రైల్వే మంత్రిత్వ శాఖ
కోవిడ్ కారణంగా ప్రతిరోజూ సుమారు 13,000 ప్రశ్నలు, అభ్యర్థనలు సలహాలకు స్పందిస్తున్న రైల్వే ఎమర్జెన్సీ సెల్
-ప్రజల నుంచి వచ్చిన సలహాలను స్వీకరిస్తూ కీలకమైన వస్తువులను రైల్వేలు రవాణా చేస్తున్నాయి.
-తక్షణ స్పందన , వేగంగా ఫిర్యాదులు పరిష్కరించడంపై రైల్వేలకు ప్రశంసలు
-కోవిడ్ -19 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్త సరఫరా వ్యవస్థలు కొనసాగేలా చూడడంతో పాటు ప్రయాణికులు, వాణిజ్య ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు సమగ్ర చర్యలు చేపట్టిన భారతీయ రైల్వే
-ప్రయాణికుల కష్టాలను తొలగించి, సరకురవాణా,పార్శళ్లు, మందులు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సకాలంలో చేరేవేసేందుకు రైల్వేలు తీసుకున్న చర్యలకు వివిధ వర్గాల ప్రజల నుంచి అభినందనల వెల్లువ
Posted On:
27 APR 2020 2:30PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా సరకు రవాణా వ్యవస్థలు కొనసాగేందుకు, వాణిజ్య ఖాతాదారులు, ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడడానికి భారతీయ రైల్వే సమగ్ర చర్యలు తీసుకుంది. కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకోవడానికి భారతీయ రైల్వేలు లాక్‌డౌన్ 1,2 కాలాలలో ప్రయాణికుల రైళ్లను నిలిపివేసింది.అయితే ప్రజలను , తన కస్టమర్లను చేరడానికి ఇది రైల్వేలకు ఏమాత్రం అడ్డంకి కాలేదు. లాక్ డౌన్ కారణంగా ప్రజల ఫిర్యాదులు,సూచనలు వినే వ్యవస్థ ఒకటి ఉండాలని , అది తక్షణ ప్రతిస్పందన కలిగి ఉండాలని భావించడం రైల్వేలు భావించింది. ఇందుకు అనుగుణంగా రైల్వే కోవిడ్ -19ఎమర్జెన్సీ సెల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రైల్వే బోర్డునుండి డివిజన్ల వరకు 400 మందితో ఏర్పడింది. లాక్‌డౌన్ సమయంలో ఈ సెల్ ప్రతిరోజూ 5 కమ్యూనికేషన్ , ఫీడ్ బ్యాక్ ప్లాట్‌ఫారాలు, 139, 138హెల్ప్‌లైన్లు, సోషల్‌మీడియా ,ప్రత్యేకించి ట్విట్టర్, ఈమెయిల్ (railmadad@rb.railnet.gov.in), సిపి గ్రామ్స్ ద్వారా 13 వేల ప్రశ్నలు, అభ్యర్థనలు, సూచనలకు స్పందిస్తూ వస్తోంది. ఇందులో 90 శాతంపైగా ప్రశ్నలకు సమాధానాలు స్థానిక భాషలో ఫోన్ చేసిన వారికి నేరుగా సమాధానం చెప్పడం ఉన్నాయి. దీనితో భారతీయ రైల్వేలకు చెందిన 24 గంటలూ పనిచేసే కోవిడ్ ఎమర్జెన్సీ సెల్ ప్రతి ఒక్క ఫిర్యాదుకూ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకుంటూ రైల్వేలు దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందింది.
రైల్‌మదద్ హెల్ప్‌లైన్ 139 లాక్ డౌన్ అనంతరం మొదటి నాలుగు వారాల్లో 2,30, 000 ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇచ్చింది, ఐవిఆర్ఎస్ సౌకర్యం ద్వారా అడిగిన ప్రశ్నలకు తోడు. 138 , 139 పై ప్రశ్నలు ఎక్కువగా రైలు సేవలను ప్రారంభించడం , సవరించిన రిఫండ్ నిబంధనలకు సంబంధించినవి.(ఇది ప్రజల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా అంచనా వేసినది), రైల్వేలు చేస్తున్న ప్రయత్నాలు , అది చేస్తున్న సూచనలపై సామాజిక మాధ్యమాలలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అదే సమయంలో, హెల్ప్‌లైన్ 138 లో 1,10,000 కి పైగా కాల్స్ వచ్చాయి, ఇది భౌగోళిక అనుసంధానత కలిగినది. అంటే ఈ కాల్ సమీప రైల్వే డివిజనల్ కంట్రోల్ ఆఫీస్‌కు చేరుతుంది. (స్థానిక భాషలో బాగా ప్రావీణ్యం ఉన్న రైల్వే సిబ్బంది , స్థానిక సమస్యలతో సుపరిచితులైన వారిచేత వీరికి సమాధానాలు ఇప్పిస్తారు ) కాలర్ ఏ ప్రాంతం నుంచి మాట్లాడుతున్నారో ఆ ప్రదేశాన్ని బట్టి , కాల్ చేసేవారు సౌకర్యవంతంగా మాట్లాడే భాషలో సమాచారం,సూచనలు అందుకునేలా ఇది చేస్తుంది. ఈ కొత్త ఫీచర్ రైల్వే కస్టమర్లకు సమాచారం తక్షణమే అందడానికి ఉపకరిస్తుంది. సంబంధిత రైల్వే డివిజన్ వద్ద సంబంధిత సమాచారం సిద్దంగా ఉన్నందున వేగంగా సమాచారాన్ని అందించడానికి వీలు కలుగుతోంది.
