌రాల ఆడియో, వీడియోల‌ను ఆన్ లైన్ ద్వారా  పిఐబికి పంప‌వ‌చ్చు. పంపాల్సిన చిరునామా  https://factcheck.pib.gov.in/ 
 వాట్సాప్ నెంబ‌రుకు పంపాల‌నుకుంటే  +918799711259 నెంబ‌రుకు పంప‌గ‌ల‌రు. ఇమెయిల్ చేయాల‌నుకుంటే pibfactcheck@gmail.com కు పంప‌గ‌ల‌రు. మ‌రిన్ని వివ‌రాల‌కోసం పిఐబి వెబ్ సైట్‌... https://pib.gov.in సంప్ర‌దించ‌గ‌ల‌రు. 


***(Release ID: 1618886) Visitor Counter : 22