పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిర్విరామంగా కృషి చేస్తున్న లైఫ్ లైన్ ఉడాన్ కి చెందిన కరోనా యోధులు

ఈ రోజువరకు 330 విమానాల్లో 551 టన్నులకు పైగా వైద్య సామాగ్రి రవాణా.

Posted On: 22 APR 2020 6:01PM by PIB Hyderabad

కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశంలోని మారుమూల ప్రాంతాలకు అవసరమైన వైద్య సామాగ్రి రవాణా చేయడానికి ఎమ్.ఓ.సి.ఏ. "లైఫ్ లైన్ ఉడాన్" విమానాలను నడుపుతోంది. కోవిడ్-19 కు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటానికి మద్దతుగా ముఖ్యమైన భాగస్వాములతో సహా అధికారులు, సిబ్బంది, క్షేత్రస్థాయి కార్మికులు కరోనా యోధులుగా నడుం బిగించి ముందుకువచ్చి నిర్విరామంగా కృషి చేస్తున్నారు.

ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్, ఐ.ఏ.ఎఫ్. మరియు ప్రైవేట్ విమానయాన సంస్థలు లైఫ్ లైన్ ఉడాన్ కింద 330 విమానాలను నడిపాయిఇందులో రెండు వందల విమానాలను ఎయిర్ ఇండియా, అలయన్స్ ఎయిర్ సంస్థలు నడిపాయివీటి ద్వారా ఇంతవరకు 551.79 టన్నుల సరుకు రవాణా అయ్యింది.  లైఫ్ లైన్ ఉడాన్  విమానాలు ఇంతవరకు 3,27,623 కిలోమీటర్ల మేర వాయు మార్గంలో ప్రయాణించాయి

రోజువారీ లైఫ్ లైన్ ఉడాన్ విమాన సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి:

క్రమ సంఖ్య 

తేదీ 

ఎయిర్ ఇండియా 

Alliance అలయన్స్ 

ఐ.ఏ.ఎఫ్. 

ఇండిగో 

స్పైస్ జెట్ 

మొత్తం 

1

26.3.2020

2

-

-

-

2

4

2

27.3.2020

4

9

1

-

-

14

3

28.3.2020

4

8

-

6

-

18

4

29.3.2020

4

9

6

-

-

19

5

30.3.2020

4

-

3

-

-

7

6

31.3.2020

9

2

1

-

-

12

7

01.4.2020

3

3

4

-

-

10

8

02.4.2020

4

5

3

-

-

12

9

03.4.2020

8

-

2

-

-

10

10

04.4.2020

4

3

2

-

-

9

11

05.4.2020

-

-

16

-

-

16

12

06.4.2020

3

4

13

-

-

20

13

07.4.2020

4

2

3

-

-

9

14

08.4.2020

3

-

3

-

-

6

15

09.4.2020

4

8

1

-

-

13

16

10.4.2020

2

4

2

-

-

8

17

11.4.2020

5

4

18

-

-

27

18

12.4.2020

2

2

-

-

-

4

19

13.4.2020

3

3

3

-

-

9

20

14.4.2020

4

5

4

-

-

13

21

15.4.2020

2

5

-

-

-

7

22

16.4.2020

9

-

6

-

-

15

23

17.4.2020

4

8

-

-

-

12

24

18.4.2020

5

-

9

-

-

14

25

19.4.2020

4

-

9

-

-

13

26

20.4.2020

8

4

3

-

-

15

27

21.4.2020

4

-

10

-

-

14

 

మొత్తం 

112

88

122

6

2

33

 

జమ్మూకశ్మీర్, లడఖ్, దీవులు, ఈశాన్యప్రాంతాల్లో కీలకమైన వైద్య సామాగ్రినిరోజులను తరలించడానికి పవన్ హన్స్ లిమిటెడ్ తో సహా హెలికాప్టర్ సర్వీసులను ఉపయోగించారు.   2020 ఏప్రిల్ 21వ తేదీ వరకు పవన్ హన్స్ సంస్థ 6,537 కిలోమీటర్లు ప్రయాణించి 1.90 టన్నుల సామాగ్రిని రవాణా చేసింది. 
 
దేశీయంగా లైఫ్ లైన్ ఉడాన్ రవాణా చేసిన సామాగ్రిలో కోవిడ్-19 కు సంబంధించిన రసాయనాలుఎంజైములు, వైద్య పరికరాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ), మాస్కులుగ్లౌజులుఎల్.ఎల్. మరియు ఐ.సి.ఎం.ఆర్. కు చెందిన ఇతర వస్తువులతో పాటు రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలు కోరిన వస్తువులు, తపాలా శాఖకు చెందిన పార్సిళ్లు ఉన్నాయి
 
ఈశాన్య ప్రాంతం, దీవులు, పర్వత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఎయిర్ ఇండియా మరియు ఐ.ఏ.ఎఫ్. రెండు సంస్థలు ప్రధానంగా జమ్మూకశ్మీర్, ఈశాన్య ప్రాంతం మరియు ఇతర దీవుల ప్రాంతాలపై కలిసి పని చేస్తున్నాయి దృష్టి పెట్టాయి.
 
దేశీయ కార్గో ఆపరేటర్లైన స్పైస్ జెట్, బ్లూ డార్ట్ఇండిగో సంస్థలు వాణిజ్య పరంగా కార్గో విమానాలను నడిపాయి2020 మార్చ్ 24వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు స్పైస్ జెట్ సంస్థకు చెందిన  447 కార్గో విమానాలు 7,12,323 కిలోమీటర్లు ప్రయాణించి, 3,695 టన్నుల వస్తువులను రవాణా చేశాయి ఇందులో 154 అంతర్జాతీయ కార్గో విమానాలు ఉన్నాయి2020 మార్చ్ 25వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు బ్లూ డార్ట్ సంస్థకు చెందిన 160 కార్గో విమానాలు 1,58,684 కిలోమీటర్లు ప్రయాణించి, 2,573 టన్నుల వస్తువులను రవాణా చేశాయి.  2020 ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు ఇండిగో సంస్థకు చెందిన 35 కార్గో విమానాలు 42,752 కిలోమీటర్లు ప్రయాణించి, 84 టన్నుల వస్తువులను రవాణా చేశాయి.  ఇందులో ప్రభుత్వం కోసం ఉచితంగా రవాణా చేసిన వైద్య పరమైన వస్తువులు కూడా ఉన్నాయి
అంతర్జాతీయ రంగం లో - 
ఫార్మస్యూటికల్స్, వైద్య పరికరాలుకోవిడ్-19 సహాయ సామాగ్రి రవాణా చేయడం కోసం తూర్పు ఆసియాతో ఒక కార్గో ఎయిర్ బ్రిడ్జి ఏర్పాటుచేసుకోవడం జరిగింది
 
రోజువారీ దిగుమతి చేసుకున్న వైద్య సామాగ్రి పరిమాణాల వివరాలు ఇలా ఉన్నాయి:

క్రమ సంఖ్య 

తేదీ 

నుండి 

పరిమాణం (టన్నుల్లో)

1

04.4.2020

షాంఘై 

21

2

07.4.2020

  హాంగ్ కాంగ్  

06

3

09.4.2020

షాంఘై

22

4

10.4.2020

షాంఘై

18

5

11.4.2020

షాంఘై

18

6

12.4.2020

షాంఘై

24

7

14.4.2020

హాంగ్ కాంగ్  

11

8

14.4.2020

షాంఘై

22

9

16.4.2020

షాంఘై

22

10

16.4.2020

హాంగ్ కాంగ్  

17

11

16.4.2020

సియోల్ 

05

12

17.4.2020

షాంఘై

21

13

18.4.2020

షాంఘై

17

14

18.4.2020

సియోల్  

14

15

18.4.2020

గుయాంగ్జ్హో 

04

16

19.4.2020

షాంఘై

19

17

20.4.2020

షాంఘై

26

18

21.4.2020

షాంఘై

19

19

21.4.2020

హాంగ్ కాంగ్ 

16

 

 

మొత్తం 

322

కృషి ఉడాన్ కార్యక్రమం కింద ఎయిర్ ఇండియా తన రెండవ విమానాన్ని ముంబై - ఫ్రాంక్ ఫర్ట్ మధ్య 2020 ఏప్రిల్ 15వ తేదీన  27 టన్నుల  సీజన్ లో లభించే పండ్లు, కూరగాయలతో నడిపింది.  ఫ్రాంక్ ఫర్ట్ నుండి 10 టన్నుల సాధారణ సామాగ్రితో తిరిగి వచ్చింది.  కృషి ఉడాన్ కార్యక్రమం కింద ఎయిర్ ఇండియా తన మొదటి విమానాన్ని ముంబై - లండన్ మధ్య 2020 ఏప్రిల్ 13వ తేదీన  28.95 టన్నుల  పండ్లు, కూరగాయలతో నడిపింది.  లండన్ నుండి 15.6 టన్నుల సాధారణ సామాగ్రితో తిరిగి వచ్చింది. 

ఎయిర్ ఇండియా ఇతర దేశాలకు  క్లిష్టమైన మందుల సరఫరా కోసం ప్రత్యేకంగా కార్గో విమానాలను కేటాయించింది.  అటువంటి విమాన సర్వీసు ఒకటి 2020 ఏప్రిల్ 15వ తేదీన ఢిల్లీ - సీషెల్స్ - మారిషస్ - ఢిల్లీ మార్గంలో ప్రయాణించి 3.4 టన్నుల వైద్య సామాగ్రిని సీషెల్స్ కు, 12.6 టన్నుల వైద్య సామాగ్రిని మారిషస్ కు రవాణా చేసింది.

****



(Release ID: 1617332) Visitor Counter : 196