ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 పై తాజా సమాచారం

Posted On: 24 APR 2020 5:32PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్-19 నివారణనియంత్రణ మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం వివిధ రాష్ట్రాలు  / కేంద్రపాలిత ప్రాంతాలతో కలిసి అనేక చర్యలు చేపడుతోంది.    వీటిని క్రమం తప్పకుండా ఉన్నత స్థాయిలో పర్యవేక్షిస్తోంది.  

ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న పంచాయితీ సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.  లాక్ డౌన్ చర్యలను అనుసరించడానికి వారు చేస్తున్న కృషిని, అనుభవాలను సర్పంచులు ప్రధానమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి మాట్లాడుతూ, సంక్షోభం మనకు అనేక పాఠాలు నేర్పుతుందనీ, ప్రస్తుత సమయం మనకు  స్వావలంబన అనే గొప్ప పాఠాన్ని నేర్పిందనీ పేర్కొన్నారు. పంచాయితీలు మౌలిక సదుపాయాలను పటిష్ఠపరచుకోవాలనీ, కరోనా యాప్ "ఆరోగ్య సేతు" ను డౌన్ లోడ్ చేసుకోవడంపై అవగాహన పెంచుకోవాలనీ, ప్రధానమంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు

కోవిడ్-19 నిర్వహణ కోసం చేపడుతున్న చర్యలుసంసిద్ధతపై కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈరోజు అన్ని రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, ఆరోగ్యశాఖ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యల పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదౌతున్న జిల్లాలు, కేసుల సంఖ్య రెట్టింపౌతున్న జిల్లాలు, మృతుల సమాఖ్య ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు

డాక్టర్ హర్ష వర్ధన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ  పర్యవేక్షణ, ప్రతి ఇంటికీ వెళ్లి కేసులు గుర్తించడం, కేసులను ముందుగా గుర్తించడం, సరైన చికిత్సా విధానం పై దృష్టి పెట్టి, రోగులకు సకాలంలో చికిత్స అందే విధంగామరణాల సంఖ్య తగ్గే విధంగా కృషి చేయాలని రాష్ట్రాలను కోరారు.  వైద్యులపై, ఇతర ఆరోగ్య కార్యకర్తలపైన అదేవిధంగా కోవిడ్-19 సోకిన రోగులు, చికిత్స అనంతరం నయం అయిన రోగులపైనా దాడులు జరగకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఆరోగ్యశాఖ మంత్రులు వ్యక్తిగతంగా సమీక్షించాలని కూడా ఆయన కోరారు

అంతకు ముందు డాక్టర్ హర్ష వర్ధన్ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ.) సభ్యదేశాలకు చెందిన ఆరోగ్య శాఖ మంత్రులందరితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ, కోవిడ్-19 నిర్వహణ లో భారతదేశం అనుసరిస్తున్న వ్యూహాన్ని తెలియజేశారు.  సామాజిక బాధ్యత మరియు నియంత్రణ చర్యలు అనే రెండు ప్రధాన సూత్రాల ఆధారంగా భారతదేశ నిర్వహణ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు

గతంలో కొన్ని కేసులు నమోదైన దేశంలోని 15 జిల్లాల్లో,  గత 28 రోజులు నుండీ ఈ రోజు వరకు, కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  ఇప్పటికే హైలైట్ చేసిన జిల్లాలతో పాటు మరో మూడు కొత్త జిల్లాలు ఈ జాబితాలో చేరాయి. అవి : ఛత్తీస్ గఢ్ నుండి దుర్గ్ మరియు రాజనంద్ గావ్; మధ్యప్రదేశ్ నుండి శివపురి 

గత 14 రోజులుగా 23 రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలకు చెందిన మొత్తం 80 జిల్లాల నుండి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.  

ప్రజలకు ఉపయోగపడే ఆరోగ్యపరమైన సమాచారంతో పాటు పౌరులు అడిగే ప్రశ్నలకు శిక్షణ పొందిన నిపుణుల ప్రామాణికమైన సమాధానాల కోసం ఏర్పాటు చేసిన @CovidIndiaSeva ట్విట్టర్ హేండిల్ ను చూడండి 

ఇంతవరకు, 20.57 శాతం రికవరీ రేట్ తో, 4,748 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుండి విడుదల అయ్యారు.  నిన్నటి నుండి 1684 కొత్త కేసులు నమోదయ్యాయి. 

భారతదేశంలో ఇంతవరకు, 23,077 కేసులను కోవిడ్-19 పాజిటివ్ గా ధృవీకరించారు.  718  మరణాలు నమోదయ్యాయి.    

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలుమార్గదర్శకాలుసలహాలుసూచనలపై ప్రామాణికమైనతాజా సమాచారం కోసం  వెబ్ సైట్ ను క్రమం తప్పకుండా సందర్శించండి : 

                 : https://www.mohfw.gov.in/.

కోవిడ్-19 కు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు : 
          technicalquery.covid19[at]gov[dot]in 

 ఇతర సందేహాలుఅనుమానాలకు పరిష్కారాలను దిగువ పేర్కొన్న  మెయిల్ ను సంప్రదించడం  ద్వారా తెలుసుకోవచ్చు :  
            ncov2019[at]gov[dot]in .

కోవిడ్-19 పై ఎటువంటి అనుమానాలుసమస్యలుసమాచారానికైనాఆరోగ్యంకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఉచిత  హెల్ప్ లైన్ నెంబర్ :    +91-11-23978046  లేదా  1075 (టోల్ ఫ్రీ) ని సంప్రదించవచ్చు. 

వివిధ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన కోవిడ్-19 హెల్ప్ లైన్ నెంబర్ల జాబితా మరియు ఇతర సమాచారం కోసం  వెబ్ సైట్ ని చూడండి : 
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

 *****


(Release ID: 1617995) Visitor Counter : 228