ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నిర్వహణలో ప్రస్తుత పరిస్థితి, చర్యలను సమీక్షించిన మంత్రుల బృందం.

కోవిడ్ -19 ని ఎదుర్కోవడంలో భాగస్వాములందరూ చేసిన సమిష్ఠి కృషిని అభినందించిన డాక్టర్ హర్ష వర్ధన్.

Posted On: 25 APR 2020 3:09PM by PIB Hyderabad

 కోవిడ్-19 పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల బృందం (జి.ఓ.ఎం.) 13వ సమావేశం ఈ రోజు నిర్మాణ్ భవన్ లో కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్ ఎస్. పురీ;  విదేశీ వ్యవహారాల సఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్;  హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్;  నౌకా రావాణారసాయనాలుఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవీయ;  కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వనీ కుమార్ చౌబే తో పాటు రక్షణ సిబ్బంది అధిపతి శ్రీ బిపిన్ రావత్;  నీతీ ఆయోగ్ కార్య నిర్వహణాధికారి మరియు సాధికార బృందం-6 చైర్ పర్సన్ శ్రీ అమితాబ్ కాంత్;   కార్యదర్శి (పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు) మరియు సాధికార బృందం-2 చైర్ పర్సన్ శ్రీ సి.కె.మిశ్రా;   కార్యదర్శి (ఎమ్.ఎస్.ఎం.ఈ.) మరియు సాధికార బృందం-4 చైర్ పర్సన్ డాక్టర్ అరుణ్ కె. పాండా;  సాధికార బృందం-3 చైర్ పర్సన్ శ్రీ పి.డి.వాఘేలా కూడా పాల్గొన్నారు

కోవిడ్-19 నిర్వహణ, ప్రతిస్పందన తో సహా దేశంలో కోవిడ్-19 పరిస్థితి గురించి సవివరమైన నివేదికను మంత్రుల బృందానికి సమర్పించారు.  కోవిడ్-19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం కేంద్రప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు చేపట్టిన చర్యలపై మంత్రుల బృందం (జి.ఓ.ఎం.) వివరణాత్మక చర్చ జరిపింది. కోవిడ్-19 ని అరికట్టేందుకు ప్రణాళికలను మరింత బలోపేతం చేయాలని మంత్రుల బృందం అన్ని జిల్లాలను కోరింది. జిల్లాల వారీగా కోవిడ్-19 కోసం ప్రత్యేకించిన ఆసుపత్రుల వివరాలతో పాటు, అందుబాటులో ఉన్న ఐసోలేషన్ పడకలు / వార్డులు, పి.పి.ఈ లు, ఎన్95 మాస్కులు, మందులు, వెంటిలేటర్లు, ఆక్సీజన్ సీలిండర్లు మొదలైన వాటి  వివరాలు మంత్రుల బృందానికి  తెలియజేశారు.  పి.పి.ఈ. లు, మాస్కులు మొదలైనవి తయారుచేయడానికి గతంలో గుర్తించిన దేశీయ ఉత్పత్తిదారులు వాటి తయారీని ఇప్పటికే ప్రారంభించారనీ, వాటి నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయనీ మంత్రుల బృందానికి వివరించారు.   ఈ రోజు వరకు, దేశంలో ప్రతీ రోజు సుమారు లక్షకు పైగా పి.పి.ఈ. లు మరియు ఎన్95 మాస్కులు తయారవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం  పి.పి.ఈ. లు తయారు చేసే ఉత్పత్తిదారులు 104 మంది, ఎన్.95 మాస్కులు తయారుచేసేవారు ముగ్గురు ఉన్నారు. వీరికి అదనంగాదేశీయంగా తొమ్మిది మంది వెంటిలేటర్ల ఉత్పత్తిదారులు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించారు. వారికి 59,000 యూనిట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.  

నమూనాలకు పరీక్షలు నిర్వహించే ప్రక్రియ గురించి, దేశంలో టెస్టింగ్ కిట్స్ లభ్యత గురించి మంత్రుల బృందం సమీక్షించింది. హాట్ స్పాట్స్, క్లస్టర్ నిర్వహణ వ్యూహం గురించి కూడా అడిగి తెలుసుకున్నారుప్రస్తుతం కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ, ప్రయివేటు ప్రయోగశాలల సంఖ్య గురించి మంత్రుల బృందానికి వివరించారుఈ ప్రయోగశాలల ద్వారా ప్రతిరోజూ నిర్వహిస్తున్న టెస్టుల సంఖ్యను కూడా వారికి తెలియజేశారు. 

వివిధ సాధికార కమిటీలకు కేటాయించిన బాధ్యతలు, వాటి పని తీరు గురించి శ్రీ అమితాబ్ కాంత్, డాక్టర్ అరుణ్ కుమార్ పాండా, శ్రీ ప్రదీప్ ఖరోల మంత్రుల బృందానికి వివరాలు అందజేశారు.  సుమారు 92,000 ఎన్.జి.ఓ. లు, ఎస్.హెచ్.జి. లు, పౌర సమాజ సంఘాలు విరాళాలతో వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులకు ఆహారం అందజేస్తున్నాయని మంత్రుల బృందానికి తెలిపారు. ఎన్.జి.ఓ. లకు రాష్ట్రాలు ఎస్.డి.ఆర్.ఎఫ్. నిధుల నుండి ఆర్ధిక సహాయం అందజేస్తుండగా, ఎఫ్.సి.ఐ. రాయితీ ధరలో ఆహార ధాన్యాలు అందజేస్తున్నాయి. 

జాతీయ స్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, ఎన్.ఎస్.ఎస్.; ఎన్.వై.కే.; ఎన్.సి.సి.; వైద్యులు మొదలైన వారితో ఒక "మెటా-డేటా" తయారు చేసినట్లు మంత్రుల బృందానికి తెలియజేశారు. కోవిడ్ వారియర్స్ గా పిలువబడే ఈ కార్యకర్తలను అవసరమైన ప్రాంతాలకు కేటాయించే విధంగా ఈ సమాచారాన్ని అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, ఇతర అధికారులకు అందుబాటులో ఉంచారు.  ప్రస్తుతం ఈ డేటా లో 1.24 కోట్ల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు.  వారి వారి వ్యక్తిగత ప్రత్యేక నైపుణ్యాలను బట్టి వీరిని బృందాలుగా రూపొందిస్తూ, ఎప్పటికప్పుడు జాబితాను సవరిస్తున్నారు.    ఈ జాబితాలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి సమాచారంతో పాటు ప్రతి గ్రూప్ లో ఎవరెవరు ఉన్నారు, సంబంధిత రాష్ట్ర, జిల్లా నోడల్ అధికారుల చిరునామా వివరాలు కూడా పొందుపరిచారు. 

మొత్తం సమాచారం https://covidwarriors.gov.in/default.aspx   వెబ్ సైట్ పై అందుబాటులో ఉంది. సామర్ధ్య నిర్మాణం కోసం ఈ సమాచారాన్ని  https://diksha.gov.in/igot/  పోర్టల్ లో కూడా పొందుపరిచారు. 

ఈ కోవిడ్ వారియర్స్ కి ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ. వెబ్ సైట్ మరియు ఐ.గోట్ శిక్షణా పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తారు. 113 వీడియోలు, 29 డాక్యూమెంట్లతో 53 మాడ్యూల్స్ తో వీరికి 14 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు వరకు సుమారు 10 లక్షల మంది పైగా శిక్షణ పొందారు. 

అన్ని స్థాయిల్లో, భాగస్వాములందరూ ఎంతో  అంకితభావంతో అందిస్తున్న కృషిని డాక్టర్ హర్ష వర్ధన్ అభినందించారు.  కోవిడ్-19 తో పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలు, రోగుల పట్ల వివక్ష చూపేవారిని, వారిపై దాడికి పాలపడే వారిని ఉపేక్షించేదిలేదనీ, ఈ సమస్యను వెంటనే పరిష్కరించవలసిన అవసరం ఉందనీ ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఇటీవల చాలా కఠినమైన నిబంధనలతో అంటువ్యాధుల చట్టం-1897 సవరణకు ఆర్డినెన్సు ను తీసుకువచ్చిన సంగతిని  ఆయన ప్రస్తావించారు.  "ఇది కేవలం వారు చేస్తున్న పోరాటం కాదు, ఇది మనందరి సమిష్టి కృషి.  వారు ఈ పోరాటంలో ముందున్నారు. దేశప్రజలందరూ వారి సేవలను గౌరవించాలి. అదేవిధంగా వారి రక్షణ, గౌరవాలను కూడా పరిరక్షించాలి." అని డాక్టర్ హర్ష వర్ధన్ పేర్కొన్నారు.  

ఇప్పటి వరకు మరణాల రేటు సుమారు 3.1 శాతంగా ఉంది.  కాగా రికవరీ రేటు 20 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రుల బృందానికి తెలిపారు.  ఇది చాలా దేశాలతో పోలిస్తే చాలా మెరుగైన పరిస్థితి. మనం అనుసరించిన క్లస్టర్ నిర్వహణ, నియంత్రణ వ్యూహంతో పాటు దేశంలో లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలుపరచడం వల్ల ఇది సాధ్యమైనట్లు మనం భావించవచ్చు. కాగా ప్రస్తుతం సరాసరి రెట్టింపు అయ్యే మరణాల రేటు 9.1 రోజులుగా ఉంది.  

ఇంతవరకు, 20.66 శాతం రికవరీ రేట్ తో 5,062 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విదులైనట్లు మంత్రుల బృందానికి తెలియజేశారు.  నిన్నటి నుండి 1429 కొత్త కేసులు నమోదయ్యాయిఇంతవరకు మొత్తం 24,506 కేసులను కోవిడ్-19 పాజిటివ్ గా ధృవీకరించారు.  

ఈసమావేశంలో కార్యదర్శి (హెచ్.ఎఫ్.డబ్ల్యూ.) శ్రీమతి ప్రీతీ సుడాన్కార్యదర్శి (విదేశీ వ్యవహారాలు) శ్రీ హెచ్.వర్ధన్ శృంగళాకార్యదర్శి (టెక్సటైల్స్) శ్రీ రవి కపూర్; కార్యదర్శి (సివిల్ ఏవియేషన్) శ్రీ ప్రదీప్ సింగ్ ఖరోల;  కార్యదర్శి (ఫార్మస్యూటికల్స్) శ్రీ పి.డి.వాఘేలా;   కార్యదర్శి (కామర్స్) శ్రీ అనూప్ వాధవాన్;  కార్యదర్శి (హెల్త్) శ్రీ సంజీవ కుమార్;  అదనపు కార్యదర్శి(షిప్పింగ్)  శ్రీ సంజయ్ బందోపాధ్యాయ్; అదనపు కార్యదర్శి (హోమ్ అఫైర్స్) శ్రీ దమ్ము రవి;  కార్యదర్శి (ఎమ్.హెచ్.ఏ.) శ్రీ అనిల్ మాలిక్;  ఐ.జి.(ఐ.టి.బి.పి.) శ్రీ ఆనంద్ స్వరూప్;  డి.జి.హెచ్.ఎస్. డాక్టర్ రాజీవ్ గార్గ్;  ఐ.సి.ఎమ్.ఆర్.,ఎపిడెమియోలజీ & కమ్యూనికబుల్ డిసీజెస్ అధిపతి డాక్టర్ రామన్ గంగాఖేడ్కర్;  జె.ఎస్. (ఎమ్.ఓ.హెచ్.ఎఫ్.డబ్ల్యూ.) శ్రీ లవ్ అగర్వాల్ తో పాటు ఎన్.సి.డి.సి.;  ఆర్మీ, ఐ.టి.బి.పి., ఫార్మా, డి.జి.సి.ఏ.; టెక్సటైల్స్ విభాగాలకు చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. 

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

                 : https://www.mohfw.gov.in/.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు : 
          technicalquery.covid19[at]gov[dot]in 

 ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు:ncov2019[at]gov[dot]in .

ట్విట్టర్ హేండిల్  @CovidIndiaSeva  పై కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. 

 కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075 (టోల్ ఫ్రీ) ని సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

***** 



(Release ID: 1618249) Visitor Counter : 214