సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కి వ్యతిరేకంగా భారతదేశం కొనసాగిస్తున్న పోరాటం గురించి తెలుసుకునేందుకు ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులతో విస్తృత సమాలోచనలు జరిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్.

Posted On: 25 APR 2020 6:37PM by PIB Hyderabad

కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం గురించి ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్.), ఎమ్.ఓ.ఎస్. పి.ఎం.ఓ., సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులతో విస్తృతంగా సమావేశమై లాక్ డౌన్ అనంతరం అనుసరించవలసిన ప్రణాళిక వ్యూహంపై చర్చించారు. గంటన్నర పాటు సాగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాజీ ఐ.ఏ.ఎస్. అధికారులు శ్రీ సుధీర్ భార్గవ, శ్రీ రామ సుందరంశ్రీ రాకేష్ కుమార్ గుప్త, శ్రీ సత్యానంద మిశ్రా,  శ్రీ పి. పన్నీర్వెల్,  శ్రీ కే.వి. ఈపేన్ తో పాటు, మాజీ ఐ.ఆర్.ఎస్. అధికారులు శ్రీమతి సంగీత గుప్త, శ్రీమతి షీలా సంగ్వాన్  పాల్గొన్నారుకోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోడానికి ప్రభుత్వం చేపట్టిన కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ వారికి ఈ సందర్భంగా  వివరించారు.  అనుకూల, క్రియాశీల చర్యలతో కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడం ద్వారా ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే భారతదేశం ముందుందని ఆయన పేర్కొన్నారు

వివిధ చర్యల ద్వారా ఈ మహమ్మారిని నిలువరించడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను అధికారులు కూడా అభినందించారు. లాక్ డౌన్ సడలించిన అనంతరం ఆర్థికవ్యవస్థను సత్వరమే గాడిలో పెట్టేందుకు తమ అభిప్రాయాలను వారు వెల్లడించారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా అధికారులు ప్రస్తావించిన కొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి

లాక్ డౌన్ ను దశలవారీగా సడలించాలి, పరిపాలనలో ఈ- ఆఫీస్ తరహా సాంకేతికతను ఎక్కువగా వినియోగించాలి,  విటమిన్-సి తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవలసిన ఆవశ్యకత, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఆర్ధిక ఉద్దీపనల అవసరం, పేదలకు ఆర్ధిక భద్రత, విద్య సంవత్సరం వృధా కాకుండా ఎక్కువగా ఆన్ లైన్ కోర్సులు, పరీక్షలు ప్రవేశపెట్టాలి, వలస కూలీలు వారి స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలి, "మేక్-ఇన్-ఇండియా" భారత్ లో తయారీని ప్రోత్సహించే విధంగా టీకాలు, టెస్టింగ్ కిట్స్ దేశీయంగా అభివృద్ధి చేయాలి. 

మాజీ ఉన్నతాధికారులు ఈ విషయమై వెలిబుచ్చిన అమూల్యమైన సూచనలకు డాక్టర్ జితేంద్ర సింగ్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.  కరోనా మహమ్మారి సృష్టించిన సవాళ్ళనుండి బయటకు రావడానికి అన్ని వర్గాల సహకారం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

<><><><><> (Release ID: 1618286) Visitor Counter : 155