ఈ సమయంలో, వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు , ఆహారం వంటి ముఖ్యమైన వస్తువులను పార్శిల్ ద్వారా త్వరగా రవాణా చేయవలసిన అవసరం ఉందని గుర్తించడం జరిగింది. ఇందుకు అనుగుణంగా. మరోసారి, రైల్వే సత్వరం స్పందించింది. రైల్వే శాఖ, ప్రాణరక్షణ ఔ షధాల వంటి ముఖ్యమైన వస్తువులను సమయానుసారంగా పంపిణీ చేయడానికి టైమ్‌టేబుల్ పార్శిల్ రైళ్లను ప్రారంభించింది. వివిధ పాయింట్ల వద్ద చిక్కుకుపోయిన ఆర్.ఎం.ఎస్ సర్వీసు, ఇతర కన్‌సైన్ మెంట్లను కూడా పార్సెల్ స్పెషల్స్ ఉపయోగించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ చర్యను వ్యాపార వర్గాలు, ప్రజలందరూ ప్రశంసించారు. గడ్చిరోలి నుండి బెంగళూరుకు బియ్యం రవాణా చేయడంలో బెంగళూరు డివిజన్ ఆ వ్యాపారవేత్తకు సమర్ధంగా సహకరించింది., అలాగే ఢిల్లీ నుండి బియ్యం ప్యాకేజింగ్ సామగ్రిని లోడ్ చేయడంలో ఢిల్లీ డివిజన్ సహాయపడింది, ఇందుకు అతను తన స్పందన తెలియజేస్తూ, ‘సర్ నేను రైల్వే మంత్రిత్వ శాఖకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అని పేర్కొన్నారు.
ప్రజల నుండి అందుకున్న సలహాలను, రియల్ టైమ్ ప్రాతిపదికన, సాధ్యమైన చోట రైల్వే శాఖ స్వీకరించింది. ఉదాహరణకు, ఈస్ట్ కోస్ట్ రైల్వే యశ్వంత్ పూర్ (బెంగళూరు) నుండి గౌహతి వరకు ఒక పార్శిల్ ప్రత్యేక రైలును ప్లాన్ చేసింది. అయితే, దీనికి విశాఖపట్నం వద్ద స్టాప్‌ను పెట్టలేదు. కానీ ట్విట్టర్‌లో సూచన వచ్చిన మేరకు విశాఖపట్నం స్టేషన్ ద్వారా దానిని వెళ్లేట్టు చేశారు.
లాక్ డౌన్ కారణంగా ప్రాణ రక్షక ఔషధాలను సేకరించలేకపోతున్న ప్రజలకు మందులు రవాణా చేయడంలో రైల్వే కీలక పాత్ర పోషించింది. కెనడాకు చెందిన ఒక ఎన్‌ఆర్‌ఐ, ప్రస్తుతం లూధియానాలో ఉన్నారు. నాగ్‌పూర్ నుండి లూధియానాకు నేరుగా రైలు సర్వీసు లేకపోయినా తనకు అవసరమైన మందులను నాగపూర్ నుంచి లూథియానాకు అందేలా చేయడంలో సెంట్రల్ రైల్వే చేసిన కృషిని ఆ ఎన్.ఆర్.ఐ ప్రశంసించారు. ఒక చిన్నారికి లివర్ మార్పిడి జరిగి అత్యవసర మందులు అవసరమైతే వాటిని అహ్మదాబాద్‌నుంచి రత్లాంకు పశ్చిమరైల్వే సరఫరా చేసింది. ఈ చిన్నారి రైల్వేలను అభినందిస్తూ రాసిన లేఖను ట్విట్టర్‌లో అప్ లోడ్ చేశారు.అందులో
‘ఈ క్లిష్ట సమయంలో భారతీయ రైల్వే తమ పౌరులకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను - భారతీయ రైల్వే ఉత్తమమైనది.’ అని అందులో అభినందనలు తెలిపారు.
ఆటిజంతో బాధపడుతున్న , తీవ్రమైన ఆహార అలెర్జీలతో బాధపడుతున్న 3 సంవత్సరాల చిన్నారి కోసం వాయవ్య రైల్వే జోధ్‌పూర్ నుండి ముంబైకి 20 లీటర్ల ఒంటె పాలను రవాణా చేసింది ఆ పాలను సేకరించి గమ్యస్థానం చేర్చడానికి షెడ్యూలు లోని స్టాపేజ్ ఇచ్చి దీనిని సాకారం చేశారు. దీనికి, ఒక శ్రేయోభిలాషి ఇలా స్పందించాడు: ‘కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయో చూస్తే ఆశ్చర్యం గొలుపుతుంది. సంకల్పం ఉన్నచోట పనులు జరిగితీరుతాయి’ అని పేర్కొన్ననారు.
****
(Release ID: 1618698)
Visitor Counter : 228
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada