మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను ఢిల్లీలో విడుదల చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా కేలండర్‌ను 16 ఏప్రిల్ 2020 న విడుదల చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
Posted On:
23 APR 2020 1:39PM by PIB Hyderabad
కోవిడ్ -19 కారణంగా విద్యార్థులు ఇంటి వద్ద ఉన్న సమయంలో , ఆ కాలాన్ని తల్లిదండ్రులు, టీచర్ల సహాయంతో ఇంటివద్దే విద్యా సంబంధ కార్యకలాపాల ద్వారా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయికి(ఆరునుంచి 8 వతరగతి), మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ మార్గనిర్దేశంలో ఎన్.సి.ఇ.ఆర్.టి ప్రత్యామ్నాయ విద్యా కేలండర్లను అభివృద్ధి చేసింది.
ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ఈ ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు న్యూఢిల్లీలో విడుదల చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకుప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్‌ను కేంద్ర హెచ్.ఆర్.డి మంత్రి ఈనెల 16న విడుద చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ పోఖ్రియాల్,ఈ కేలండర్ వివిధ సాంకేతిక ఉపకరణాలు, సామాజిక మాధ్యమాల ఉపకరణాలను ఆసక్తికరమైన రీతిలో ,హాయిగా విద్యనేర్పడానికి ఉపయోగించడంలో తగిన మార్గదర్శకాలు ఇస్తుంది.దీనిని అభ్యాసకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇంటి వద్దే ఉంటూ వాడవచ్చు.
అయితే, మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్ఎం.ఎస్ ఇతర సామాజిక మాధ్యమాల వంటి వాటి అందుబాటు స్థాయిని ఇది పరిగణనలోకి తీసుకుంది. మనలో చాలామందికి మొబైల్ ఫోన్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉండకపోవచ్చు లేదా వివిధ రకాల సామాజిక మాధ్యమాల ఉపకరణాలను అంటే వాట్సప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ వంటివాటిని ఉపయోగించకపోవచ్చు. అందువల్ల ఈ కేలండర్ మొబైల్ ఫోన్‌లోని ఎస్.ఎం.స్, లేదా మొబైల్ ఫోన్ లేదా వాయిస్ కాల్‌ద్వారా తల్లిండ్రులకు, విద్యార్థులకు
మార్గ నిర్దేశం చేయాల్సిందిగా సూచిస్తోంది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా కేలండర్ అమలు చేయడంలో తల్లిదండ్రులు సహాయపడగలరని భావిస్తున్నారు.
త్వరలోనే మిగిలిన తరగతులైన 9 నుంచి 12 వరకు , ఈ కేలండర్ కింద వివిధ సబ్జెక్టులకు సంబంధించి తెలియజేస్తారు. ఈ కేలండర్ దివ్యాంగులైన పిల్లలతోపాటు అందరి అవసరాలను తీరుస్తుంది. (ప్రత్యేక అవసరాలు గల పిల్లలు) - ఆడియో పుస్తకాలు, రేడియో కార్యక్రమాలు, వీడియో కార్యక్రమాల లింకులను ఇందులో చేర్చనున్నారు.
ఈ కేలండర్‌లో వారం వారీగా సిలబస్‌లేదా పాఠ్యపుస్తకానిక సంబంధించి ఆసక్తికరమైన , ఛాలెంజింగ్ కార్యకలాపాలను పొందుపరచనున్నారు. అన్నింటికంటే ముఖ్యమైదని, వారు ఏం నేర్చుకున్నారో తెలియజెప్పే థీమ్‌లను పొందుపరుస్తుంది. ఇలా విద్యార్థి ఏం నేర్చుకున్నారొ గుర్తించగలిగే థీమ్‌లు ఇవ్వడానికి కారణం, టీచర్లు, తల్లిదండ్రులు పిల్లల అభ్యసన సామర్ధ్యాలను అంచనావేయడానికి, అలాగే పాఠ్యపుస్తకాలకుమించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కేలండర్‌లో ఇచ్చిన కార్యకలాపాలు అభ్యసన ఫలితాలపై దృష్టిపెట్టేవిగా ఉంటాయి. ఆ రకంగా పిల్లలు ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో వాడుతున్న పాఠ్యపుస్తకాలు, లేదా ఇతర అభ్యసన వనరులతో వేటితోనైనా వీటిని సాధించవచ్చు.
