పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో లైఫ్ లైన్ ఉడాన్ విమానాలు 684 టన్నుల మేర అవసరమైన వస్తువులను, వైద్య పరమైన వస్తువులను దేశవ్యాప్తంగా సరఫరా చేశాయి.
Posted On:
26 APR 2020 7:32PM by PIB Hyderabad
కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం జరుపుతున్న పోరాటానికి మద్దతుగా ఎమ్.ఓ.సి.ఏ. నడుపుతున్న "లైఫ్ లైన్ ఉడాన్" విమానాలు అవసరమైన వైద్య సామాగ్రిని దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐ.ఏ.ఎఫ్. తో పాటు ప్రైవేట్ సంస్థలు లైఫ్ లైన్ ఉడాన్ కింద 383 విమానాలను నడిపాయి. ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ సంస్థలు 223 విమానాలను నడిపాయి. ఇంతవరకు 684.08 టన్నుల సామాగ్రి రవాణా అయ్యింది. లైఫ్ లైన్ విమానాలు ఇంతవరకు 3,76,952 కిలోమీటర్ల వాయు మార్గంలో ప్రయాణించాయి.
2020 ఏప్రిల్ 25వ తేదీ వరకు పవన్ హన్స్ విమానాలు 6,885 కిలోమీటర్లు ప్రయాణించి 1.99 టన్నుల సామాగ్రిని రవాణా చేశాయి. జమ్మూ, కశ్మీర్, లడఖ్, దీవులు, ఈశాన్య ప్రాంతాల్లో పవన్ హన్స్ లిమిటెడ్ తో సహా హెలికాప్టర్ సేవల ద్వారా క్లిష్టమైన వైద్య సామాగ్రితో పాటు, రోగులను కూడా రవాణా చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతాలు, దీవులు, పర్వత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.
జమ్మూ, కశ్మీర్, లడఖ్, ఈశాన్య, ఇతర దీవుల ప్రాంతాలకు ఎయిర్ ఇండియా మరియు ఐ.ఏ.ఎఫ్. సంస్థలు రెండు కలిసి పనిచేస్తున్నాయి.
దేశీయ కార్గో సంస్థలైన స్పైస్ జెట్, బ్లూ డార్ట్, ఇండిగో సంస్థలు వాణిజ్య పరంగా కార్గో విమానాలు నడుపుతున్నాయి. 2020 మార్చి 24వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు స్పైస్ జెట్ సంస్థకు చెందిన 579 కార్గో విమానాలు 10,12,586 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 4,246 టన్నుల సామాగ్రిని రవాణా చేశాయి. వీటిలో 208 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. 2020 మార్చి 25వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు బ్లూ డార్ట్ సంస్థకు చెందిన 207 కార్గో విమానాలు 2,19,978 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 3,399 టన్నుల సామాగ్రిని రవాణా చేశాయి. వీటిలో 9 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. 2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు ఇండిగో సంస్థ కు చెందిన 48 కార్గో విమానాలు 72,222 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 167 టన్నుల సామాగ్రిని రవాణా చేశాయి. వీటిలో 15 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం కోసం ఉచితంగా రవాణా చేసిన వైద్య సామాగ్రి కూడా ఉంది. 2020 ఏప్రిల్ 19వ తేదీ నుండి ఏప్రిల్ 25వ తేదీ వరకు విస్తారా సంస్థ కు చెందిన 12 కార్గో విమానాలు 16,952 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 82 టన్నుల సామాగ్రిని రవాణా చేశాయి.
అంతర్జాతీయ రంగంలో, కోవిడ్-19 సహాయ సామాగ్రి, మందులు, వైద్య పరికరాలు రవాణా చేయడానికి తూర్పు ఆసియా తో ఒక కార్గో ఎయిర్ బ్రిడ్జి ని ఏర్పాటుచేసుకోవడం జరిగింది. 2020 ఏప్రిల్ 25వ తేదీ వరకు ఎయిర్ ఇండియా సంస్థ 554 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకురావడం జరిగింది.
వీటితో పాటు, బ్లూ డార్ట్ సంస్థ 2020 ఏప్రిల్ 25వ తేదీ వరకు గుయాంగ్జ్హౌనుండి సుమారు 90 టన్నుల వైద్య సామాగ్రి రవాణా చేసింది. బ్లూ డార్ట్ సంస్థ 2020 ఏప్రిల్ 25వ తేదీన షాంఘై నుండి కూడా ఐదు టన్నుల వైద్య సామాగ్రిని రవాణా చేసింది. స్పైస్ జెట్ సంస్థ 2020 ఏప్రిల్ 25వ తేదీ వరకు షాంఘై నుండి 124 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకువచ్చింది. 2020 ఏప్రిల్ 25వ తేదీ వరకు హాంగ్ కాంగ్, సింగపూర్ ల నుండి 13 టన్నుల వైద్య సామాగ్రిని రవాణా చేసింది.
*****
(Release ID: 1618530)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada