రక్షణ మంత్రిత్వ శాఖ
సాయుధ దళాల కార్యాచరణ మరియు కోవిడ్ -19 సంసిద్ధతను సమీక్షించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్
Posted On:
24 APR 2020 3:55PM by PIB Hyderabad
కార్యాచరణ సంసిద్ధతతో పాటు కోవిడ్ -19 తో పోరాడేందుకు సాయుధ దళాలు తీసుకున్న చర్యల గురించి రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమాండర్స్ ఇన్ చీఫ్ తో సమీక్ష నిర్వహించారు.
రక్షణ మంత్రితో పాటు రక్షణ సిబ్బంది చీఫ్ మరియు మిలటరీ వ్యవహారాల కార్యదర్శి జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నారావణే, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భథౌరియా, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ మియు కార్యదర్శి (డిఫెన్స్ ఫైనాన్స్) శ్రీమతి గార్గి కౌల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రక్షణ మంత్రి తన ప్రసంగంలో స్థానిక పౌర పరిపాలనకు అందించిన సహాయం మరియు కోవిడ్ -19 పోరాటానికి తీసుకున్న సన్నాహక చర్యల విషయంలో సాయుధ దళాల పాత్రను ప్రశంసించారు.
కోవిడ్ -19తో పోరాడుతున్నప్పుడు తమ శక్తిన కార్యాచరణ సంసిద్ధత కోసం నిర్థారించాలని, ప్రస్తుత పరిస్థితులతో పోరాడుతున్న సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకూడదని సూచించారు.
కోవిడ్ -19 నేపథ్యంలో ఎదురౌతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని, వృధా చేయకుండా ఆర్థిక వనరులను ఖర్చు చేయాలని ఆయన బలగాలను ఆదేశించారు.
సాయుధ దళాల ఉమ్మడి అవసరాన్ని నొక్కి చెప్పిన రక్షణ మంత్రి, త్వరగా సాధించగల పనులను గుర్తించి ప్రాధాన్యత ఇవ్వాలని మరియు లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంలో సాయం చేయాలని కమాండర్స్ ఇన్ చీఫ్ ను కోరారు.
దళాలలో వైరస్ సంక్రమణను నివారించడానికి మరియు స్థానిక పౌర పరిపాలనుకు అందించిన సహాయం గురించి కమాండర్స్ ఇన్ చీఫ్ లు రక్షణ మంత్రికి వివరించారు. కోవిడ్ -19 ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు సంచిక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ మరియు ఇతర ఏజెన్సీలు జారీ చేసిన సలహాల ప్రకారం ప్రోటోకాల్స్ మరియు కసరత్తులలో తగిన మార్పులు ప్రవేశపెట్టడం మరియు మాజీ సైనికులు మరియు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవడం తదితర అంశాల గురించి తెలియజేశారు.
ఆస్పత్రుల ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడానికి అవసరమైన వైద్య సామగ్రిని సకాలంలో సేకరించేలా చేసిన రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అత్యవసర ఆర్థిక అధికారాలను పంపిణీ చేయడాన్ని కమాండర్లు ప్రశంసించారు.
కోవిడ్ -19తో వ్యవహరించడంలో భాగంగా అదనపు మానవశక్తిని పెంచడంతో పాటు వారికి ప్రాథమిక శిక్షణ ఇవ్వడం ద్వారా అంటువ్యాధిని ఎదుర్కోవడానికి సహాయాన్ని మెరుగు పరిచే బాధ్యతను సాయుధ దళాలు సమగ్రంగా స్వీకరించాయి.
దళాలతో పాటు స్థానిక పౌర పరిపాలన కోసం ఐసోలేషన్ మరియు దిగ్బంధం సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు కమాండర్లు తెలియజేశారు. పౌర పరిపాలన కోరితే స్థానికంగా అవసరమైన సేవలను నిర్వహించడానికి వారు సంసిద్ధతను వ్యక్తం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ఈ కింది కమాండెంట్ లు పాల్గొన్నారు.
నార్తర్న్ కమాండ్, ఉధంపూర్; ఈస్టర్న్ కమాండ్, కోల్‌కతా; సదరన్ నావల్ కమాండ్, కొచ్చి; వెస్ట్రన్ నావల్ కమాండ్, ముంబై; సదరన్ కమాండ్, పూణే; సౌత్-వెస్ట్రన్ కమాండ్, జైపూర్; వెస్ట్రన్ ఎయిర్ కమాండ్, ఢిల్లీ; తూర్పు నావికాదళం, విశాఖపట్నం; సెంట్రల్ ఎయిర్ కమాండ్, అలహాబాద్; నైరుతి ఎయిర్ కమాండ్, గాంధీనగర్; సదరన్ ఎయిర్ కమాండ్, త్రివేండ్రం; సెంట్రల్ కమాండ్, లక్నో; మరియు అండమాన్ & నికోబార్స్ కమాండ్, పోర్ట్ బ్లెయిర్.
--
(Release ID: 1617827)
Visitor Counter : 203
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam