ఆయుష్

ఆయుష్ ఆరోగ్య సంరక్షణ విభాగాల నుండి కోవిడ్-19కు పరిష్కారాల శోధ‌న‌

Posted On: 24 APR 2020 12:10PM by PIB Hyderabad

కోవిడ్‌-19 రోగ నిరోధకత మరియు క్లినికల్ మేనేజ్‌మెంట్ నిర్వ‌హ‌ణ‌ / ఔష‌ధాల ప్రభావాన్ని అంచనా వేసేందుకు గాను స్వల్పకాలిక పరిశోధన ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చే యంత్రాంగాన్ని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కోవిడ్‌-19 కేసుల నిర్వహణలో పాల్గొంటున్న వివిధ  ఆసుపత్ర‌లు / సంస్థలు ఎక్స్‌ట్రామ్యూరల్ (అనగా ఆయుష్ మంత్రిత్వ శాఖ వెలుపల ఉన్న సంస్థ‌లు) పరిశోధన విభాగంలోకి వచ్చే వారు ఈ పథకంలో పాలుపంచుకొనేందుకు గాను ఆహ్వానించబడ్డాయి. సార్స్‌-సీఓవీ-2 (SARS-CoV-2) సంక్రమణ మరియు కోవిడ్‌-19 వ్యాధి యొక్క రోగనిరోధకత మరియు క్లినికల్ నిర్వ‌హ‌ణ విష‌యంలో ఆయుష్ శాఖ కార్య‌క్ర‌మాలు/ వివిధ ఔష‌ధాల పాత్ర మరియు వాటి ప్రభావాన్ని అంచనా వేసే దిశ‌గా ఈ స‌రికొత్త ప‌రిశోధ‌నా ప్రతిపాదనలు ఉండాలి. ఇన్‌స్టిట్యూష‌న‌ల్ ఎథిక్స్ క‌మిటీ (ఐఈసీ) క్లియరెన్స్‌తో గరిష్టంగా ఆరు నెలల వ్యవధి గల ప్రాజెక్ట్ ప్రతిపాదనల‌కు సంబంధించి ఖర్చులకు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆర్థిక సాయాన్ని అందించ‌నున్నారు.ఆయుష్ వైద్యులు, సాంకేతిక మానవశక్తి, ప్రయోగశాల పరిశోధనలతో పాటు వివిధ సంఘ‌టిత వ్య‌యాల నిమిత్తం ఈ రూ.10 ల‌క్ష‌ల ఆర్ధిక సాయం అందించ‌నున్నారు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు సమర్పించే విధానం, దరఖాస్తు ఫార‌ముతో సహా ఇత‌ర అన్ని వివరాలు ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ ayush.gov.in నందు అందుబాటులో ఉన్నాయి. లేదా https://main.ayush.gov.in/event/mechanism-support-short-term-research-projects- evaluating-impact-ayush-interventions-cum.
వెబ్‌పేజీకి లింక్ ద్వారా కూడా వివ‌రాలు పొంద‌వ‌చ్చు. దరఖాస్తులు కేవ‌లం ఈ-మెయిల్ ద్వారా మాత్రమే స్వీకరించబడుతాయి. ఆస‌క్తి క‌లిగిన వారు emrayushcovid19[at]gmail[dot]com అనే చిరునామాకు త‌న ప్ర‌తిపాద‌న‌ల‌ను పంపాలి. శోధ‌న ద‌ర‌ఖాస్తులు పంప‌డానికి ఆఖ‌రి తేదీ 01.05.2020గా నిర్ణ‌యించినట్టుగా ఆయూష్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

***



(Release ID: 1617773) Visitor Counter : 199