ప్రయోగాత్మక అభ్యసన కార్యకలాపాలైన కళలు, వ్యాయామం, యోగా, పూర్వ - వృత్తివిద్యా నైపుణ్యాలు వంటివాటిని కూడా ఇది పొందుపరుస్తుంది. ఈ కేలండర్‌లో తరగతి వారీగా, సబ్జెక్ట్ వారీగా పట్టిక రూపంలో కార్యకలాపాలు ఇవ్వబడతాయి. ఈ కేలండర్ కార్యకలాపాలు సబ్జెక్ట్ ఏరియాలుగా నాలుగు భాషలకు సంబంధించి ఉంటాయి. అవి హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ, సంస్కృతం. ఈ కేలండర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఒత్తిడి,ఆందోళన తగ్గించే వ్యూహాలకూ అవకాశం కలిగిస్తుంది. ఈ కేలండర్ చాప్టర్‌వారీగా ఈ- పాఠశాలలో గల ఈ కంటెంట్, ఎన్.ఆర్.ఒ.ఇ.ఆర్, భారత ప్రభుత్వ దీక్ష పోర్టల్
ల లింక్ ను సూచిస్తుంది.
ఈ కేలండర్‌లో పొందుపరిచిన కార్యకలాపాలన్నీ సూచనాత్మకమైనవే అంతేకాని తప్పనిసరిగా చేయాల్సినవి కావు. ఉపాధ్యాయుఉల, తల్లిదండ్రులు ఆయా సందర్బానుసారమైన కార్యకలాపాలను, విద్యార్థులు ఆసక్తి కనబరచిన వాటితో వరుసక్రమంతో సంబంధం లేకుండా వారితో చేయించవచ్చు
ఎ .సి.ఇ.ఆర్.టి ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో టీవీ ఛానల్ స్వయం ప్రభ( కిషోర్‌మంచ్)( ఇది డిటిహెచ్ ఉచిత చానల్ 128, డిష్‌టివి ఛానల్ # 950, సన్ డైరక్ట్#793, జియో టివి, టాటా స్కై#736, ఎయిర్‌టెల్ ఛానల్ #440, వీడియోకాన్ ఛానల్ #477) ద్వారా ఇంటరాక్టివ్ సెషన్‌లను నిర్వహిస్తోంది.
కిశోర్ మంచ్ యాప్‌ను ప్లేస్టోర్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, యూ ట్యూబ్ లైవ్ ( ఎన్‌సిఇఆర్‌టి అధికారిక ఛానల్) రోజూ సోమవారం నుంచి శనివారం వరకు ఈ సెషన్‌లు ప్రైమరీ తరగతులకు ఉదయం 11 గంటలనుంచి 1 గంట వరకు, అప్పర్ ప్రైమరీ తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రసారం చేయబడుతున్నాయి. దీనికి తోడు, వీక్షకులతో మాట్లాడడం, ఆయా అంశాలపై బోధనతోపాటు వారి చేత చేయించడం ఈ లైవ్ సెషన్‌లలో వాటిని చూపించడం వంటివి ఉంటాయి. ఈ కేలండర్ ఎస్.సి.ఇ.ఆర్.టిలు ఎస్.ఐ.ఇలు , డైరక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నవోదయ విద్యాలయ సమితి, సిబిఎస్ఇ స్టేట్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారాప్రదర్శించడం జరుగుతుంది..
ఈకేలండర్ మన విద్యార్థులు, టీచర్లు, పాఠశాల ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రులకు ప్రస్తుత కోవిడ్ -19 ను ఎదుర్కొనేందుకు ఒక సానుకూల అంశంగా పనికి వస్తుంది.ఆన్ లైన్ బోధన, అభ్యసన వనరులు, అభ్యసన ఫలితాలను మెరుగు పరచుకోవడం , పాఠశాల విద్యను ఇంటి వద్దనే పొందడం వంటివి వారికి సాధికారతను కల్పిస్తాయి.
ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల స్థాయిలోప్రత్యామ్నాయ విద్యా కేలండర్ ను ఇంగ్లీషులో పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థుల స్థాయిలోప్రత్యామ్నాయ విద్యా కేలండర్ ను హిందీలో పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి
*****
(Release ID: 1617490)
Visitor Counter : 315
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam