రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
దేశ వ్యాప్తంగా ట్రక్కు,లారీ డ్రైవర్లు పెద్ద ఎత్తున సరకు రవాణా చేపడుతున్నందున వారు చేయదగిన,చేయకూడని వాటిని వివరిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఒక యానిమేషన్ వీడియోను విడుదల చేసింది.
లాక్‌డౌన్ సమయంలో నిత్యావసర సరకులు మందులను రవాణా చేస్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లను గౌరవించాల్సిందిగా పిలుపునిచ్చింది.
Posted On:
25 APR 2020 5:35PM by PIB Hyderabad
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక సచిత్ర యానిమేషన్ వీడియోను విడుదల చేసింది, ట్రక్కు, లారీ డ్రైవర్లు దేశవ్యాప్తంగా అవసరమైన వస్తువులను రవాణా చేయడానికి ప్రయాణిస్తున్నందున, అది విస్తృతస్థాయిలో వారు చేయదగిన,చేయకూడని వాటిని వివరించే వీడియోను విడుదల చేసింది.. కోవిడ్ -19ను అరికట్టడానికి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ పొడిగించాల్సిన పరిస్థితుల్లో అవసరమైన వస్తువులు, మందులను రవాణా చేయడం ద్వారా మన జీవితాన్ని సులభతరం చేయడానికి కృషి చేస్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లను గౌరవించి, సహకరించాలని ఈ యానిమేషన్ ప్రజలకు పిలుపునిస్తోంది.
ట్రక్కు,లారీ డ్రైవర్లు చేయదగిన,చేయగూడని వాటిని పరిశీలిద్దాం :
నోవెల్ కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండండి: లాక్ డౌన్ సమయంలో అత్యవసర సరకులు, మందుల సరఫరాను కొనసాగించే లారీ, ట్రక్కు డ్రైవర్లను గౌరవించండి, వారికి సహకరించండి.
మిమ్మల్ని మీరు రక్షించుకోండడి, ఇతరులను రక్షించండి,
ఈ నిబంధనలను మీ భద్రత కోసం పాటించండి.
చేయవలసినవి:
- వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
- సాధ్యమైనప్పుడల్లా కనీసం 20 సెకండ్లపాటు మీ చేతిని నీటితో , సబ్బుతో కడగండి
- వాహనంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, వాహనం నుంచి బయటకు వస్తున్నప్పుడు మాస్క్ ధరించండి.
- మాస్క్‌ను వాడిన తర్వాత దానిని సబ్బుతో నీటితో ఉతికి ఆరబెట్టాలి
- మీ వాహనంలో ఎల్లప్పుడూ శానిటైజర్ ఉంచుకోండి
- డ్రైవింగ్ చేసేటపుడు, వాహనం నుంచి వెలుపలకు వచ్చేటపుడు 70 శాతం ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ వాడండి.
-నిబంధనల ప్రకారం సహాయకుడు , డ్రైవర్ కాకుండా అదనపు ప్రయాణీకులతో ప్రయాణించవద్దు
- సామాజిక దూరాన్ని పాటించండి
- చెక్ పోస్టులు , లోడింగ్-అన్ లోడింగ్ పాయింట్లు , రెస్టారెంట్లు మొదలైన వాటిలో ప్రజలతో సన్నిహితంగా ఉండటం మానుకోండి.
-ప్రతిరోజూ మీ వాహనాన్ని శుభ్రపరచండి
చేయకూడనివి:
-చిరిగిన , పాత , లేదా ఇతరులు ఉపయోగించిన ముసుగులు ఉపయోగించవద్దు
-మీ వాహనంలో ఒకరి కంటే ఎక్కువ సహాయకులను మీతో ప్రయాణించడానికి అనుమతించవద్దు
-సామాజిక సమావేశాలు నిర్వహించవద్దు
- మీ పరిశుభ్రతను విస్మరించవద్దు
-రండి, మనమందరం ప్రతిఒక్కరి రక్షణకు చర్యలు తీసుకుంటూ కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఆపుదాం.
వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
(Release ID: 1618254)
Visitor Counter : 166
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam