ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 అప్‌డేట్స్

Posted On: 23 APR 2020 5:46PM by PIB Hyderabad

ముంద‌స్తు చ‌ర్య‌లు , సానుకూల విధానాలు, గ్రేడెడ్ రెస్పాన్స్ పాల‌సీలో భాగంగా రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్షిస్తున్నారు.

కోవిడ్ -19  నేప‌థ్యంలో, ఎపిడ‌మిక్ డిసీజెస్ యాక్ట్‌న 1897ను స‌వ‌రించేందుకు  ఆర్డినెన్సును జారీచేశారు. ఈ ఆర్డినెన్సును ఎపిడ‌డ‌మిక్ డిసీజెస్‌(యాక్ట్‌0 ఆర్డినెన్స్ -2020 అని పిలుస్తున్నారు. ఇది , ఏ వ్య‌క్తీ , ఆరోగ్య సంర‌క్ష‌కుల‌పై ఏర‌క‌మైన హింస‌కు పాల్ప‌డ‌కుండా , ఈ అంటు వ్యాధి స‌మ‌యంలో ఆస్థులు ధ్వంసం చేయ‌రాద‌ని సూచిస్తోంది. ఈ స‌వ‌ర‌ణ‌లు, ఎవరైనా హింస‌కు పాల్ప‌డితే దానిని శిక్షించ‌ద‌గిన నేరంగా, బెయిల్ ఇవ్వ‌డానికి వీలులేని నేరంగా ప‌రిగ‌ణిస్తుంది.  నేరానికి పాల్ప‌డ‌డం లేదా నేరాన్ని ప్రోత్స‌హించ‌డం వంటివి మూడు నెల‌ల నుంచి ఐదు సంవ‌త్స‌ర‌ముల వ‌ర‌కు శిక్ష‌, తీవ్రంగా గాయ‌ప‌ర‌చిన సంద‌ర్భంలో ఆరు నెల‌ల నుంచి ఏడు సంవ‌త్స‌ర‌ముల వ‌రకు శిక్ష‌, ల‌క్ష రూపాయ‌ల నుంచి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా విధించ‌డానికి వీలు క‌ల్పిస్తుంది. దీనితోపాటు నేరానికి పాల్ప‌డిన వ్య‌క్తి బాధితుల‌కు ధ్వంస‌మైన ఆస్థి మార్కెట్ విలువ‌కు రెండు రెట్లు లేదా న‌ష్ట‌పోయిన మొత్తాన్ని ( కోర్టునిర్ణ‌యించిన ప్ర‌కారం) చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది.

ఇవాల్టి వ‌ర‌కు , గ‌త  28 రోజులు అంత‌కు పైబ‌డి ఒక్క కేసుకూడా న‌మోదు కాని జిల్లాలు 12 వ‌ర‌కు ఉన్నాయి.  2020 ఏప్రిల్ 21 నుంచి ఇవాల్టివ‌ర‌కు ఎనిమిది కొత్త జిల్లాలు ఇందులో చేరాయి. అవి, చిత్ర‌దుర్గ (క‌ర్ణాట‌క‌),బిలాస్‌పూర్ (ఛత్తీస్‌గ ఢ్‌), ఇంఫాల్ వెస్ట్ (మణిపూర్), ఐజ్వాల్ వెస్ట్ (మిజోరం), భద్రాద్రి కొత్త‌గూడెం (తెలంగాణ), పిలిభిత్ (యుపి), ఎస్బిఎస్ నగర్ (పంజాబ్) , దక్షిణ గోవా (గోవా).
23 రాష్ట్రాలు ,కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లోనూ గ‌త 14 రోజుల‌లో ఎలాంటి కేసులు న‌మోదు కాలేదు.

ఇప్ప‌టి వ‌ర‌కూ , 4,257 మంది కి వ్యాధి న‌యం అయింది. వ్యాధి రిక‌వ‌రీ రేటు 19.89 శాతంగా ఉంది. నిన్న‌టినుంచి 1409 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 21 ,393కేసులు పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యాయి.

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు పంప‌వచ్చు.

కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .



(Release ID: 1617600) Visitor Counter : 208